దేశభక్తి - గాంధీ పుట్టిన దేశం, దేశమును ప్రేమించుమన్నా, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, రఘుపతి రాఘవ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,415; 104 తత్వాలు (Tatvaalu) and views 225,065.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ఆధ్యాత్మిక దేశభక్తి - గాంధీ పుట్టిన దేశం, దేశమును ప్రేమించుమన్నా, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, రఘుపతి రాఘవ*

ఆగస్ట్ 15 వస్తుంది, భారత స్వాతంత్ర దినం, మరి దేశభక్తి రగిల్చే, గుర్తుకు తెచ్చే మాటలు పాటలు చూద్దాము. మీరూ పాడాలి, అందరికీ పంపాలి, మాత్రు మూర్తి గౌరవం నిలపాలి.

ప్రతి మనిషికి కూడా, మాత్రు భక్తి, దేశభక్తి, దైవ భక్తి అనేవి జ్ఞాన నేత్రం తో కలిపి 3 కళ్ళు లాంటివి. ఇది ఉంటేనే అది ఉంటుంది, అని మూడిటికి లంకె ఉంటుంది.

దేశం ప్రశాంతము గా లేక పోతే, మనకు దైవ భక్తికి, ఆధ్యాత్మిక ఉన్నతికి, తగిన అనువుగా ఉండదు సుమీ. మాత్రు భక్తి, అంటే ముదుసలి తల్లి తండ్రి పై జాలి దయ లేని వారికి, ఇంట్లో తమతో పెట్టుకుని సేవ చెయ్యని వారికి, మిగతా 2 ఎటూ ఉండవు. అందుకే గురజాడ అప్పారావు గారు ఇలా అన్నారు,

దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్

ఊరక దేశమంటే, అమ్మ నాన్న అంటే, దైవం అంటే మాకు మనసులో ఉంది అని అబద్దాలు జీవితాంతము చెప్పడము కాదు, అవి చేతలలో పనులలో అందరికి చూపించాలి, ఆదర్శముగా ఉండాలి. సేవ అనేది త్యాగముతో, మనము కష్టపడుతూ నష్టపోతూ ఉండాలి.

రాముడు పట్టాభిషేకం వదలి, అడవులకు వచ్చి, రాక్షసులను చంపితేనే, దేవుడు అయ్యారు. క్రుష్ణుడు ద్వారక వైభవం వదిలి వచ్చి, కౌరవ పాండవ యుద్దములో నానా పాట్లు పడితేనే, భూ పాపభారం తగ్గిస్తేనే, మంచిని కాపాడితేనే, దేవుడు అయ్యారు. ఇద్దరూ బలహీనులను కాపాడారు.

మరి మనము, కేవలం బలవంతులతోనే స్నేహం, అవసరం అవకాశం తో వారి కాళ్ళకు మొక్కడం, తప్పు ఒప్పు ఏనాడూ ధైర్యముగా చెప్పము, అంతేనా? అప్పుడు దైవ భక్తులము ఎలా అవుతాము? రాముని/ క్రిష్ణుని అనుసరిస్తున్నాము అని ఎలా చెప్పగలము?

మంచి తనం ఉన్న, బలహీనుల వైపు గొంతెత్తి అడగాలి, వారితోనే అండగా ఉండాలి, సేవ సహాయం చేయాలి నిస్వార్ధముగా ప్రతిఫలం ఆశించక. మనకు ఒళ్ళు కదలదాయే?

మరి మనము ఏ పాట్లు పడి, ఎన్ని త్యాగాలు చేసి, ఇతరులకు సేవ చేస్తున్నామో, ఎంత మంది ధైర్యముగా చెప్పగలరు?

కానీ చాలా మంది పెద్దలు, సేవ చేస్తున్నాము అని అంటూ ఉంటారు, వారి ఆస్తులు బొజ్జలు మాత్రం, విపరీతము గా పెరుగుతు ఉంటాయి, అంటే వారు తమ సేవ తాము చేసుకుంటున్నారు అని అర్ధం కదా? ఇంక ఇతరుల సేవ ఎక్కడ ఉంది?

అందుకే నరుడి సేవ నారాయణ సేవ అన్నారు, మరి మనము ఆచరణలో చూపేది ఎప్పుడు మిత్రమా?

సొంత లాభం కొంత మానుకు, పొరుగువాడికి తోడు పడవోయ్. దేశమంటే మట్టికాదోయి, దేశమంటే మనుషులోయ్. ఎంత బాగా చెప్పారు. మనము సొంత ముదుసలి తల్లి దండ్రులనే దగ్గర పెట్టుకోమే, ఎప్పుడూ బిజీ అంటూ సంవత్సరం పొడువునా చెపుతునే ఉంటాము స్నేహితులతో, ఇంక పొరుగు వారికి తోడ్పడటమా?

భేదాలన్నీ మరచి, మోసం ద్వేషం విడచి, మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడూ నీతి కి నిలవాలి. మరి మనలో ఎంత మందిమి ఇవి పాటిస్తున్నాము?

వట్టి గొప్పలు చెప్పకోకోయ్, పూని యేదైనాను, వొక మేల్ కూర్చి జనులకు చూపవోయ్ - మీ స్టేటస్ లో, మీరు చేస్తున్న, ప్రతి వారం మంచి పనులు చెప్పండి అంటే, అవి తప్ప ఇంక ఏమేమో రాస్తూ ఉంటారు, నేల విడిచి సాము చేస్తూ.

ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా, పొగడరా, నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి, నిండు గౌరవమూ. ఇది విదేశాలలో ఉన్న మనవారికి వర్తిస్తుంది. విదేశాలలో వీసా, పచ్చ కార్డుల తో ఉన్న వారికి కూడా ఇవి ఉపయోగము కదా.

* మన తెలుగు నేలపై ఉన్న, అవలక్షణాలు అన్ని, అక్కడ చూపిస్తున్నారు, చెడ్డ పేరు తెస్తున్నారు కొందరు. సంపాదన సరదా సంతోషాల లో మునిగి, గతం మరచి, తమ ముదుసలి తల్లి దండ్రులను, ఇక్కడే అరకొర వైద్య సదుపాయాలతో వదిలేస్తున్నారు. మన తెలుగు నేల పై జరుగుతున్న అరాచకాలు అక్కడ కూడా కొనసాగిస్తున్నారు. కనీసం తెలుగు రాయలేరు, మంత్రం/ శ్లోకం/ పాట నోటితో పలకరు, కానీ ధనం కోసం మాత్రం ఎన్నో సర్టిఫికేట్లు చదివి రాస్తారు. ఏరు దాటాక తెప్ప తగలేసే మనస్తత్వాలు. మూలాలు మరుస్తారు. తమకు కీడు చేసుకుంటూ, తమ పిల్లలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

* ఇంకొందరు మన మాత్రుభూమినే రోజూ తలచుకుంటూ, మన మంచి పద్దతులు ఇంకా పాటిస్తున్నారు ప్రచారం చేస్తున్నారు - తల్లి తండ్రి సేవ చేస్తూ, మిత్రుల కష్టాలు నష్టాలు వింటూ ఓదారుస్తూ, తెలుగు నేలపై మిత్రులను రోజు/ వారం కు పలకరిస్తూ, శాఖాహారం తింటూ, నేలపై నిద్రిస్తూ, పలుమార్లు శిరోముండం చేయించుకుంటూ, దేవుని పూజలు చేస్తూ, శ్తోత్రాలు చదువుతూ, పద్యాలు పాటలు పాడుతూ, పరగడుపున ఉత్త పాదాలతో 108 ప్రదక్షణాలు చేస్తూ, పురాణాలు దేశం ముదుసలి తల్లి దండ్రూల సేవల గురించి, పదిమందికి గుర్తు చేస్తూ రాసి పంపుతూ, మన కన్నా ఎక్కువగా, మాత్రుభూమి రుణం తీర్చుకుంటున్నారు.

వారిలో కొంతమంది విదేశాల పౌరసత్వం తీసుకున్నా, పుట్టింటి పై మక్కువను వదలలేరు. ఎందుకంటే వారికి విశ్వసనీయత క్రుతజ్ఞత మూలాలు, ఇంకా గుర్తు ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత, ఎలా మనము పుట్టినింటికి మెట్టినింటికి ఎలా సేవ చేస్తామో క్రుతజ్ఞత చూపిస్తామో, వారూ అలాగే 2 వైపులా మంచి కోరతారు సుమా.

అందుకే మన దేశంపై ప్రేమ కలిగిన, అలాగే తల్లి దండ్రుల సేవ చేస్తున్న వారిని ఆదర్శముగా తీసుకుని, మనమూ మంచి దోవలో నడవాలి.

ధర్మాన్ని మనము కాపాడకుండా, కేవలము మనకు కష్టం నష్టం వచ్చినప్పుడు, ధర్మం నశించింది అంటే ఎలా, దానిని నశింప చేసింది మనమే అని మరిస్తే ఎలా? అరిషడ్వర్గాల సాధన చేయనిదే, ధర్మాన్ని ఆచరించలేము, కాపాడలేము, సుమా.

రఘుపతి రా.ఘవ రాజారా.మ్, పతిత పా.వన సీతారామ్ అంటూ, మంచి ఆశయాలతో, ఇక నుంచి అయినా, మాత్రు మూర్తి, మాత్రు దేశం, మాత్రు గురువు, మాత్రు దైవాలను మనస్పూర్తిగా కొలుద్దాము.

1) గాంధీ పుట్టిన దే.శం,, రఘు రాముడు ఏలిన రా.జ్యం,
ఇది సమతకు, మమతకు, సంకేతం..2

రఘుపతి రాఘవ రాజారాం.. పతిత పావన సీతారాం
ఈశ్వర విష్ణు తెరే నాం… సబకో సన్మతి దే భగవాన్

భేదాలన్నీ మరచి.., మోసం ద్వేషం విడచి.. 2
మనిషి మనిషిగా.. బ్రతకాలి, ఏనా.డూ నీతి కి నిలవాలి 2
బాపూ....., ఈ కమ్మని వరమే మా కివ్వు
అవినీతిని గెలిచే.., బలమివ్వు 2 ||గాంధీ పుట్టిన దేశం|| ||రఘుపతిరాఘవ||

ప్రజలకు శాం.తి. సౌఖ్యం.., కలిగించే దేశమె దేశం 2
బానిస భావం విడనాడి.., ఏ జాతి నిలుచునో అది జాతి 2
బాపూ.., నీ చల్లని దీవెన మా కివ్వు
నీ బాటను నడిచే.., బలమివ్వు 2 ||గాంధీ పుట్టిన దేశం|| ||రఘుపతిరాఘవ||

Gandhi Puttina Desam, Writer(s): Kosaraju, Arudra, S Rajeswara Rao
చిత్రం : గాంధీ పుట్టిన దేశం (1973), సంగీతం : కోదండపాణి, గీతరచయిత : మైలవరపు గోపి, నేపధ్య గానం : సుశీల

2) దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్ ! ||దేశమును||

పాడిపంటలుపొంగి పొర్లే, దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితె కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ !||దేశమును||

ఈసురోమని మనుషులుంటే, దేశ మేగతి బాగుపడునోయ్
జల్డుకొని కళలెల్ల నేర్చుకు, దేశి సరుకులు నించవోయ్ ! ||దేశమును||

పూను స్పర్దను విద్యలందే, వైరములు వాణిజ్య మందే
వ్యర్ధ కలహం పెంచబోకోయ్, కత్తి వైరం కాల్చవోయ్ !

దేశాభిమానము నాకు కద్దని, వట్టి గొప్పలు చెప్పకోకోయ్
పూని యేదైనాను, వొక మేల్; కూర్చి జనులకు చూపవోయ్ ! ||దేశమును||

పరుల కలిమికి పొర్లి యేడ్చే, పాపి కెక్కడ సుఖం కద్దోయ్
ఒకరి మేల్ తన మేలనెంచే, నేర్పరికి మేల్ కొల్ల లోయి ! ||దేశమును||

సొంత లాభం కొంత మానుకు, పొరుగువాడికి తోడు పడవోయ్
దేశమంటే మట్టికాదోయి, దేశమంటే మనుషులోయ్ ! ||దేశమును||

చెట్ట పట్టాల్ పట్టుకుని, దేశస్తు లంతా నడవవలె నోయ్
అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నీ మెలగవలె నోయి ! ||దేశమును||

దేశ మనియెడి దొడ్డ వృక్షం, ప్రేమలను పూలెత్తవలె నోయ్
నరుల చెమటను తడిసి మూలం, ధనం పంటలు పండవలె నోయి !

ఆకులందున అణగి మణగీ, కవిత పలకవలె నోయ్
పలుకులను విని దేశమందభి, మానములు మొలకెత్త వలెనోయి !

Gurazada Apparao Desa Bhakthi Poem - Deshamunu Preminchumanna
గురజాడ అప్పారావు దేశ భక్తి పద్యం

3) ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...2
ఏ పీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా
పొగడరా, నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి, నిండు గౌరవమూ...

రాయ ప్రోలన్నాడు ఆనాడూ.. అది మరిచిపోవద్దు ఏనాడూ..

పుట్టింది, నీ మట్టిలో, సీ..త
రూపు కట్టింది, దివ్య భగవద్గీత
వేదాల వెలసినా.., ధరణిరా..2
ఓంకార నాదాలు పలికిన, అవనిరా..
ఎన్నెన్నొ దేశాలు, కన్ను తెరవని నాడు
వికసించె మననేల, విజ్ఞాన కిరణాలు ||ఏ దేశమేగినా||

వెన్నెలదీ, ఏ.. మతమురా...? కోకిలదీ, ఏ.. కులమురా...?
గాలికి, ఏ భాష ఉందిరా...? నీటికి ఏ ప్రాంత.ముందిరా...?
గాలికీ. నీటికీ., లేవు భేధాలూ..
మనుషుల్లో, ఎందుకీ తగా..దాలు
కులమత విభేదాలూ ||ఏ దేశమేగినా||

గౌతమ బుధ్ధుని, బోధలు మరవద్దూ..గాంధీ చూపిన, మార్గం విడవద్దూ....2
ద్వేషా..ల చీకట్లూ తొలగించూ..
స్నేహ దీపా..లు, ఇంటింటా. వెలిగించూ
ఐక మత్యమే, జాతికి శ్రీరామ రక్షా
అందుకే నిరంతరం, సా.గా.లి దీక్షా...2

America Abbai Songs | Ye Desamegina | Patriotic Song
అమెరికా అబ్బాయి పాటలు దేశభక్తి గీతం

4) రఘుపతి రాఘవ రాజారామ్ అనునది హిందూ మతానికి చెందిన ఒక ప్రముఖ భక్తి గీతం, ఈ గీతం మహాత్మా గాంధీకి చాలా ఇష్టమైన గీతం. విష్ణు దిగంబర్ పలుస్కర్ ఈ గీతానికి చాలా సాధారణమైన సంగీతాన్ని సమకూర్చారు ఉప్పు సత్యాగ్రహం సమయంలో దండి వరకు 241 మైలు నడిచినటు వంటి సందర్భాలలో గాంధీ, అతని అనుచరులు ఈ గీతాన్ని ఆలపించారు.

రఘుపతి రా.ఘవ రాజారా.మ్, పతిత పా.వన సీతారామ్

సుందర విగ్రహ మేఘశ్యా.మ్, గంగ తులసి సాలగ్రామ్

భద్ర గిరీశ్వర సీతారామ్, భక్త జన ప్రియ సీతారామ్

జానకి రమణ సీతారా.మ్, జయజయ రాఘవ సీతారాం ||రఘుపతి ||

Raghupati raghava rajaram
Patita paavana sitaram
Sundara vigraha meghashyam
Ganga tulasi salagram
Bhadra girishwara sitaram
Bhakata janapriya sitaram
Janaki ramana sitaram
Jaya jaya raghava sitaram

desabhakti Gandhi Puttina Desam Deshamunu Preminchumanna Ye Desamegina Raghupati raghava

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి. పూర్తి పాటలు మాటలు వీడియోలు లింక్ లోపల చూడగలరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,415; 104 తత్వాలు (Tatvaalu) and views 225,065
Dt : 11-Aug-2022, Upd Dt : 11-Aug-2022, Category : Songs
Views : 660 ( + More Social Media views ), Id : 1492 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : desabhakti , Gandhi , Puttina , Desam , Deshamunu , Preminchumanna , Desamegina , Raghupati , raghava , gurajada , august15 , America , Abbai
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content