APLatestNews.com top Banner

Social Media links
చిన బొంబాయి చీరాలకు ఫిషింగ్ హార్బర్, చేనేత పార్కు లేదా ప్రత్యేక జిల్లా? జగన్ గారు ప్లీజ్ - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

గతములోనే చిన బొంబాయి గా పేరొందిన, ప్రకాశం జిల్లా కు చెందిన చీరాలకు, ఫిషింగ్ హార్బర్ ఇవ్వలేదు, బడుగు నేత అన్నల కోసం చేనేత పార్కు ఇవ్వలేదు, ఇదిగో అదిగో అన్నారు, ఎటో వెళ్లి పోయాయి, ఎక్కడో దాక్కున్నాయి. ఇంకేమైనా మిస్ అయితే చెప్పగలరు, చీరాల ప్రజలు. దయచేసి ఇప్పుడు ఇవైనా ఇవ్వండి, లేదా జిల్లా అయినా చేయండి. చీరాల చరిత్ర చూడండి.

ఇప్పుడు కదా, అధికారులు నాయకుల ను కలసి, వినతిపత్రం ఇచ్చి, మన గోడు వెళ్ళబోసుకునేది. మేమూ ఈ సందేశము అందరికీ పంపుతూ, మా ఉడుత ప్రయత్నం మేము చేస్తున్నాము. కలెక్టర్ గారు, ఎంపీ గారు, అధికారులు, ఎమ్మెల్యే గారు, అధికార పక్షం, ప్రతిపక్షాలు, అభివృద్ధి లో అనాధ అయిన, మా ప్రాంత అభివృద్ధి, గోడు మొర వినండి.

ఆమంచి, కరణం గార్ల, పలుకుబడి పనితనం బయట పడేది ఇప్పుడే. ఉద్యమం చేస్తారో, తమ రాజకీయ అవసరాలకు వంగి దండాలు పెడతారో, ప్రజలకు తెలిసేది ఈ నాడే. జిల్లా మంత్రుల చల్లని చూపు విలువ, బయటకు రాదే, కనపడ దే. 2024 ఓట్లు కు గీటు రాయి కాదా ఇది. తమ స్వార్థం కు పనిచేస్తున్నారా లేక ప్రాంత అభివృద్ధి కి కృషి చేస్తున్నారా తెలిసేది, ఈ సారే అన్నా.

చంద్రబాబు గారు మరచారు ఆనాడు. జగన్ గారు, అన్నా న్యాయం చేయాలి, ఈనాడు.

చేనేత లేదా వస్త్ర పరిశ్రమ మీద ఎంతో గణనీయంగా ఆదాయం తెచ్చిపెడున్న ఈ మండలం మరియు చుట్టుపక్కల మండలాలకు (వేటపలెం, పర్చూరు, . . ) ఆధారమైన చీరాలకు, ఏదోవిధంగా న్యాయం చేసే, మనసు ఈనాడు వైసీపీ లేదా ఆనాడు టీడీపీ నాయకుల కు, రాదా లేదా భగవంతుడా?

సాంస్క్రుతిక ప్రకాశం జిల్లా భాగాలు, ఈ జిల్లా లోనే ముక్కలు గా ఉండలేవా? ఎంపీ నియోజకవర్గం పరిధి మారినప్పుడు అల్లా కూడా జిల్లా కూడా మారాలా? ఈ తంతు ఇలా, కొనసాగాలిసిందేనా?

కనీసం చీరాల జిల్లా అయినా ఇచ్చి పుణ్యం కట్టుకుంటారా, జగన్ గారు అని అడిగే చీరాల మండలం మరియు చీరాల వచ్చి వెళ్ళే, ఇతర చుట్టుపక్కల ఉన్న మండలాల ఉత్తమ పౌరులు కు వందనాలు.

ఏదో ఒకటి ఇస్తే, మీకు ఋణపడి ఉంటాము నాయకుల్లారా, జిల్లా అధికారులారా, మా మీద దయచూపండి అని వేడుకుంటున్న ప్రజలు.

బిజెపి వీర్రాజు గారు జీవిఎల్ గారు, జనసేన పవన్ గారు కూడా, దయ చూపాలి.

Note :

మన ప్రాంత అభివృద్ధి, చేనేత బడుగుల, సముద్ర పుత్రుల అవసరాలను, అడగడం మన విధి, ఉత్తమ బాధ్యత గల పౌరులు గా. ఆ పై రాష్ట్ర జిల్లా అధికారుల, మంత్రుల, ఎంపీ, ఎమ్మెల్యే ల, దయ.

అప్యాయంగా అన్నా అని పిలిచే, మన జగనన్న చల్లని చూపు, చీరాల పై పడుతుందేమో చూద్దాం. బాపట్ల, రఘుపతి గారు, సురేష్ గారు కూడా, చీరాల ప్రజల ఆశలను ఆశయాలను గౌరవిస్తారు అని ఆశిద్దాం.

చంద్రబాబు, పవన్, వీర్రాజు, జీవియెల్, విజయ్ సాయి రెడ్డి, మాగుంట, బాలినేని, సుబ్బారెడ్డి గార్లు, ఇతర పెద్దలు అండ తో అయినా, ఈ మూడింటిలో ఒకటైనా అవుతుంది అని ఆశిద్దాం. లేదా ఎప్పుడూ లా వినమ్రంగా మోసపోదాం, మిత్రమా. ఓట్లు పండగ అప్పుడు బాధ్యత గా ఉందాము సిగ్గు తెచ్చుకుని.

పవన్ కళ్యాణ్ గారి మాట, పోరాడి తే అడిగితే పోయేదేముంది, బానిస సంకెళ్లు తప్ప. ఈ చిన్న కోరికలకు, విన్నపాలు చాలు, దయగల పెద్ద మనసు లు ఉన్న, పెద్దలు కు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 793 General Articles, 46 Tatvaalu
Dt : 07-Aug-2020, Upd Dt : 07-Aug-2020, Category : Request
Views : 180 ( + More Social Media views ), Id : 636 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : fishing harbor , handloom park , special district , small bombay , chirala , cm jagan , chandrababu , pawan , veerraju
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content