భక్త పోతన- భాగవత పద్యములు- నాగయ్య- ఇమ్మను, కాటుక, కమనీయ, ఎవ్వనిచే, కుప్పించి, సర్వ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,885,267; 104 తత్వాలు (Tatvaalu) and views 226,535.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*భక్త పోతన - భాగవత పద్యములు - చిత్తూరు నాగయ్య - ఇమ్మనుజేశ్వర, కాటుక కంటి, కమనీయ భూమి, ఎవ్వనిచే జనించు, కుప్పించి ఎగసినఁ, సర్వధర్మాన్*

ప్రసిద్ధ తెలుగు కవి, తెలుగులో భాగవతం అనువదించిన శ్రీ భక్త పోతన గారి, జీవితం ఇతివృత్తంగా 1943 లో వెలువడిన సినిమా ఇది. ఈ చిత్రం మైసూర్ రాష్ట్రం మరియు కేరళతో సహా దక్షిణ భారతదేశం అంతటా జూబ్లీని జరుపుకుంది. ఇది 1966లో పునర్నిర్మించబడింది, ఇందులో గుమ్మడి పోతనగా నటించారు.

మహా నటుడు చిత్తూరు నాగయ్య గారి నటజీవితంలో, ఒక కలికితురాయిగా, ఈ సినిమాను చెప్పుకోవచ్చు. భక్త పోతన గారి వ్యక్తిత్వంలో భాగమైన భక్తి, వినయం, పాండిత్యం - అన్నింటినీ నాగయ్య గారు చక్కగా చూపించారు. అందులోని కొన్ని భాగవత పద్యాలు మరియు అర్ధము, చూద్దాము పలుకుదాము విందాము వినిపిద్దాము నేర్పుదాము, భక్తి పారవశ్యములో మునిగి తేలుదాము.

ఇవన్నీ నీతి నియమాలు అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల గురించి, మనకు పనికి వచ్చే విషయములే సుమా.

1) ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.

ఈ అధములైన రాజుల కు అంకితం ఇచ్చి లంచముగా ఊళ్ళు (అగ్రహారాలు), వాహనాలు, సొమ్ములు, పుచ్చుకొని బతికి, శరీరాన్ని వదిలి పెట్టాక కాలుని (యముని) చేతికి చిక్కి సమ్మెట వేటులు పడడం లాంటి వాటిలో పడకుండా సమ్మతి తో ఆ శ్రీ హరికి ,ఆ శ్రీ రామచంద్ర మూర్తి కి అంకితం ఇచ్చి, ఈ ప్రపంచానికి హితం చేకూర్చే విధంగా, ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతాన్ని చెప్పెను.

2) కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!

నీవు కంటికి పెట్టుకున్న కాటుక, కన్నీటికి కరిగి రవికపై పడేలా ఎందుకు ఏడుస్తావు? ఆ మహా విష్ణువునకు ఇష్టమైన కోడలా! ఓ మా తల్లీ! బ్రహ్మదేవునికి సాక్షాత్తు ఇల్లాలా! నిన్నుతీసుకుపోయి అంగట్లో పెట్టినట్లు ఆ కర్ణాట కిరాట కీచకులకు అమ్మివేయను. త్రికరణ శుద్ధిగా ఒట్టు వేస్తున్నాను. నన్ను నమ్ము సరస్వతీదేవి!

3) సీ. కమనీయ భూమి భాగములు లేకున్నవే
పడియుండుటకు దూది పరుపులేల?
సహజంబులగు కరాంజలులు లేకున్నవే
భోజన భాజన పుంజమేల?
వల్కలాజిన కుశావళులు లేకున్నవే
కట్టదుకూల సంఘంబులేల?
గొనకొని వసియింప గుహలు లేకున్నవే
ప్రాసాద సౌధాది పటల మేల?

తే. ఫలరసాదులు కురియవే పాదపములు
స్వాదుజలముల నుండవే సకల నదులు
పొసగ భిక్షము బెట్టరే పుణ్య సతులు
ధన మదాంధుల కొలువేల తాపసులకు

పడుకోడానికి చక్కటి నేల ఉండగా, దూది పరుపు లెందుకు? పుట్టుకతో వచ్చిన చేతులు ఉండగా, ఇంకా కంచాలు గరిటలు ఎందుకు? నారచీరలు జింకచర్మాలు ధర్భచాపలు ఉండగా, ఇంకా పట్టుబట్టలు అవి ఎందుకు? చక్కగా ఉండటానికి గుహలు ఉండగా, మేడలు భవనాలు ఎందుకు? చక్కగా రసవంతమైన పళ్ళు కాసే చెట్లు, తియ్యటి మంచి నీటిని యిచ్చే నదులు, పుష్కలంగా బిక్ష పెట్టే పుణ్యస్త్రీలు ఉండగా, హాయిగా తపస్సులు చేసుకొనేవానికి, ధనమదంతో కన్నుమిన్ను కానని వాళ్ళని పోయి ఎందుకు సేవించటం?

4) ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై
యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం
బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌

ఎవ్వని చేత ఈ జగమంతా సృష్టింపబడినదో, ఎవ్వని లో ఈ జగమంతా లీనమై వుందో, (ఎవ్వనియందు డిందు)ఎవ్వని చేత నాశనం చేయబడుతోందో, ఈ సృష్టికి మూలకారణం ఎవ్వడో, మొదలు, చివర, మధ్య అంతా తానే అయి వున్నవాడు ఎవడో, ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు కోరుచున్నాను.

5) సీ. కుప్పించి ఎగసినఁ గుండలంబుల కాంతి
గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ
నుఱికిన నోర్వక యుదరంబులోనున్న
జగముల వ్రేఁగున జగతి గదలఁ
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ
బైనున్న పచ్చని పటము జాఱ
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక
మన్నింపు మని క్రీడి మఱల దిగువఁ

తే. గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

రథం మీద నుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుని చెవుల రత్నకుండలాలు కిందికీ పైకీ ఊగి వాటి కాంతి ఆకాశమండలాన్నంతటినీ కప్పుకున్నది. ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలో ఉన్న భువనాల బరువుతో జగత్తు అదిరిపోయిందట. చక్రాన్ని చేపట్టి వేగంతో పరుగెత్తే ఆయన భుజాల మీద ఉన్న పీతాంబరం ఒకవైపు ఆ ఒడుపుకు జారిపోతున్నదట. అనూహ్యమైన ఈ చర్యకు అర్జునుడికి రోషం వచ్చింది. తనూ దిగి కృష్ణుని ఒక కాలును పట్టుకుని నిలిపే ప్రయత్నం చేసి రోషంతో-నా యోగ్యతను నగుబాటు చెయ్యకని వేడుకుంటున్నాడు. ఏనుగు మీదకి లంఘించే సింహంలా ఉరకలు వేస్తూ – ఇవాళ భీష్ముణ్ణి చంపి నీ మార్గాన్ని నిష్కంటకం చేస్తాను, నన్ను ఒదిలిపెట్టు అర్జునా అంటూ – ముందుకొస్తున్న ఆ దేవుడు – నా బాణాల దెబ్బకు వడలి, ఉత్తేజితుడైన ఆ పరమేశ్వరుడు – నాకు దిక్కు అగు గాక!

6) సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।
అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ।। 66 ।।

BG 18.66: అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపములనుండి విముక్తి చేసెదను; భయపడకుము.

Bhakta Potana 1943 Bhagavatham poems Chittoor Nagayya

Based on the life of poet-saint Potana who translated Bhagavatham into Telugu language. సంగీతం: చిత్తూర్ వి.నాగయ్య;  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,885,267; 104 తత్వాలు (Tatvaalu) and views 226,535
Dt : 20-Feb-2023, Upd Dt : 20-Feb-2023, Category : Songs
Views : 597 ( + More Social Media views ), Id : 1712 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bhakta , potana , 1943 , bhagavatham , poems , chittoor , nagayya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content