APLatestNews.com top Banner

Social Media links
గైడెన్స్ లేక గళం విప్పని బాపట్ల మరియు ఇతర ఎంపీలు, వ్రుధా పొగడ్తలు తెగడ్తలతో జగనన్న మెచ్చరు - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఇది ఈ నెలలో పార్లమెంట్ లో నోరు ఎత్తని పూర్తిగా హాజరు కాని, మీ జిల్లా అన్ని పార్టీల ఎంపీలు కు వర్తిస్తుంది, కేవలము ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతే, సౌకర్యాలు జీతాలు ఫించన్లు అనుభవిస్తూ, పార్టీకి, నాయకునికి, ప్రజలకు ఉపయోగము లేకుండా ఉంటే ఇలాగే.

అన్ని పార్టీలు, తమ సభ్యులు ఎన్నిరోజులకు, ఎన్ని సార్లు హాజరు అయ్యారు, ఏమేమి ప్రశ్నలు వేసారు? వాటిలో అమలు అయినవి ఎన్ని? ఖాళీగా ఢిల్లీలో కూర్చుని విహార యాత్ర చేసింది ఎవరు? ఈ లిస్ట్ ప్రతి పార్టీ కూడా, ప్రకటించాలి. అలాగే ప్రతిపక్షాలు, కూడా, తమ లిస్ట్ లు అధికార ఎంపీల గురించి జనము ముందు పెట్టాలి.

బాపట్ల పార్లమెంట్, చీరాల అస్సెంబ్లీ, లేదా రాష్ట్ర ఇతర ప్రాంతాలలో, తెదేపా, బీజేపీ, జనసేన, నిద్ర నుంచి, ఇంకో 5 ఏళ్ళకైనా లెగుస్తాయా? ఒక సామాన్య విలేఖరి అడిగే ప్రశ్నలు, ప్రతిపక్షాలు గా స్ధానిక నాయకులు అడగనప్పుడు, వారి వలన ప్రజలకు ఉపయోగము ఉందా? అసెంబ్లీ సీట్లు జీవితంలో సాధించగలరా? హతవిధీ.

బాపట్ల ఎంపీ గారికి కూడా మనము, చీరాల పరిసర ప్రాంతాలలో, అభివృద్ధి గురించి విన్నవించాము. గత ఎంపీలు, ఎలా కేవలం ఉత్సవ విగ్రహాలు గా, ఉండి పోయారో వివరించాము, ముందు ఆర్టికల్ ల లో. link. గత సంవత్సరం నుంచి, నేలమీద కట్టుబడి అభివృద్ధి, ప్రోగ్రెస్ రిపోర్ట్ అభ్యర్ధించాము. జవాబు లేదు. link.

అటు పక్కన ఒంగోలు ఎంపీ మాగుంట గారు, తెదేపా శ్రీకాకుళం ఎంపీ యువ నాయకుడు రామ్ మోహన్ నాయుడు గారు, సీనియర్ ఎంపీ విజయసాయి గారు, పార్లమెంటు లో అభివృద్ధి పనులు గురించి, గట్టిగా గళం వినిపించారు. వారి వారి పార్టీ నాయకుల పరువు నిలిపారు, తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు.

బాపట్ల ఎంపీ గారి గళం ఎక్కడా వినపడలేదు, ఢిల్లీ పార్లమెంట్ లో మూగపోయింది. మా కంటి కి కనపడలేదేమో అని, వారి ఫేస్బుక్ లో వెతికాను, స్థానిక లేదా రాష్ట్ర అభివృద్ధి గురించి గళం కనపడలేదు. గానీ, తోటి నర్సాపురం ఎంపీ రఘురామ గారి మీద ఆరోపణలు, ఆయన సెక్యూరిటీ తీసేయమని లేదా శిక్షించమని, వినతిపత్రం సమర్పించడం గురించి సమాచారం మాత్రమే కనపడింది, మా లేదా ప్రజల, నోట మాట రాలేదు. రఘురామ గారు కనీసం, హిందువుల గురించి అయినా, నోరు ఎత్తారు, ఆంధ్రా ప్రజలు చూసారు.

మన బాపట్ల ఎంపీ, మన పార్లమెంటు స్ధానం అభివృద్ధి గురించి, ఎలుగెత్తి చాటడానికి ఉపయోగించే విలువైన సమయాన్ని, వృధా గా అనవసరమైన వాటికి వాడుతున్నారు. కేవలం జగనన్న ను పొగిడితే లేదా ఇతరుల ను తిడతమే కాదు, అది జగనన్న మెచ్చరు.

ఎంపీ కర్తవ్యం అంటే, లక్షల మంది ప్రజల భవిష్యత్తు కు, ఉపయోగపడే పనులు కూడా ఉంటాయి అని, అవి పార్లమెంటు లో నిలబడి లేదా కూర్చోని అడగాలని, కొంత మంది వారి స్థానిక భాషలలో కూడా అడిగారని, జగనన్న లేదా ఇతర పార్టీ సీనియర్లు, కొత్త ఎంపీలు కు ట్రైనింగ్ లో చెప్పాలి.

జగనన్న ఇచ్చిన మంచి అవకాశాన్ని, బాపట్ల ఎంపీ సరైన విధముగా ఉపయోగించుకోవడము లేదు అన్నది అందరి అభిప్రాయము.

గతంలో, హేమాహేమీలు లు దగ్గుబాటి రామానాయుడు, పురందేశ్వరి, వెంకటేశ్వరరావు , నేదురుమల్లి, ఉమ్మారెడ్డి, ఇంకా చిమటా సాంబు, మాల్యాద్రి శ్రీరాం, పనబాక లక్ష్మీ గార్లు కాంగ్రెస్ లేదా తెదేపా పార్టీలు నుంచి ఎన్నికై, చీరాల ప్రాంతానికి ఓ స్మార్ట్ సిటీ, బీచ్, పరిశ్రమ, జిల్లా కేంద్రం, హార్బర్, నింస్ లాంటి ఆసుపత్రి, చేనేత పార్క్ ఏదీ తీసుకుని రాలేదు.

కనీసం ప్రయత్నం కూడా, అంటే ధర్నా లు కూడా చేయలేదు. హాయిగా ఎంపీ ల జీతాలు, సౌకర్యాలు, హోదాలు, ఫించన్లు అనుభవించారు. వారికి మరియు ఇతరులకు కావాల్సిన పనులు చక్కబెట్టుకుని వెళ్ళారు, ప్రజలకు ఉపయోగం లేనివారు గా ముద్ర వేసుకున్నారు. మీరూ అలా మిగిలి పోకుండా, జగనన్న పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ, గత ఎంపీలు కన్నా, నేను భిన్నం, అని చీరాల ప్రాంత అభివృద్ధి ని చేతలలో చూపించి, మమ్మల్ని మరియు అనుభవం లేకపోయినా అవకాశమిచ్చిన జగనన్నను, ఆనందింప చేస్తారు అని ప్రజల ఆవేదన, విన్నపము. ధన్యవాదములు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 805 General Articles, 46 Tatvaalu
Dt : 25-Sep-2020, Upd Dt : 25-Sep-2020, Category : Politics
Views : 110 ( + More Social Media views ), Id : 721 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : guidance , open mouth , parliament , bapatla , andhra , mps , waste , compliments , complaints , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content