Maha Shivaratri - శ్రీ రుద్రం నమకం, చమకం, శివ తాండవ స్తోత్రం - ఆధ్యాత్మికం ఆరోగ్యము Tel/Eng - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,454; 104 తత్వాలు (Tatvaalu) and views 225,067.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Maha Shivaratri Sri Rudram Namakam Chamakam Shiva TanDava Stotram spiritual health

Om Namah Shivaya, Hara Hara Mahadeva Shambho Shiva Shankara. ఓం నమహ్ శివాయా, హర హర మహాదేవ శంభో శివ శంకర.

Greetings to the floating devout crowd engaged in the celebrations of Maha Shivaratri.

మహా శివరాత్రి ఆనందోత్సవాల వేడుకల్లో మునిగి తేలుతున్న, భక్త జనసందోహానికి శుభాకాంక్షలు.

Fasting, chanting with mind and mouth, and jagaran is also an attempt in the practice of conquering the Arishdvargas.

ఉపవాసం, నోటితో మరియు మనసుతో మంత్ర ఉచ్చారణ మరియు జాగరణ, అరిషడ్వర్గాలను గెలిచే సాధన లో ఒక ప్రయత్నం కూడా.

It's not enough to hear what others are saying about the taste of a good meal or special food, it's not enough to fill our stomachs if we are looking to what they are eating, right?

మంచి భోజనం లేదా పిండివంటల రుచి గురించి, ఇతరులు చెపుతుంటే మనము వింటే చాలదు, ఎదుటు వారు తింటే చూస్తూ ఉంటే మనకు కడుపు నిండదు, కదా?

If others are talking about a song, listening to a song that others are singing, we will not have complete satisfaction, we should sing too.

ఇతరులు పాట గురించి చెబుతుంటే, ఇతరులు పాడుకునే పాట వింటే, మనకు పూర్తి త్రుప్తి ఉండదు, మనము కూడా పాడాలి.

As well as that the mind will not be satisfied, will not be filled with joy, the eyes will not get wet and will not be thrilled, rather than listening to what someone is saying about Adi Deva, Namaka Chamakas or any other hymn.

అలాగే ఆ ఆది దేవుని, నమక చమకాలు లేదా ఏ స్తోత్రమైనా అంతే, ఎవరో చెపుతుంటే వింటే కంటే, మనసు త్రుప్తి పడదు, ఆనందము తో నిండదు, కళ్ళు చెమ్మగిల్లవు, తనువు పులకించదు.

God gave that breath and keeping us alive, and still holding that breath within us. Is it not giving thanks to the God by confluent breath and voice of the vocal cords from the navel of our body? Is it not worship Himself?

మన శరీర నాభినుండి, స్వర శ్వాస ల సంగమ ఊపిరి తో, ఆ ఊపిరి ఇచ్చి మనల్ని బతికించి, ఇంకా మనలో ఆ ఊపిరి నిలిపి ఉంచిన, ఆ భగవంతునికి తనివితీరా, కంఠ స్వరముతో, సొంతముగా పూజ చేయనిదే, క్రుతజ్ఞతలు తెలిపినట్లు కాదు కదా?

Suppresses all diseases related to BP, digestion, lungs, throat, tumors, blood circulation, etc., vital nerves, gives vaksuddhi, gives situated intelligence, gives life energy to travel from muladhara to sahasrara, steps to salvation.

బీపీ, జీర్ణక్రియ, ఊపిరితిత్తులు, గొంతు, కణితలు, రక్త ప్రసరణ మొదలగు అన్ని అవయవాల కు, జీవ నాడులకు, సంబందించిన అన్ని వ్యాధులు ను అణిచి, వాక్సుద్దిని ఇచ్చి, స్థిత ప్రజ్ఞతను ఇచ్చి, మూలా ధారము నుంచి సహస్రారమునకు ప్రాణ శక్తిని ప్రయాణ చేసే శక్తిని ఇచ్చి, ముక్తికి సోపానము చేస్తుంది భక్తి తో ఆర్తితో కూడిన స్తోత్రపఠనము.

Bhola Shankara, the Absolute, the One who desires nothing, the only Shiva who is worshiped even with leaves and water, accompanies us on our last journey.

భోళా శంకరుడు, నిరాకారుడు, ఏమీ కోరనివాడు, కేవలం ఆకులు నీళ్ళుతో పూజ చేసినా, సంతోషపడే శివుడు, మన చివరి ప్రయాణం లో తోడు.

If everyone leaves after the cremation, He will always be with us, in the crematorium, in the cemetery, always ready to show us the heavenly divine path.

అందరూ కట్టె కాలిన తర్వాత వదిలేసి వెళితే, నేనున్నా ను రా నీకు తోడు అని, భస్మాలంకార క్రుతుడై, స్మశానము లో, మనకు పరలోక దైవ దోవ చూపడానికై, ఎల్లప్పుడూ సిద్దముగా ఉంటారు.

You, your family and friends, can try this Rudra Namakam, Chamakam and Shivatandav Stotra, with the blessings of God.

మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఒక్క సారి ఈ రుద్ర నమకం 2 వ అనువాకము ను అనే ప్రయత్నం చేయగలరు, భగవంతుని ఆశీస్సులతో.

1. శ్రీ రుద్రం నమకం (Sri Rudram Namakam) - 2 వ అనువాకం (2nd Anuvakam)

శంభ॑వే॒ నమః॑ । నమ॑స్తే అస్తు భగవన్-విశ్వేశ్వ॒రాయ॑ మహాదే॒వాయ॑ త్ర్యంబ॒కాయ॑ త్రిపురాంత॒కాయ॑ త్రికాగ్నికా॒లాయ॑ కాలాగ్నిరు॒ద్రాయ॑ నీలకం॒ఠాయ॑ మృత్యుంజ॒యాయ॑ సర్వేశ్వ॒రాయ॑ సదాశి॒వాయ॑ శ్రీమన్-మహాదే॒వాయ॒ నమః॑ ॥

నమో॒ హిర॑ణ్య బాహవే సేనా॒న్యే॑ ది॒శాం చ॒ పత॑యే॒ నమో॒

నమో॑ వృ॒క్షేభ్యో॒ హరి॑కేశేభ్యః పశూ॒నాం పత॑యే॒ నమో॒
నమః॑ స॒స్పింజ॑రాయ॒ త్విషీ॑మతే పథీ॒నాం పత॑యే॒ నమో॒

నమో॑ బభ్లు॒శాయ॑ వివ్యా॒ధినేఽన్నా॑నాం॒ పత॑యే॒ నమో॒
నమో॒ హరి॑కేశాయోపవీ॒తినే॑ పు॒ష్టానాం॒ పత॑యే॒ నమో॒

నమో॑ భ॒వస్య॑ హే॒త్యై జగ॑తాం॒ పత॑యే॒ నమో॒
నమో॑ రు॒ద్రాయా॑తతా॒వినే॒ క్షేత్రా॑ణాం॒ పత॑యే॒ నమో॒

నమ॑స్సూ॒తాయా హం॑త్యాయ॒ వనా॑నాం॒ పత॑యే॒ నమో॒
నమో॒ రోహి॑తాయ స్థ॒పత॑యే వృ॒క్షాణాం॒ పత॑యే॒ నమో॒

నమో॑ మం॒త్రిణే॑ వాణి॒జాయ॒ కక్షా॑ణాం॒ పత॑యే॒ నమో॒
నమో॑ భువం॒తయే॑ వారివస్కృ॒తా-యౌష॑ధీనాం॒ పత॑యే॒ నమో॒

నమ॑ ఉ॒చ్చైర్ఘో॑షాయా క్రం॒దయ॑తే పత్తీ॒నాం పత॑యే॒ నమో॒
నమః॑ కృత్స్నవీ॒తాయ॒ ధావ॑తే॒ సత్త్వ॑నాం॒ పత॑యే॒ నమః॑ ॥ 2 ॥

2. శ్రీ రుద్రం చమకం (Sri Rudram Chamakam) - 2, 3 వ అనువాకం

జైష్ఠ్యం॑ చ మ॒ ఆధి॑పత్యం చ మే మ॒న్యుశ్చ॑ మే॒ భామ॑శ్చ॒ మేఽమ॑శ్చ॒ మేఽంభ॑శ్చ మే జే॒మా చ॑ మే మహి॒మా చ॑ మే వరి॒మా చ॑ మే ప్రథి॒మా చ॑ మే వ॒ర్​ష్మా చ॑ మే ద్రాఘు॒యా చ॑ మే వృ॒ద్ధం చ॑ మే॒ వృద్ధి॑శ్చ మే స॒త్యం చ॑ మే శ్ర॒ద్ధా చ॑ మే॒ జగ॑చ్చ మే॒ ధనం॑ చ మే॒ వశ॑శ్చ మే॒ త్విషి॑శ్చ మే క్రీ॒డా చ॑ మే॒ మోద॑శ్చ మే జా॒తం చ॑ మే జని॒ష్యమా॑ణం చ మే సూ॒క్తం చ॑ మే సుకృ॒తం చ॑ మే వి॒త్తం చ॑ మే॒ వేద్యం॑ చ మే భూ॒తం చ॑ మే భవి॒ష్యచ్చ॑ మే సు॒గం చ॑ మే సు॒పథం॑ చ మ ఋ॒ద్ధం చ॑ మ ఋద్ధి॑శ్చ మే కౢ॒ప్తం చ॑ మే॒ కౢప్తి॑శ్చ మే మ॒తిశ్చ॑ మే సుమ॒తిశ్చ॑ మే ॥ 2 ॥

శం చ॑ మే॒ మయ॑శ్చ మే ప్రి॒యం చ॑ మేఽనుకా॒మశ్చ॑ మే॒ కామ॑శ్చ మే సౌమనస॒శ్చ॑ మే భ॒ద్రం చ॑ మే॒ శ్రేయ॑శ్చ మే॒ వస్య॑శ్చ మే॒ యశ॑శ్చ మే॒ భగ॑శ్చ మే॒ ద్రవి॑ణం చ మే యం॒తా చ॑ మే ధ॒ర్తా చ॑ మే॒ క్షేమ॑శ్చ మే॒ ధృతి॑శ్చ మే॒ విశ్వం॑ చ మే॒ మహ॑శ్చ మే సం॒​విఀచ్చ॑ మే॒ జ్ఞాత్రం॑ చ మే॒ సూశ్చ॑ మే ప్ర॒సూశ్చ॑ మే॒ సీరం॑ చ మే ల॒యశ్చ॑ మ ఋ॒తం చ॑ మే॒ఽమృతం॑ చ మేఽయ॒క్ష్మం చ॒ మేఽనా॑మయచ్చ మే జీ॒వాతు॑శ్చ మే దీర్ఘాయు॒త్వం చ॑ మేఽనమి॒త్రం చ॒ మేఽభ॑యం చ మే సు॒గం చ॑ మే॒ శయ॑నం చ మే సూ॒షా చ॑ మే సు॒దినం॑ చ మే ॥ 3 ॥

3. శివ తాండవ స్తోత్రం (Shiva TanDava Stotram)

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || 9 ||

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,454; 104 తత్వాలు (Tatvaalu) and views 225,067
Dt : 05-Sep-2022, Upd Dt : 05-Sep-2022, Category : Songs
Views : 600 ( + More Social Media views ), Id : 1508 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : maha , shivaratri , rudram , namakam , chamakam , shiva , tandava , stotram , anuvakam , spiritual , health
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content