APLatestNews.com top Banner

Social Media links
అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాముల నియమాలు - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

మాల ధారణం నియమాల తోరణం అనే పాటి విని ఉంటారు. లక్షలాది మంది అయ్యప్ప భక్తులు సంకాంతి దాకా, అయ్యప్పను శబరిమలలో దర్శిస్తారు. మకర జ్యోతి ని దర్శిస్తారు.

జ్యోతి ని మనుషులే వెలిగిస్తున్నారు కొండమీద అని తెలిసిన తర్వాత కూడా, దేవుని దర్శనానికి జనము ఏ మాత్రము తగ్గలేదు.

కొంచెము బాధాకరము ఏమిటంటే, 41 రోజులకు తక్కువగా కూడా కొంతమంది మాలలు ధరిస్తున్నారు. మహిళలకు కూడా దర్శనము అని సుప్రీం తీర్పు తర్వాత, కొంత మంది మహిళలు ప్రయత్నము చేసారు.

మాలధారణ చేసిన స్వాములు 41 రోజులపాటు అత్యంత నియమ నిష్టలతో అయ్యప్పను పూజిస్తారు.

ఉభయ సంధ్యల్లో చన్నీళ్లతో శిరస్నానం ఆచరించి స్వామికి దీపారాధన చేసి, స్తోత్రపఠం చేయాలి.

దేవతార్చన జరిపి, మధ్యాహ్నం బిక్ష, రాత్రికి అల్పాహారం తీసుకోవాలి.

నల్లని దుస్తులు ధరించాలి, రోజూ దేవాలయాన్ని దర్శించాలి, పాదరక్షలు ధరించరాదు.

దీక్ష కాలంలో క్షవరం చేయించుకోవడం, గోళ్లను కత్తిరించకోవడం చేయరాదు.

మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టిపరిస్థితిలోనూ తీయరాదు. అయ్యప్ప సన్నిధానానికి చేరడానికి కనీసం 41 రోజులు ముందు దీక్ష ఆరంభించాలి.

అస్కలిత బ్రహ్మచర్యం పాటించి, యోగిగా జీవించాలి. ఇంటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.

దాంపత్యజీవితం, మనోవాక్కాయ కర్మలను తలచుట కూడా అపరాధం.

పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. నేల మీద కొత్త చాప పరచుకొని శయనించాలి.

శవం, బహిష్టు అయిన మహిళల చూడరాదు. ఒకవేళ అలా చూసిన యెడల పంచగవ్య శిరస్నానం చేసి, శరణుఘోష చెప్పినంత వరకు మంచి నీళ్లైనా ముట్టుకోరాదు.

దీక్షా కాలంలో స్వామియే శరణమయ్యప్ప అనే మూల మంత్రాన్ని జపించాలి. మాలధారణలో ఉన్నప్పుడు స్త్రీలను భార్యతోసహా దేవతామూర్తులుగా భావించాలి.

పేరు చివర అయ్యప్ప అని పదం చేర్చాలి. ఇతరులను అయ్యప్పా లేదా స్వామి అని పిలవాలి. మహిళను మాతా అని సంభోదించాలి.

ఎవరైనా భిక్షకు పిలిస్తే తిరస్కరించరాదు.

నుదుటిపై ఎల్లప్పుడూ విభూధి, చందనం, కుంకుమ ధరించాలి. మద్యం సేవించడం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. తాంబూలం కూడా నిషిద్ధమే.

సాత్వికాహారాన్ని తీసుకోవాలి. రాత్రిపూట అల్పాహారం. స్వామి శరణు ఘోష ప్రియుడు కాబట్టి నిరంతరం భజనల్లో పాల్గొనాలి.

హింసాత్మక చర్యలకు దూరంగా వుండాలి. అబద్దమాడటం, దూషణ చేయరాదు. అధిక ప్రసంగాల దూరంగా ఉండాలి.

తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం చేయవచ్చు. దీక్షలేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు.

స్వామికి అర్చన చేసిన తర్వాత ఇష్టదైవాన్ని ధ్యానించాలి. అష్టరాగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్యలకు దూరంగా ఉండాలి.

దీక్షా సమయంలో తమ శక్తిమేరకు కనీసం ఒకసారైనా అయ్యప్పలకు భిక్ష పెట్టాలి. స్వామి కర్పూరం ప్రియుడు, ఉభయ సంధ్యల్లో కర్పూర హారతి ఇవ్వాలి.

దీక్షా సమయంలో వయస్సు, హోదా, అంతస్తు మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనం చేయడానికి వెనుకాడరాదు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 666 General Articles, 46 Tatvaalu
Dt : 27-Nov-2019, Upd Dt : 27-Nov-2019, Category : Devotional
Views : 287 ( + More Social Media views ), Id : 230 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : ayyappa mala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content