Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Amma Avanee - Rajanna - Baby Annie, Nagarjuna, Sneha
జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపీ గరీయసి, ఏ తల్లి నిను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అన్న నానుడి మనకు తెలుసు. వీర తల్లులు అందరూ, ఆ మాటలు చిన్నప్పుడు నుంచి నూరి పోసి, తమ పిల్లలను ధైర్యవంతులుగా చేసి, దేశ సేవ కై అర్పించారు.
వీర శివాజీ తల్లి, ఇలాంటి పుణ్యాత్మురాలే. అల్లూరి, కోమరం భీం లాంటి యోధులు ఎందరో గత చరిత్రలో. ఆఖరికి ఆదిశంకరులు తల్లి కూడా, తన బిడ్డను, సనాతన ధర్మ సేవకు పంపింది. అదీ దేశ సేవే, మోహాన్ని వీడిన ప్రజలు సుఖ శాంతులతో ఉంటారు, లేదంటే వారి బతుకు నిత్యము అగ్నే.
ఇప్పుడు ప్రతి దేశం లో కూడా, మిలటరీ లో పనిచేసే సైనిక సోదరీ సోదరమణులు, అలాగె వారి తల్లి దండ్రులు కూడా ఇదే కోవలోకి వస్తారు. ప్రజల కోసం, నీతి కోసం పోరాడే/ ప్రాణాలు విడిచిన, పౌరులు, పౌర/ పోలీసు అధికార వీరులు ఈ కోవకే వస్తారు.
ఇప్పుడు, మన అమ్మ కూడా, అయ్యా, నాలాగే ఇతర ముదుసలి తల్లి దండ్రులకు కూడా, తమ పిల్లల మంచి అండ దొరికేలా, వారిని ఉత్తేజ పరచూ అని దీవిస్తుంది, ఇన్ని రాయడానికి పాడడానికి పంపడానికి, దేవుని సంతానం భవిష్యత్ సొంత రాత బాధలు తగ్గించడానికి, అవకాశం ఇస్తున్నది. ఆమె అనుమతి ఆశీర్వాదం లేనిదే, ఇవన్నీ చేయడం సాధ్యమా?
ఆఖరుకు 190 వారాల 108 ప్రదక్షిణ (1 గంట 15 నిమిషాలు) కరమాల లెక్క జపం, మొత్తం 20,520 కు కూడా, దగ్గర కూర్చుని లెక్కవేస్తుంది, సరిగ్గా చేస్తున్నానా లేదా అని, 77+ ఏళ్ళ వయస్సులో చలైనా వానైనా ఎండైనా తనూ గుడికి వస్తూ 9 ఏళ్ళుగా, ఉదయం 5 కే లెగిచి.
మరి మనము ఏమి చేస్తున్నాము ఇంట్లో కూర్చుని? అమ్ముడుబోయి ఓట్లు, ఆన్లైన్ ఆఫ్ లైన్ సినిమాలు, అరిషడ్వర్గ్ అష్టవ్యసన బానిసత్వము. ముదుసలి తల్లి తండ్రుల అత్త మామల సేవ లేదు, పిల్లల పెంపక సంస్కారం లేదు. మమ్మల్ని మా పిల్లలు గౌరవముగా దేవతలుగా ఇంట్లో తోడుగా ఉంచి గౌరవిస్తారు అని బహిరంగముగా చెప్పే ధైర్యమూ లేదు.
ఎందుకు ఈ వ్రుధా బతుకులు, ఆస్తులు, అధికారం, పెళ్ళి, సంతానం? జంతువుల సంతానానికి, మనకు తేడా ఏమిటి, క్రుతజ్ఞత విశ్వసనీయత లేకపోతే? మాత్రుదేవోభవ పిత్రుదేవోభవ అన్న దానికి మన ఇంట్లో విలువ లేకపోతే, ఆ నటన పూజల వలన ఎవరికి ప్రయోజనం?
కనిపెంచిన ఒడిలోనే, కన్ను మూయని, మల్లి ఈ గుడిలోనే, కళ్ళు తెరవని అని సొంత అమ్మకు, సొంత నేలకు, సొంత భాషకు విశ్వసనీయత క్రుతజ్ఞతలు చూపుతున్నామా? కనీసం సోషల్ మీడియాలో తెలుగు రాయడం రాదు, బొట్టు పెట్టుకుని గుడికి పోము, నోటికి ఒక పద్యం మంత్రము రాదు. కనీసం వాట్సాప్ లో దొంగలాగా చూడటం మానము, ఫోటో పెట్టుకోవడం కు కూడా బద్దకము. నేర్చుకోము, ఎవరు చెప్పినా వినం. పోనీ అవి చేసే వారిని ప్రోత్సహిస్తామా? ప్రచారం చేస్తామా? 10 మందికి పంపుతామా? లేదు ఇంకా అబ్బో దేవుడు దిగాడు అండి, నీతులు చెపుతున్నారు అని విరుపులు. ఇంక మన పిల్లలు మన మాట వింటారా? ముదుసలి తనములో, మనల్ని గౌరవిస్తారా? బర్రె పొలములో పడి తింటుంటే, దూడ గట్టున తింటుందా?
తల్లి, నిను తాకితేనే, తనువూ పులకరిస్తుంది. నీ, ఎదపై వాలితేనే, మేనూ పరవశిస్తుంది, అని చెప్పే, చేయి పట్టి ముదుసలి తనములో రోజూ 1 మైలు నడిపించే ఇంగిత జ్ఞానం మనకు ఉందా? లేకపోతే నష్టం ఎవరికి? మనకే, పంచభూతాల శిక్షణ తప్పదు, ఎక్కడికీ తప్పించుకోలేము, స్మశానములో కూడా, అవి ఉంటాయి, మరు జన్మలో కూడా, వెంటాడుతాయి, ఈడ్చి ఈడ్చి కొట్టి క్రుతజ్ఞత విశ్వసనీయత నేర్పుతాయి..
అమ్మా.. ఆఆ ఆఆ అవనీ...
అమ్మా., అవని., నేలతల్లి అని.
ఎన్ని సార్లు, పిలిచినా., తనివితీరదెందుకని..
అమ్మా., అవని., నేలతల్లి అని.
ఎన్ని సార్లు, పిలిచినా., తనివితీరదెందుకని..
కనిపెంచిన ఒడిలోనే, కన్ను మూయని..
మల్లి ఈ గుడిలోనే, కళ్ళు తెరవని..
అమ్మా., అవని., నేలతల్లి అని.
ఎన్ని సార్లు, పిలిచినా., తనివితీరదెందుకని..
తల్లి, నిను తాకితేనే, తనువూ పులకరిస్తుంది.
నీ, ఎదపై వాలితేనే, మేనూ పరవశిస్తుంది..
తేట తెలుగు జా.ణా..,
కోటి రతనా.ల వీ.ణా..
నీ పదమూలాన నువ్వే, నాకు స్వర్గం కన్నా మిన్న
అమ్మా., అవని., నేలతల్లి అని.
ఎన్ని సార్లు, పిలిచినా., తనివితీరదెందుకని..
అమ్మా., అవని...
నీ బిడ్డల, శౌర్య, ధైర్య, సాహస గాధలు వింటే
నర నరాలలో, రక్తం, పొంగి పొరలుతుంది..
రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ
రిగగ రిగగ రిగ రిగరిసదపదస
రిగగ రిపపప గదదద పదదద
సద సద పగ పద సద సద సద సద
పద సద పద సద పద సద పద సద
సాస సాస సాస సాస రీరి
సాస సాస సాస సాస గాగ
రిగ రిస రిగ రిస రిగ రిస రిగ రిస
సరి సరి గారిస గారిస గారిస
రిగ రిగ పా గరి సద పా
గప పద దస సరి గరి సద
పద దస సరి రిగ పగరి సరీ గా పా
రిసద పదస రిగ పా
సరిగ పదస రిగ పా
గప గరి సరి సద వీర మాతవమ్మ..
రన ధీర చరితవమ్మా..
పుణ్య భూమివమ్మా.., నువ్వు ధన్య చరితావమ్మా..
తల్లి కొరకు చేసే, ఆ త్యాగమెంతదైనా.
దేహమైన ప్రాణమైన, కొంచమే కదమ్మా..
అది మించిన, నాదన్నది నీకె, గలదేదమ్మ
అమ్మా., అవని., నేలతల్లి అని.
ఎన్ని సార్లు, పిలిచినా., తనివితీరదెందుకని..
అమ్మా., అవని...
Movie: Rajanna; Cast: Baby Annie,Nagarjuna,Sneha; Music Director: M M Keeravani; Year: 2011
చిత్రం: రాజన్న; తారాగణం: బేబీ అన్నీ, నాగార్జున, స్నేహ; సంగీత దర్శకుడు: M M కీరవాణి; సంవత్సరం: 2011
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,476,023; 104 తత్వాలు (Tatvaalu) and views 265,983
Dt : 07-Jun-2023, Upd Dt : 07-Jun-2023, Category : Songs
Views : 415
( + More Social Media views ), Id : 1779
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Amma ,
Avanee ,
Rajanna ,
Baby ,
Annie ,
Nagarjuna ,
Sneha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments