Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Nee Prashnalu Neevea - Kotha Bangaru Lokam - Varun Sandesh, Shweta Basu
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
+ + +
మనిషి ఒంటరి, చుట్టూ 100 మంది ఉన్నా. సంతోషములో ఎంతమంది ఉన్నా, బాధలో ఎవ్వరూ ఉండరు. రామన్న చివరి రోజులు చూసాము కదా. అందుకే మనము 30 ఏళ్ళు వయసు దాటగానే, మానసిక నియంత్రణ సాధన చేస్తూ, ఉన్న దానితో త్రుప్తిగా ఉంటూ, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడుతూ, సత్వ గుణాన్ని పెంచుకోవాలి లేదా కనీసం సత్వ గుణం వారు చెప్పిన దోవలో ఖచ్చితంగా నడవాలి.
మీ మనసుని అడగండి ఇవి నిజమో కాదో. నీ జీవిత సమస్యలు ప్రశ్నలు నీవే, ఎవ్వరో బదులివ్వరుగా పరిష్కారం చూపరు అండగా ఉండరు. నీ చిక్కులు నీవే, ఎవ్వరూ వాటి నుంచి విడిపించరుగా. ఏ గాలో నిన్ను, తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో, తెలియదంటే చెల్లదుగా. ఎందుకంటే, అప్పుడు ఉన్న సత్వ/ రజో/ తమో గుణాన్ని బట్టి, కర్మను బట్టి, దాని ఫలితాలు వెంటనే లేదా తర్వాత వెంటపడతాయి సుమా.
జీవిత సత్యాలు చూడండి. మానసిక నియంత్రణ సాధన చెయ్యండి. పది నెలలు తనలో, నిన్ను మోసిన అమ్మైనా, అపుడో ఇపుడో కననే కనను అంటుందా? తప్పకుండా కనాలి, తనకు బాధ అయినా, చావు అయినా, తప్పించుకోలేదు కదా? అంతే జీవితం. పెళ్ళి, సంసారం, సంతోషం అన్నాక, తర్వాత దైవ లేదా రాక్షస సంతానం తప్పదు. ప్రతి కుసుమం తనదే, అనదే స్వార్ధం తో విరిసే కొమ్మైనా? ఆ పూలను గుడికో జడకో, సాగనంపక ఉంటుందా? ఏమీ చేయలేక, చూస్తూ ఉంటుంది. గుడికైతే, ఆనందపడుతుంది, తన జన్మ సార్ధకం అయ్యింది అని.
100 ఏళ్ళ బతుకంటే, బడి చదువా? అలా అనుకుంటే అతిసులువా? కానే కాదు, ఇది మాయా లోకం. పొరపడినా కింద పడినా, జాలిపడదే కాలం, మన గుణం లాగా, అంతే నా? ఒక నిమిషం కూడా ఆగిపోదే, నువ్వొచ్చేదాకా లెగిచి, అన్ని సరి చేసుకుని? జాగ్రత్తలు మిత్రమా. ఇంకా ఎన్నో నగ్న సత్యాలు, కఠోర వాస్తవాలను ఈ పాట గుర్తు చేస్తుంది. వినండి, మీరూ పాడండి, సత్వ గుణం వైపు నడవండి సాధనతో, పంచభూత శిక్షణ తప్పించుకోండి.
+ + +
నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరో బదులివ్వరుగా..
నీ చిక్కులు నీవే, ఎవ్వరూ విడిపించరుగా..
ఏ గాలో నిన్ను, తరుముతుంటే, అల్లరిగా..
ఆగాలో లేదో, తెలియదంటే, చెల్లదుగా..
పది నెలలు తనలో, నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే, కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే, అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో, సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా., అనుకుంటే అతిసులువా.
పొరపడినా పడినా, జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా, ఆగిపోదే నువ్వొచ్చేదాకా..
--అలలుం.డని కడలే.దని, అడిగేం.దుకే తెలివుందా
కలలుం.డని కనులే.వని, నిత్యం నిదరోమందా
గతముం.దని గమనిం.చని నడిరే.యికి రేపుందా
గతితో.చని గమనా.నికి, గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేస్తుంది, వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు, వివరించే రుజువేముంది
సుడిలో పడు ప్రతి నావ.., చెబుతున్నది వినలేవా..
--పొరబా.టున చెయిజా.రిన తరుణం. తిరిగొస్తుందా
ప్రతిపూ.టొక పుటగా. తనపాఠం వివరిస్తుందా
మనకో.సమే తనలో.తను రగిలే. రవి తపనంతా
కనుమూ.సిన తరువా.తనే, పెనుచీకటి చెబుతుందా
కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేశాయా చరిత పుటలు, వెనుచూడక ఉరికే జతలు
తమ ముందుతరాలకు స్మృతుల చితులు, అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధిరాత.., అనుకోదేం ఎదురీత..
--పది నెలలు తనలో, నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే, కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే, అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో, సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా., అనుకుంటే అతిసులువా.
పొరపడినా పడినా, జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా, ఆగిపోదే నువ్వొచ్చేదాకా..
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2262 General Articles and views 2,560,438; 104 తత్వాలు (Tatvaalu) and views 273,731
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments