Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. మీరు అధికారులు, నాయకులు అయినా కూడా, ఉద్యోగ బాధ్యత తర్వాత, మానవత్వం ఉన్న బాధ్యత గల మంచి మనుషులే అని నమ్మకం తో, ఇలాంటి వి కూడా మీకు పంపుతున్నాము, మన్నించాలి.
విలేఖరులు, నాయకులు, అధికారులు, వృత్తి బాధ్యత తో పాటుగా, తమ వ్యక్తిత్వం చాటే విధంగా రచనలు చేయాలి, లేదా తమ గురించి ఇతరుల తో చేయించాలి రాయించాలి. అప్పుడే తమ గుణం పై, ఇతరులకు నమ్మకం కలుగుతుంది.
ధనం, మనకు అదృష్టం ఉంటే, క్షణాలు లో, ఎవరికైనా వస్తుంది. ధనం అందరికీ కావాలి, అనుమానం లేదు, కానీ ధనానికి దాసులం కారాదు, మానవత్వం వీడి, దాని వలన ఎప్పుడు అయినా పతనం తప్పదు.
కానీ మంచి గుణం, నిరంతర సాధన తో నే వస్తుంది, ఎక్కువ కాలం నిలుస్తోంది. నిరంతర సాధన తోనే, మనసు పై పట్టు ఉంటుంది, మన మాట వింటుంది.
ఇప్పుడు చూడండి, జగనన్న తలచుకుంటే, క్షణంలో మనకు ఎవరికైనా సమాచార లేదా దేవాదాయ శాఖ లేదా ప్రభుత్వ సలహా దారుడు, పదవి ఇచ్చి లక్షల జీతం, ఫింఛన్ ఇవ్వవచ్చు.
కానీ ట్రంప్, బైడెన్, మోదీ, యోగీ లాంటి అంటే ఎంత శక్తి మంతులు నిబద్దులు కూడా, ఏ వ్యక్తి కీ, తన గుణాన్ని లక్షణాలు ను, క్షణాలు లో మార్చలేరు, వృద్ధి చేయలేరు, మంచి వైపు.
సద్భుద్ది సాధన తో, త్యాగం తో నే, వృద్ధి చెందుతుంది.. సాధారణముగా ఎదుటి వారి త్యాగాలు, మన ఎదుగుదలకు సోపానాలు కదా? మనం మాత్రం త్యాగం చేయము.
అంటే దొంగ బుద్ధి ఉన్న వారిని, మంచి వారి గా మనం వెంటనే మార్చలేము. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత, వారు మారతారు, మంచి వైపు పయనం చిన్నగా మొదలు పెడతారు.
మంచి బుద్ధి ఉన్నవారు ను మాత్రం, వెంటనే చెడగొడతాం. కానీ మంచి బుద్ధి లో పెంచడం మార్చడం, మాత్రం చాలా కష్టం.
చూడండి, ఈ వారంలో మీరు చదివిన నిజ జీవిత కధనం లో కూడా ఉంది ఒక ఉదాహరణ.
అందరూ అమెరికా మిలియనీర్, తమకు ధనం ఇవ్వలేదు, వ్యాపారం ఇవ్వలేదు అని ఏడుస్తూ ఉంటారు. అది సహజం, ఇప్పుడు ఉన్న ధన మోహ ప్రపంచంలో.
కానీ అదే మిలియనీర్, ఛీ నా బతుకు చెడ, నన్ను అవమానించావు, నా అహం దెబ్బతింది, కష్టం లో ఉన్నావని ఆదుకోబోతే నా సహాయం వద్దు అన్నావు, నా మనసు కలుషితం అయిందని, దూరంగా పెట్టావు అని, 2 ఏళ్ల తర్వాత కూడా గుర్తు పెట్టుకుని బాధ పడుతూ, తన ఆక్రోశం ను వెళ్ళగక్కడం. దానికి మన జవాబు కూడా, మీరంతా చదివారు.
బీదవారి మన గుణం గొప్ప దా? మరి మిలియనీర్ ధనం గొప్ప దా? ప్రత్యక్షం గా చూసారు. చదవకపోతే, ఈ వారం లోకం తీరు చూడండి.
అందుకే వెనకటి కి రాజులు కూడా, గుణవంతులకు నమస్కారం చేసి, గౌరవిస్తూ ఉంటారు. వారి సలహాలు దీవెనలు అందుకుంటారు.
ఎందుకంటే, రాజు కు నాయకులకు అధికారులకు, జరగబోయే పతనం ను, స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగేది, గుణవంతుడైన విద్యావంతులు మాత్రమే.
పురాణాలలో కూడా భారతములో విదురుని గుణం, అలాగే హనుమంతుని గుణం గొప్పది, వారికి సామ్రాజ్యం లేదు, సంపద లేదు. వారికి ఎప్పుడూ టెన్షన్ లేదు. మానసిక శాంతి మెండు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,893,765; 104 తత్వాలు (Tatvaalu) and views 227,215 Dt : 29-Apr-2021, Upd Dt : 29-Apr-2021, Category : General
Views : 1172
( + More Social Media views ), Id : 1141 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
money ,
dhanam ,
virtue ,
gunam ,
yuga ,
time Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments