Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. అబ్బా ఇన్ని దైవ శ్లోకాలా అనే ముందు, అబ్బా ఇన్ని సీరియల్స్, సినిమాలు, వాటి పాటలు, కధా నాయకీ నాయకులు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా, వార్తలు, గేంస్, ఫుడ్ రుచులు, తిరుగుళ్ళు, అరిషడ్వర్గాలు, అష్టవ్యసనాలు కు బానిసలము అందామా?
కుజుడు కలహాలకు కారణం అవుతూ ఉంటాడు.అందువల్ల కుజ దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కుజుడి ప్రభావము కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.
పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః
అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా
తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః
పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్తశక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి. వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాంద పురాణం చెబుతోంది.
సుబ్రహ్మణ్యస్వామి వారురాసిభూతమైన జ్ఞానస్వరూపం. సునిసితమైన మేధస్సుకు స్వామి వారి చేతిలో ఉండే శక్తిఆయుధమే ప్రతీక. శివజ్ఞానప్రదాయిని అయిన అమ్మవారికి ప్రసాదించిన దివ్యాయుధమిది. ఇదేఅజ్ఞానమనే తారకాసురుని సంహరించిన జ్ఞానశక్త్యాయుధము.
జ్ఞానశక్త్యాత్మా అనేదిస్వామి వారి నామాలలో ఒకటి. ఇఛ్చా, జ్ఞాన, క్రియా అనేమూడు శక్తుల మయమైన శక్తినిధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు, జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజఃపుంజం – కుమారస్వామి.
ఆరుకోణాల చక్రం అనేది బహుముఖీయమైన ప్రజ్ఞకు సంకేతం కనుక కవిత్వానికీ, ప్రతిభకీ, ఆధారశక్తిగా కూడాకుమారస్వామి ఉపాసన చెప్పబడింది. షణ్ముఖీ ప్రతిభ ప్రసాదించే ఈ కార్తికేయుని కవిగా పేర్కొన్నాయి శాస్త్రాలు.
మహాభారతంలో కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్యస్వామి వారి జనన గాథ, తారకాసుర సంహారం అద్భుతంగా వర్ణించారు వ్యాసమహర్షి. ధర్మరాజుగారికి మార్కండేయ మహర్షి చెప్తారు సుబ్రహ్మణ్య జనన వైభవం గురించి. ఇక్కడమనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అటు శ్రీరామాయణం లోనూ, ఇటు మహాభారతంలోనూ కూడాసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి ఇవ్వడంలో రహస్యం సాధకులగా మనం గురువులనుంచి తెలుసుకోవలసిన విషయం. రామాయణంలో రామచంద్రప్రభువుకి స్కందోత్పత్తి చెప్పడంలోఉద్దేశం ఏమిటంటే, సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి రాముడిలో ప్రవేశించాలి. అది రావణసంహారమునకు అవసరము.
కార్తికేయ భక్తులు ఇహలోకంలో ఆయుష్మంతులై పుత్రపౌత్రులతో వర్ధిల్లి అంత్యమున స్కంద సాలోక్యాన్ని పొందుతారు. ఓ రామా! ఈకుమారసంభవం ధన్యపుణ్యగాథ అని విశ్వామిత్రుని మాట (వాల్మీకి రామాయణం – బాలకాండ).
ఏషతే రామ గంగాయా విస్తరోమయా
కుమారసంభవశ్చైవధన్యం పుణ్యస్తథైవ చ
భక్తశ్చయః కార్తికేయే కాకుత్ స్థ భువిమానవాః
ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కందసాలొక్యతాం వ్రజేత్
షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు
స్కందుడు - పార్వతి పిలచిన పదాన్ని బట్టి
కార్తికేయుడు - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు - శరవణము అంటే ఱెల్లుగడ్డిలో అవతరించినవాడు
గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి - దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
మురుగన్ - అందమైన వాడు (తమిళం)
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కరావలంబ స్తోత్రం Sri Subrahmanya Ashtakam Karavalamba Stotram श्री सुब्रह्मण्य अष्टकं करावलंब स्तोत्रम्
hē svāminātha karuṇākara dīnabandhō,
śrīpārvatīśamukhapaṅkaja padmabandhō ।
śrīśādidēvagaṇapūjitapādapadma,
vallīsanātha mama dēhi karāvalambam ॥ 1 ॥
हे स्वामिनाथ करुणाकर दीनबंधो,
श्रीपार्वतीशमुखपंकज पद्मबंधो ।
श्रीशादिदेवगणपूजितपादपद्म,
वल्लीसनाथ मम देहि करावलंबम् ॥ 1 ॥
సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం
హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో ।
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥
దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద ।
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ ।
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే ।
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 4 ॥
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ ।
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 5 ॥
హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ ।
హే వీర తారక జయాఽమరబృందవంద్య,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 6 ॥
పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః ।
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 7 ॥
శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ ।
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 8 ॥
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః ।
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ।
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి ॥
. . .
మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1808 General Articles and views 1,399,172; 94 తత్వాలు (Tatvaalu) and views 185,044 Dt : 01-Mar-2020, Upd Dt : 01-Mar-2020, Category : Devotional
Views : 981
( + More Social Media views ), Id : 375 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Sri SUBRAHMANYA ASHTAKAM TELUGU Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments