ఆంధ్రా రాష్ట్ర విద్యాశాఖ అమాత్యులు, రాష్ట్ర మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు కు - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1209 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1239 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

గౌరవ ఆంధ్రా రాష్ట్ర విద్యాశాఖ అమాత్యులు ఆదిమూలపు సురేష్ గారికి, అలాగే బాధ్యత గల రాష్ట్ర మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు కు నమస్కరించి వ్రాయునది,

అమాత్యా మరియు విద్యా అధికారులారా, గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దైవం అంటారు. అమ్మ నాన్న తర్వాత స్ధానం, మన గురువుదే.

ఈరోజు ఈ 4 అక్షరాలు రాస్తున్నాము అంటే కారణం, నాటి ఉత్తమ గురువులే. గురువు లందరికీ తలవంచి నమస్సుమాంజలి.

* గత ప్రభుత్వం, ప్రవేటు విద్య కోట్ల సంపాదన కు రాజబాట వేసింది, ప్రభుత్వ విద్యను నాశనం చేసి. link.

జగనన్న సరిచేసే ప్రయత్నం బాగుంది, కానీ ఫలితాలు వాస్తవముగా ప్రజలకు చేరుతుంది, లేనిదీ తెలియడం లేదు. స్ధానిక సోషల్ మీడియా ఉంటే, స్ధానిక ప్రజలు లోపాలను ఎత్తి చూపుతారు. వెబ్సైట్ లింక్ లు ఉన్నాయా? జిల్లా మండలాల వారీగా.

* ఫీజు రీయింబర్స్మెంట్ లో, జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేశారా? వాటి కోసమే పెట్టిన, ఉత్తుత్తి కాలేజీలు మూసారా? విద్యార్థులు రాకపోయినా లేకపోయినా కూడా, హాజరు వేసి, ఫీజు తీసుకునే ఉత్తుత్తి కాలేజీలు కు, బుద్ధి చెప్పారా? ఎక్కడ ఉంది చర్యలు సాక్ష్యం, ప్రభుత్వ సోషల్ మీడియాలో?

* పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు గురించి చర్చ జరుగుతోంది. జగనన్న సమాధానం బాగుంది, పరీక్షలు లేకుండా, పాస్ మార్కుతో భవిష్యత్తు నాశనం, కాబట్టి హాజరు అయి, వీలైనంత ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం మంచిది, పై చదువు లకు ఉత్తమం అని.

ప్రతిపక్షం ఈ విషయం వివరంగా చెప్పదు, పాస్ మార్క్ తోనే వెళితే, పై చదువుకు ఇబ్బంది అని.

మధ్యే మార్గం గా, ఫీజు కట్టి పరీక్ష కు రాని వారిని, బలవంతంగా కరోనా సమయము లో రమ్మనకుండా, మిగతా రాష్ట్రాలు ఇచ్చిన విధముగా, పాస్ మార్కులు ఇస్తే బాగుంటుంది.

కరోనా జాగ్రత్తలతో, పరీక్షలు కు హాజరు అయిన వారికి, రాసిన ప్రతిభను బట్టి మార్కులు ఇవ్వవచ్చు, అని పెద్దల అభిప్రాయం. అప్పుడు ప్రతిపక్షం కూడా, నోరు ఎత్తడానికి లేదు.

కోర్టు చెపితే ఎటూ ఆపాలి. పాల్ దీక్షలో కూడా ఉన్నారు.

* మా ప్రకాశం జిల్లా అదృష్టం కొద్దీ, విద్యా మంత్రి గారు, మా జిల్లా నుంచే.

మరి ఇతర జిల్లా ల కన్నా, మాకేమన్నా ఎక్కువ సౌకర్యాలు, ఫలితాలు, అభివృద్ధి వచ్చాయా? అద్భుతాలు జరిగాయా? ప్రభుత్వ సోషల్ మీడియాలో లేదా ఫేస్బుక్ లో, ఎదైనా సాక్ష్యం ఉందా?

* అన్ని శాఖలు కన్నా, ఉత్తమమైన ఆధునిక సాంకేతిక జ్ఞాన విషయ పరిజ్ఞానం, మన శాఖకే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే, మనది గురువు ల శాఖ.

మనం ఇతర శాఖలకు, మార్గ దర్శకం కావాలి. మరి రాష్ట్ర విద్యా శాఖకు మరియు కనీసం ప్రకాశం జిల్లా లేదా చీరాల మండల విద్యాశాఖ కు, పనిచేసే సొంత సోషల్ మీడియా ఉందా, రోజూ పెడుతున్న సమాచారం తో? లింక్ లు పంపగలరు

* సాంకేతికముగా ఎదగని, ఇతర శాఖల అధికారులు కు కూడా, మీరు క్లాసు లు తీసుకుని, ఇలా మాలాగే సోషల్ మీడియాలో, ప్రభుత్వ సమాచారం పెట్టండి, సహకరించండి అని నేర్పుతున్నారా?

* జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో జరుగుతున్న పనులు సాక్ష్యం, ప్రతి పట్టణ గ్రామ పాఠశాల ల అభివృద్ధి వివరాలు, ఎక్కడ చూడాలి?

ఉదాహరణకు చీరాల మండలం లో, ఏ పాఠశాల లో ఏ మార్పులు జరిగాయో, ఏ స్ధానిక విద్యాశాఖ ఫేస్బుక్ లో చూడాలి?

* ప్రతి మండలం లో అలాగే జిల్లా లో, ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు లేదా మనుమలు, అలాగే ప్రభుత్వ అధికారుల పిల్లలు మనుమలు, ఎంత మంది జగనన్న ప్రభుత్వం లో, ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు? చేరని వారికి చేర్చని, ప్రభుత్వ అధికారులు కు ఉపాధ్యాయులు కు, జీతం లో కోత ఉందా?

* ప్రతి మండల అధికారులు, ఎన్ని ప్రభుత్వ ప్రవేటు పాఠశాలలు సందర్శించారు ప్రతి నెలలో, లోపాలు ఎన్ని సరిచేశారు లాంటి వివిరాలు, ఎక్కడ చూడాలి సోషల్ మీడియా లో?

ఉదాహరణకు చీరాల, వేటపాలెం, పర్చూరు మండల విద్యాశాఖ అధికారులు నెల పనితనం చూపే, సోషల్ మీడియా లింక్ లు ఇవ్వగలరు.

నిర్లక్ష్యము తో ఇప్పుడు వరకు, గమ్ముగా ఉంటే, కనీసం ఇవన్నీ ఇప్పుడు అయినా మొదలు పెట్టి, జగనన్న పరువు ప్రతిష్ట, పెంచే బాధ్యత మనపై ఉంది.

ఉత్తములైన సంస్కారవంతులైన, విద్యా శాఖ అధికారులే ఇంత నిర్లక్ష్యం గా ఉంటే, ఇక ఉపాధ్యాయులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు. ఇక రేపటి మన దేశ పౌరులకు, మంచి భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది?

- - - 5/2/2021

విద్యా మంత్రి గారు, రాష్ట్ర మరియు ప్రకాశం విద్యా శాఖ వారు,

మీరు గనుక మా ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న ను, నిజంగా గౌరవిస్తూ ఉంటే 2 ఏళ్లుగా, వీటికి జవాబు లు చెప్పాలి, ఆత్మాభిమానం చిత్తశుద్ధి ఉంటే.

జవాబు లకు, ప్రభుత్వ సోషల్ మీడియా లింకు లు సాక్ష్యం చూపాలి.

తప్పులు సరిచేసుకుని, ఇప్పుడు అయినా బాధ్యత ఎరిగి నిర్లక్ష్యం వదలి, మా జగనన్న కు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసి, సోషల్ మీడియాలో విస్తృతంగా జగనన్న విద్యా పధకాలు అమలు తీరును జిల్లా, మండల, పట్టణ, గ్రామ స్ధాయి లలో ప్రచారం చేయగలరు, ఫోటో లు వీడియో లతో.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1239 General Articles, 47 Tatvaalu
Dt : 30-Apr-2021, Upd Dt : 30-Apr-2021, Category : Politics
Views : 163 ( + More Social Media views ), Id : 1142 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , state , education , minister , adimulapu , suresh , district , officers
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content