Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. పాట గురించి ఎంత బాగా చెప్పారో చూడండి. అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే, కలతచెందినా పాటే, ఏ పాట మనము పాడాలి, బ్రతుకే పాటైన పసివాళ్ళము.
ఏలుకుంటే పాట, మేలుకుంటే పాట, పాడుకుంటే పాట మా దేవుడు అని పైకి అన్నా అది మనకు మనశ్శాంతి నిచ్చే మందు అని మనకు తెలుసు, అందుకే దైవ గీతాలను పాడాలి.
పసి పిల్ల గుక్కపట్టి ఏడుస్తూ తల్లడిల్లే వేళ, తల్లి పాడే జోల పాట, పాల కన్నా తీపి, కాదనగలమా? అక్కడా పాటే కావాలి.
చేరువై హృదయాలు, దూరమైతే ఓ పాట, జంట బాసిన గువ్వ, ఒంటి బ్రతుకే ఇంకో పాట, అంటే మన బ్రతుకంతా, ఏదో ఒక పాటతో సాగుతూ ఉంటుంది. మీరూ మీ గొంతు సాగించి ఆరోగ్యం కోసం ఓ 3 నిమిషాలు వరుసగా పాడే ప్రయత్నం చేస్తారు కదూ?
పల్లవి :
అలలు కదిలినా. పాటే.., ఆకు మెదిలినా. పాటే..
కలలు చెదిరినా. పాటే.., కలతచెందినా. పాటే..
ఏ పాట నే పా.డను.., బ్రతుకే పాటైన పసివా.డను.., 2
ఏ పాట నే పా.డను...
చరణం : 1
ఏలుకుంటే పా.ట, మేలుకుంటే పా.ట
పాడుకుంటే పాట మా దేవుడు ॥ - 2 సార్లు మొత్తము
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో..
శ్రీశ్రీనివాస జగదేక దయైక సింధో..
శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే..
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం..
ఆ సుప్రభాతాలు, ఆ భక్తిగీతాలు
పాడకుంటే మేలుకోడు.., మమ్మే.లుకోడు..
ఏ పాట నే పాడను...
చరణం : 2
తల్లడిల్లే వేళ., తల్లి పాడే జో.ల
పాల కన్నా తీపి, పాపాయికి ॥- 2 సార్లు మొత్తము
రామలాలీ మేఘశ్యామ లాలీ..
తామరస నయన దశరథ తనయ లాలీ ॥- 2 సార్లు మొత్తము
ఆ... రామలా.లికి, ఆ ప్రేమగీ.తికి
రాముడైన పాప ఇల్లాలికి... ఇల్లాలికి..ఏ పాట నే పాడను...
చరణం : 3
చేరువై హృదయాలు, దూరమైతే పా.ట
జంట బాసిన గువ్వ, ఒంటి బ్రతుకే.. పా.ట
ఎందుకో.., ఎందుకో...
నా మీద అలిగాడు, చెలికాడు
ఎందుకో నా మీద, అలిగాడు చెలికాడు
ఎదురు చూసిన చూపు, చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట, కల అయిన కాలేడు ॥- 2 సార్లు మొత్తము
గారాలు నీరాయే, తీరాలు వేరాయే
మనసు మీరాలాయే, వయసేటి పాలాయే ॥॥
ఎందుకో.., ఎందుకో...
నా మీద అలిగాడు, చెలికాడు
కలలు చెదిరినా. పాటే.., కలతచెందినా. పాటే..
ఏ పాట నే పా.డను..
Seetha Maalaxmi, Seetamalakshmi, Alalu Kadilina Pate, Chandra Mohan, Rameshwari, Tulasi ; Lyrics: Veturi; Singer: P. Susheela
చిత్రం : సీతామాలక్ష్మి (1978);రచన : వేటూరి;సంగీతం : కె.వి.మహదేవన్;గానం : పి.సుశీల
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1766 General Articles and views 1,288,718; 90 తత్వాలు (Tatvaalu) and views 176,144 Dt : 08-Jan-2023, Upd Dt : 08-Jan-2023, Category : Songs
Views : 315
( + More Social Media views ), Id : 1692 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
seetamalakshmi ,
alalu ,
kadilina ,
pate ,
chandra ,
mohan ,
rameshwari ,
tulasi Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments