పాపం పసివాడు Papam Pasivadu - అమ్మా చూడాలి Amma Chudali పాట, అమ్మ నడక కోసం Mom Walking - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,000; 104 తత్వాలు (Tatvaalu) and views 225,947.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

పాపం పసివాడు Papam Pasivadu - అమ్మా చూడాలి Amma Chudali పాట, అమ్మ నడక కోసం Mom Health Walking Support Parody Song

78+ year old Mom, holding her hand for a mile walk every day for 9+ years, requesting her, for BP sugar health care, with own parody song.

78+ ఏళ్ళ తూలి పడే అమ్మ ను, 9+ ఏళ్ళుగా రోజూ నడకకు మైలు నడకకు చేయి పట్టుకుని నడిపించడానికి, రమ్మనడానికి బతిమాలుతూ, బీపీ షుగరు ఆరోగ్య జాగ్రత్తలు కోసం, సొంత పేరడీ పాట.

ముదుసలి వయస్సులో, తమ కోసం రక్తం చెమట చిందించిన తమ తల్లి దండ్రులను అత్త మామలను, తమ తో నేడు ఉన్న పిల్లలు భాగస్వామి తో, అవసర అవసరాలతో నటించే, సమాన, ప్రేమ ఆప్యాయత గౌరవం అనురాగం ఉత్తం వైద్య సౌకర్యాలు ఇవ్వకుండా, అనాధలుగా దూరంగా ఇతరులతో లేదా బంధువులతో లేదా ఉళ్ళో వదిలే, క్రుతజ్ఞతలు మానవత్వం విశ్వసనీయత పాపభీతి త్యాగం సేవ లేని సంతానం/ పిల్లలు, ఈ పాత సినిమా పాపం పసివాడు లో పాట వినాలి చూడాలి, కాస్త అయినా బుద్ది వస్తుంది ఏమో.

మన తల్లి దండ్రులు, మనల్ని అనాధలుగా 6 ఏళ్ళ వయస్సులో వదిలేస్తే, ఎలా ఉంటుందో చూడండి మన బ్రతుకు రోడ్ మీద సంస్కార హీనులుగా చేతులు చాస్తూ అడుక్కుంటూ లేదా అసాంఘీక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అంతేనా, క్రుతజ్ఞత విశ్వసనీయతతో, ఈ కన్నీటి పాట మాటలతో.

మీరు ముదుసలి తల్లి దండ్రులు ను అత్త మామలను, దగ్గర పెట్టుకుంటారు కదూ, సమాన వైద్య సదుపాయాలతో. లేదంటే, రేపు మన బతుకు ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత అధికారం పదవులు ఉన్నా, కాలు చెయ్యి కదలని స్తితిలో, మానవత్వం ఉన్న ఎవరూ మనకు అండగా నిలవరు, ఎందుకంటే మనకు మానవత్వం క్రుతజ్ఞత విశ్వసనీయత లేవు కాబట్టి. పంచభూతాలు కాల రాస్తాయి.

మనకు ఎందరో మహానుభావులు నిరూపించారు, ఈ మధ్యకాలములో, మనం పుట్టిన తర్వాతనే సుమా. ఇంట్లో పెద్దలను అడగండి, వీరి జీవితాలలో చివరి పేజీలు అర్ధం అయేలా చెప్పమని - రామన్న రాజన్న సావిత్రమ్మ జయలలితమ్మ కోడెలయ్య శ్రీదేవమ్మ‌‌‌ కాఫీడేఅయ్య.

అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా అమ్మా - 2

ఇల్లు చేరే దారే లేదమ్మా, నిన్ను చూసే ఆశే లేదమ్మా 2
నడవాలంటే, ఓపికలేదు, ఆకలి వేస్తోంది
అమ్మా అమ్మా, అమ్మా అమ్మా

పలికేందుకు మనిషే లేడు, నిలిచేందుకు నీడే లేదు - 2
బాధగ ఉంది, భయమేస్తోంది, ప్రాణం లాగేస్తోంది
అమ్మా అమ్మా ||అమ్మా చూడాలి||

వైద్యం కోసం తెలిసిన వారితో, పిల్లవాడు ఒక్కడూ వెలుతుంటే, విమానము కూలి తోడు మనిషి మరణించి, నీళ్ళు లేని ఎడారిలో ఒకే ఒక్కడు మిగిలి, పలకరించే దిక్కు లేక, ఊళ్ళో ఉన్న తల్లి దండ్రి కోసము ఎలా విలపిస్తున్నాడో చూడండి.

అదే పాట మూసలో, మా అమ్మ, బయటకు నడకకు రాకపోతే, బీపీ షుగర్ అదుపుకు, ఎలా పాడి, రోజు పార్కుకు తిప్పుతున్నానో చదవండి వినండి పాట.

అమ్మా రావాలి, నువ్వు బయటకు రావాలి
మనము పార్కుకు పోవాలి, ఎండలో తప్పక నడవాలి, అమ్మా అమ్మా

ఇంట్లో ఉంటే బీపీ తగ్గదమ్మా, మైల్ నడవక షుగరు ఆగదమ్మా, 2
బతకాలంటే, మంచిగాలికి, నడకే మార్గం

డాక్టర్ ఏమో తిడుతున్నారు, పచ్చిరసమైనా నడక తప్పదూ 2
ఆయువు కోసం, మంచందిగి, మైలే నడవాలి || అమ్మా అమ్మా ||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,000; 104 తత్వాలు (Tatvaalu) and views 225,947
Dt : 21-Mar-2021, Upd Dt : 21-Mar-2021, Category : Songs
Views : 1691 ( + More Social Media views ), Id : 1045 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : papam pasivadu , svr , devika , amma chudali , song , amma nadaka , amma ravali
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content