APLatestNews.com top Banner

Social Media links
చీరాల అభివ్రుద్ది ఉందా? ఎన్టీఆర్, ఆయన అల్లుళ్ళు, రోశయ్య, రామానాయుడు, పురందేశ్వరి, మరి జగన్? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మీ ఊరి కధలు చెప్పండి. మా ఊరి కధలో తప్పు ఉంటే సరి చేయండి, గురువు లు, సహాయం చేయండి, నాయకులు తప్పు సరిదిద్దుకోండి ఇప్పుడు అయినా బాపట్ల పార్లమెంట్ అస్సెంబ్లి నియోజకవర్గమైన చీరాలకు మంచి చేసి. వీళ్ళ గురించే ఎందుకు మాట్లాడుతున్నాము, వీళ్ళు లోకల్ లేదా బంధుత్వము ఉంది కాబట్టి.

చీరాల అభివ్రుద్ది గురించి హార్బరు, చేనేతపార్క్, బీచ్, పరిశ్రమ, కొత్త జిల్లా గురించి, జగన్ గారికి విన్నపము, మరియు చీరాల చరిత్ర చదివారు. ఇప్పుడు పెద్దమనుషులు చేసిన అన్యాయమును, నిర్లక్ష్యాన్ని, క్రుతగ్నతను చదవండి. ఇంత మంది ఉండి కూడా, ఇన్నేళ్ళ అధికారములో ఇవి ఏమీ తీసుకు రాలేదు.

1. దగ్గబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు గారి తోడల్లుడు, ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, కారం చేడు గ్రామం, 11 కిమి దూరము చీరాల నుంచి. మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యుడు.

మన అన్న ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిని, అధికార గద్దె దింపటానికి, సహాయం లో భాగమైన వ్యక్తి, పురందేశ్వరి గారి భర్త. ఆ సహాయం చేస్తూనే మన, చీరాలకు హర్బర్, పార్లమెంట్ స్ధానం, చేనేత పార్కు, వైజాగ్ బీచ్ లా అభివృద్ధి కావాలంటే, బాబు గారు చేయను అనేవారా, ఆనాడు? తర్వాత అయినా, బాబు గారు కృతజ్ఞతలు, చూపారా? అబ్బే.

తర్వాత, బాబు ఆయనను దూరముగా పెట్టారు, దాదాపుగా తొక్కేసారు. ఒకసారి, తప్పు చేసినాక, ఇక దగ్గుబాటి గారి రాజకీయ జీవితము ముగింపు.

2. కారంచేడు దళిత రక్తపాతం కేసు, ఎన్నేళ్ళు ఎంత సాగిందో సుప్రీంకోర్టు లో, తమ పలుకుబడి హోదా తో, ఈ ప్రాంత ప్రజలు అందరికీ తెలుసు. ఆ పలుకుబడి ని ఆ ధనం ను ఆ హోదాను, చీరాల అభివృద్ధి కి మంచి కోసం వాడితే? ఈరోజు చీరాల పరిస్థితి, ఎక్కడ ఉండేది?

3. అల్లుడు దగ్గుబాటి మరియు కుమార్తె అడిగితే, ముఖ్యమంత్రి రామారావు గారు కాదంటారా? పెళ్ళి అయినాక, మెట్టనిల్లు పుట్టినిల్లు అంటారు కదా. అలాంటి మంచి మనిషి ఎన్టీఆర్ కూతురు, చీరాల కోడలు, పురందేశ్వరి గారికి, ఆనాడు తలచుకుంటే ఎంత పని? ఒకవేళ ఎన్టీఆర్ గారు చేయక పోయినా, బాపట్ల ఎంపీ గా చేయలేరా వారు? కేంద్ర మంత్రి గా చేయలేరా? ఇప్పుడు బీజేపీ నుంచి ఏమీ చేయలేరా? చీరాలకు ప్రత్యేకంగా ఏమి తెచ్చారు. వీరంతా ఏసి ట్రైన్ ఎక్కి దిగింది, చీరాలలో కాదా?

4. పర్చూరు, కారంచేడు, వేటపాలెం పిల్లలు అంతా, బండ్లు వేసుకుని, సినిమాకి, ఆసుపత్రికి, చదువుకి, షికారుకి, బీచ్కి తిరిగింది, చీరాల కాదా? లెగిచిన దగ్గర నుంచి, ప్రతి పని చీరాల తో ముడి పడి లేదా? హైదరాబాద్, వైజాగ్, మద్రాస్, తిరుపతి రైల్ ఎక్కాలి అంటే, చీరాలే దిక్కు అందరికి. చిన్న పిల్లలుగా, కాలేజ్ నుంచి లేదా సెంటర్ నుంచి వస్తు, వీళ్ళను రైల్ స్టేషన్ లో చూసేవాళ్ళము.

5. దగ్గుబాటి రామానాయుడు గారు, బాపట్ల ఎంపీ గా కూడా చేసారు. స్టూడియో కోసం స్ధలం హైదరాబాద్ లో, ఇంక ఎక్కడో తీసుకున్నారు. సురేష్ మహల్ ధియేటర్ లు, అన్ని ఊళ్ళు లో కట్టారు, ఎన్నో సినిమాలు తీసారు, కోట్లు సంపాదించారు. వాళ్ళు తలచుకుంటే చీరాల పార్లమెంటు స్ధానం, జిల్లా, హర్బర్, అన్ని హంగులు రావా? ఈరోజు కి అబ్బాయి నిర్మాత సురేష్ గారు, సినిమా పరిశ్రమలో ఆయువు పట్టు. ఏమి చేశారు? సినీ హీరో వెంకటేష్ గారూ కూడా, ఉన్నారు కదా? తండ్రి చేయని సహాయము, పిల్లలు చేయలేరా?

6. కారంచేడు పెద్దలు అందరూ కలసి కట్టుగా వెళ్లి, ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ మరియు చంద్రబాబు గార్ల దగ్గర, చీరాలకు ఇవి చెయ్యాలి అని అడిగితే, కాదనే పరిస్థితి ఎప్పుడు అయినా ఉందా?

7. రోశయ్య గారు చీరాల అసెంబ్లీ నుంచి గెలిచారు అని తెలుసా? ఆర్ధిక మంత్రి గా ఉన్నారు, ముఖ్యమంత్రి గా చేశారు, గవర్నర్ గా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం లో తెలుసా? ఏమి ఒరిగింది? ప్రత్యేకముగా? ఆయన పక్కనుంచి వచ్చారు, కాబట్టి, గట్టిగా అనలేము.

8. రోడ్డు వేయించడం, ప్రభుత్వ ధన సహాయం, కేసుల సహాయం, మార్కెట్ కట్టడం, ఇదేనా మంచి చేయడం అంటే? కాదు, పదిమంది కి అన్నం పెట్టె, పెద్ద పరిశ్రమ, టూరిజం తేవడం. అధికారంలో ఉండి, అరే చీరాలకు అల్లుడు హార్బర్ తెచ్చారు, రామానాయుడు గారు చేనేత పార్కు తెచ్చారు, కేంద్ర మంత్రి పురందేశ్వరి గారు మంచి బీచ్ గా చేశారు, రోశయ్య గారు ఇంకో పరిశ్రమ ,అంటే గదా మండలం చుట్టూ పక్కల మొత్తం గొప్ప.

9. కారంచేడు లో ఉన్న మిగతా పెద్దలు, అంటే వ్యాపారం విదేశం అధికారం ఉన్న వారు, ఉన్న దాంట్లో 10 శాతం దానం చేస్తే లేదా అధికారం ఉపయోగిస్తే, చీరాల స్మార్ట్ సిటీ గా ఎప్పుడో ఉండదా?

ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నారు అనవచ్చు నా? గతం మరచిన, కృతజ్ఞతలు లేని వారందామా? పెరిగిన, తిరిగిన ఊరు కి ఇచ్చే విలువ, మర్యాద ఇదేనా అందామా?

సరే నండీ , గతం గతః , ఇప్పుడు ఏమి చెయ్యాలి చెప్పు , పరిహారం కు అంటారా.

అల్లుళ్ళు చంద్రబాబు మరియు దగ్గుబాటి గారు, దగ్గుబాటి సురేష్, వెంకటేష్, పురందేశ్వరి, ఎన్టీఆర్, రోశయ్య గారు తరపున, తమ పలుకుబడి ఉపయోగించి ఇప్పుడు అయినా చీరాలకు పార్లమెంట్ స్ధానం, జిల్లా, హార్బర్, చేనేత పార్కు, మంచి బీచ్, పరిశ్రమ లు తేవాలి. కనీసం వాటికోసం, ఒకరోజు ధర్నా అయినా చేయలి. మేం అధికారం లోకి వస్తే, ఇవి చేస్తాం అని ఖచ్చితముగా చెప్పాలి.

మరి జగన్ ఏం చేయాలి అంటారా? వీళ్ళు అందరి తప్పులు జనం ఈసడించుకునే విధంగా, ఎన్టీఆర్ చంద్రబాబు రామానాయుడు పురందేశ్వరి చేయలేనివి ఇన్నేళ్ళ అధికారముతో, తనే అవి ఇచ్చి, ఇంతమంది ఇన్నాళ్లు పదవులు అలంకరించి సొంత పెద్ద ఊరికి చేయలేనిది, నేను మొదటి ఐదేళ్ల లోపు చేసాను, అని గర్వంగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి.

ఆమంచి, కరణం వలన ఉపయోగం లేదా? వారి వలన పెద్దపనులకు ఉపయోగము లేదు, వాళ్ళు నోళ్లు ఎత్తరు. ఎత్తి తే, కేసులు బయటకు తీస్తారు. రెండవ మనిషి కి చీరాల పూర్తి బాధ్యత అప్పగిస్తారు, అడిగిన మనిషిని అన్ని విధాలుగా తొక్కెస్తారు. ఆమంచి కి ఇంఛార్జి లేదా వెంకటేష్ కి ఇంఛార్జి లేకుండా చేస్తారు. కాబట్టి, వీళ్ళు కేవలం, వాళ్ళ పరువు అధికారం మర్యాద ఉనికి కాపాడుకోవటానికే పరిమితము. ప్రజలకు పెద్ద పరిశ్రమ లు తాలేరు. ఎవో చిన్న పనులకు, అందుబాటులో ఆమంచి అన్నా ఉంటారు, కరణం బాబాయి ఒంగోలు వాసి.

తప్పులు మార్పులు ఉంటే చెప్పగలరు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 744 General Articles, 46 Tatvaalu
Dt : 08-Aug-2020, Upd Dt : 08-Aug-2020, Category : Politics
Views : 138 ( + More Social Media views ), Id : 639 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : develop , chirala , ntr , babu , daggubati , Konijeti , Rosaiah , ramanayudu , purandhareshwari , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content