రేషన్ వాహనం కు జీపీఎస్, సోషల్ పేజీ? నిబద్ధతతో ప్రజలకు పంపిణీ చేయలేమా? లాభం, ప్రజలకా కాంట్రాక్టర్? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1620 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1655 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

రేషన్‌ వాహనం, ఇంటి లేదా వీధి దగ్గరకు రావడం లేదు అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ సమస్య కు విరుగుడుగా, అధికారులు కొత్త ఆలోచన చేశారు అని తెలుస్తోంది. వాహనం ఫోటో, వాట్సాప్ స్టేటస్ లో.

పౌరసరఫరాల శాఖ అధికారులు, ఇక నుంచి ఏ వాహనం ఎంత దూరం తిరిగింది, ఏఏ వీధుల్లో కి వెళ్ళింది, ఎంతసేపు ఆగింది, ఉదయం ఎప్పుడు బయలు దేరింది, సాయంత్రం ఎప్పుడు గ్రామ సచివాలయంలో ఆగింది, అని స్పష్టంగా తెలుసుకోగలరు.

రేషన్ వాహనానికి, జీపీఎస్ అమర్చబోతున్నారు అని తెలిసింది. మీరూ చూసారు కదా జీపీఎస్ పవర్, 108 ప్రదక్షిణలు లేదా మనం నడిచే దోవ అంతా, స్పష్టంగా రికార్డు చేస్తుంది.

ప్రతి వాహనానికి జీపీఎస్ ను ఏర్పాటు చేసేందుకు, ఇప్పటికే ఆ శాఖ ఎయిర్‌టెల్‌ సహాయం తో, 4 వారాల్లో అన్ని వాహనాలకు జీపీఎస్‌ ఏర్పాటు చేసి, మే నుంచి పర్యవేక్షణ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది అని అంటున్నారు.

జీపీఎస్ ను వాహనాల డ్రైవర్లు ఆపేందుకు వీల్లేకుండా, నేరుగా వాహనం బ్యాటరీకి అనుసంధానం చేయవచ్చు అంటున్నారు.

ప్రతి వాహనానికి పంపిణీ చేయాల్సిన గ్రామాలు, ప్రాంత పరిధి ఇప్పటికే మ్యాపింగ్‌ చేసి ఉన్నాయి.

నెలలో ఆ వీధికి వాహనం వెళ్లిందా, లేదా? అనే విషయం మ్యాప్‌ చూస్తే తెలిసిపోతుంది. అలాగే ఎక్కడైనా వాహనం ఇంజిన్‌ ఆపేసినా, వెంటనే జీపీఎ్‌సలో రికార్డు అవుతుంది అంటున్నారు.

ఈ మొత్తం వ్యవస్థను పర్యవేక్షించేందుకు తహసీల్దారు, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి, పౌరసరఫరాల గోడౌన్‌ ఎండీ, రాష్ట్ర స్థాయిలో కమిషనర్‌ కార్యాలయ అధికారులకు లాగిన్‌ అయ్యే సదుపాయం కూడా ఉంటుంది అంటున్నారు.

వీరిలో ఏ అధికారి అయినా ఎప్పుడైనా లాగిన్‌ అయి ఫలానా వాహనం ఎక్కడుందనే విషయాన్ని చూడొచ్చు.

ఏవైనా వాహనాలు పంపిణీ సరిగ్గా చేయకపోయినా, ఎక్కడైనా ఆపేసినా వెంటనే సంబంధిత డ్రైవర్లకు, ఫోన్లు చేసి హెచ్చరించే అవకాశముంది అంటున్నారు.

మరి డ్రైవర్ లు దీనికి విరుగుడు కనిపెడతారేమో చూడాలి.

అయినా స్ధానిక నాయకులు మరియు అధికారులు కు, పంపిణీ వ్యవస్థ లో లోపాలు, తెలీకుండా ఉంటుందా, వారి అండదండలు ఉండవా, ఇంత పెద్ద వ్యవస్థ లో అని అంటున్నారు.

ఉచిత పరిష్కారం రూపాయ ఖర్చు లేకుండా - దీని బదులుగా ప్రతి షాపు మరియు వాహనం పంపిణీ విధానం, అలాగే తీసుకునే ప్రజల ఆనందం, తమ వార్డు సోషల్ మీడియా లో ఎప్పుడు కప్పుడు పెడితే, ప్రజలు కూడా లోటుపాట్లు ను వెంటనే ఫోటోలు ద్వారా అక్కడ నే, తెలియచేస్తారు కదా సాక్ష్యం తో అంటున్నారు.

అలాగే పై అధికారుల సోషల్ మీడియా లింక్ లు, ప్రజలకు ప్రచారం లో తెలియచేసిన, ప్రజలే ఆధారాలు ఇస్తారు వీడియో అలాగే ఫోటోలు తో.

చిత్తశుద్ధి ఉంటే, ఇంత దుబారా ఖర్చు అవసరం, ఉండదు ఏమో, కాంట్రాక్టర్ లు కంపెనీలు బాగుపడటం తప్ప అని కొందరి అభిప్రాయం.

జగనన్న సరైన చర్యలు తీసుకుని, దుబారా ఖర్చు తగ్గించి, వీలున్నప్పుడు జనము సరుకు తీసుకునేటట్లు గా, ప్రజలకు మేలు చేసి, వారి దీవెనలు పొందాలని, పలువురు కోరుతున్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1655 General Articles, 61 Tatvaalu
Dt : 21-Mar-2021, Upd Dt : 21-Mar-2021, Category : Politics
Views : 543 ( + More Social Media views ), Id : 1047 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ration , vehicle , gps , tracking , social page , deliver , public , commitment , profit , public , contractor , jagan , nani , civil supplies , dealer
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content