పెరిగిన ధనం వ్యాపారం హోదా, తరిగిన బుద్ది బంధం క్రుతజ్ఞత - కోటీశ్వరుల ఛాలెంజ్ - అమ్మా నాన్న సేవ? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,084; 104 తత్వాలు (Tatvaalu) and views 226,042.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*పెరిగిన ధనం వ్యాపారం హోదా, తరిగిన బుద్ది బంధం క్రుతజ్ఞత - కోటీశ్వరుల ఛాలెంజ్ - మరచిన అమ్మా నాన్న/ అత్తా మామ సేవ?*

పైకి అందరమూ ఆధ్యాత్మిక భక్తులమే. కానీ ఆచరణలో ఏది మిత్రమా? ఈ కధనము చూడండి, ఇలాంటి వారు ఎందరో మనచుట్టూ. వీరిని చూసే, చిత్తశుద్ది లేని శివ పూజ లేలరా అన్న సామెత పుట్టింది, కాదా? మరలా వినాయక చవితి పూజ చేస్తారు, వినాయకుడు తల్లి దండ్రుల చుట్టు ప్రదక్షిణలు చేసారు, అలాగే మామ, విష్ణువుని గౌరవిస్తారు, అని వీరికి తెలుసు. కానీ పాటించరు. ప్రతి ఇంట్లో ఉన్న దే ఈ సమస్య, ఊళ్ళో అయినా, దేశం బయట అయినా. నటన, కపటం, మాట వేరు చేత వేరు.

ధనం లేకపోతే, నేలపై నడుస్తూ, అన్ని బంధాలు గతాలు మూలాలు గుర్తు ఉంటాయి. ఎప్పుడైతే, ధనం హోదా వ్యాపారం పెరిగిందో, అన్ని తూచ్, చివరికి తమకు తామే తూచ్.

పెద్దలు ఎవరినన్నా ఇతరులు కలిస్తే, ఏవండీ ఆరోగ్యం ఎలా ఉంది, మంచి ఆసుపత్రికి వెళుతున్నారా, మీ పిల్లలు ఏమి చేస్తున్నారు? అని అడగడం సహజం, వారి స్నేహితం బంధుత్వం సంస్కారం బట్టి.

మా పిల్లలు యూనివర్శిటి ఫస్ట్ వచ్చి, బొంబాయి/ దుబాయి/ అమెరికా/ బ్రిటన్ లో, ఎన్నో కంపెనీలు వ్యాపారాలు సంఘాలు పెట్టి, ఎంతో మందికి సేవ చేస్తున్నారు, అలాగే కొన్ని కోట్లు, కొన్ని ఆస్తులు, ఓ 4 ఇళ్ళు, 3 పిల్లలు ను వెనకేసారు. అని ఓ సరదా జవాబు.

వీరికి సేవలు పొందడానికి జీతాలు ఇచ్చి చేసే వ్యాపారానికి, ఉచితము గా నష్టపోతూ ప్రేమతో చేసే సేవ త్యాగం కు తేడా తెలియదు.

మరి మీకు 60 దాటి, బీపీ షుగర్ తో తూలుతూ శక్తి హీనులై ఒంటరిగా అనాధలుగా ఉన్న, మీ సేవ ఎప్పుడు చేస్తారు, మీ నోట్లో ముద్ద ఎప్పుడు వేస్తారు? మీ చేయి పట్టి రోజు ఎప్పుడు నడిపిస్తారు, సాక్స్ బూట్లు వేసి? మిమ్మలిని పక్కన ఉండి, ఆసుపత్రికి షికారుకి, ఎప్పుడు తీసుకుని వెళతారు?

ఇక్కడ మిగతా పిల్లలు ఉన్నా, ఆ సౌకర్యాలు ఆ రాజసం ఆ కార్లు విమానాలు, ఆ బతుకు చాలదనే కదా, మీ పిల్లలు అక్కడ దూరముగా ఉన్నది, రాజ్యాలు కంపెనీలు వ్యాపారాలు సంఘాలు ఏలుతుంది. మరి ఆ సౌభాగ్యం మనశ్శాంతి ప్రేమ అభిమానం, మీకు ఎప్పుడు కలిగిస్తారు? మనుమలు కోడళ్ళు అల్లుళ్ళ సేవలు ఎప్పుడు మీకు?

దానికి జవాబు చెప్పలేక, సిగ్గుతో తలవంచుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారు, సంస్కారం మానవత్వం గల జీవిత పరమార్ధం తెలిసిన తల్లి దండ్రులు/ అత్త మామలు (పెళ్ళి అయ్యి ఉంటే). అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడా, ఏరుదాటాక తెప్ప తగలెయ్యడం, పైకి ఎక్కాక నిచ్చెనను కాలితో తన్నడం, వాగు దాటాక వంతెనను కూల్చడం అన్న పాత మరిచిపోయిన సామెతలు గుర్తుకు తెచ్చుకున్నారు.

ఆ సంస్కారం మానవత్వం కూడా లేని ఇంకో తండ్రి/ మామ, మాకేమండి మా పిల్లలు కోట్లు పంపుతారు, ఇక్కడ అనాధాశ్రమములో లేదా ఇంట్లో ఒంటరిగా, పరుపుకింద కోట్లు పరచుకుని, పనివారు ఓ ముద్ద వేస్తే మింగుతూ, గోడలు పట్టుకుని పాలరాతి నేల పై పాక్కుంటూ, ఆస్తులకు కాపలా కుక్కలుగా, ఇక్కడే బతుకుతాము అని గర్వముగా చెపుతారు.

వీరికి పెళ్ళి, భాగస్వామి, పిల్లలు ఎందుకో కూడా తెలీదు. నోరు వరుసలు లేని జంతువులు కని ఊరి మీద వదులుతున్నాయి, మేము అంతే అనుకుంటే? ఇంక మానవత్వం, నరుల సేవ, మాత్రుపిత్రు దేవోభవ, క్రుతజ్ఞత అన్న పదాలు, డిక్షనరీ నుంచి తీసివేయాలి కదా?

ఇప్పుడు వారి పిల్లల దగ్గరకు వెళదాము. వీరిలో ఎక్కువ మంది, ధనముతో ఈ ప్రపంచాన్ని దేనినైనా కొనవచ్చు అన్న భ్రమలో ఉంటారు. అవసరం అవకాశం లేనిదే ఇతరులతో మాట్లాడరు, అంతా లెక్క ప్రకారం ఉపయోగముతోనే ప్రతి కదలిక.

ధనముతో, సొంత కంటి నిద్రను, సొంత ఒంటి ఆరోగ్యాన్ని, బంధాల బధ్రతను, కొనలేము అని కరోనా చెప్పినా నిరూపించినా, వీరు నమ్మరు.

అంతరిక్షములో ఉండి, తను గ్రహాల వ్యాపారం చేస్తే, భాగస్వామి భూమండలాన్ని ఏలుతూ ఉంటే, బిడ్డలు వారంతట వారే సంస్కారం క్రుతజ్ఞత నేర్చుకుని, ఒంటరిగా పెరిగి, పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం లేదా వ్యాపారాలతో, తమను ఉద్దరిస్తారు అని వీరి భావన. తల్లి దండ్రులు పక్కన ఉండి 20 ఏళ్ళు పెంచితేనే, వారిని లెక్క చేసి మాట వినడము లేదు అంటే, వీరు నమ్మరు.

ఇక ముదుసలి తల్లి దండ్రులు అంటే, టీవీలో సినిమా నటులను చూసినట్లు గా వాట్సాప్ లో, తిరుపతికి వెళ్ళి నట్లు గా సంవత్సరానికి ఓ 2 రోజులు వారితో కలిస్తే చాలు, ధనము ఎటూ పంపుతాము, బతక్క చస్తారా అని సదుద్దేశ్యం కావచ్చు.

సంవత్సరం పైగా దాటిపోయింది ఓపెన్ ఛాలెంజ్ చేసి, జవాబు లేదు. కరోనా కూడా, తగ్గి, నిన్న వెయ్యి మంది కార్యక్రమంలో లో మేము తప్ప, ఎవరూ మాస్క్ వేయలేదు. బస్సులు రైళ్ళు విమానాలు అన్ని కిక్కిరిసి ఉన్నాయి.

కొంత మంది, సొంత ఇల్లు వ్యాపారం ఉద్యోగం ఆదాయం అన్ని ఉన్న ఉత్తమ లక్షణాల విశాలమైన మనస్తత్వం గల సంస్కార కోటీశ్వరులు, ధనం తో ఏదైనా సాధిస్తాం అంటారు. మాకు ఎదురేలేదు, పైకి మేం ఎంతో మందికి సాయం చేశాం, అంటారు లేని గొప్ప లు. ఈమైలు లో అందరి పేర్లు రాసి పెట్టుకుంటారు, ఎవరితో ఎంత వ్యాపారం చేసి లాభం సంపాదించామో అని తర్వాత గుర్తు చేయడానికి.

మరి సొంత వారికి సేవ చెయ్యాలి కదా అంటే, పిల్లల కు దగ్గర ఉండి సంస్కారం నేర్పడం అంటే, ధనం ముఖ్యం, పిల్లలు తల్లి తండ్రులు అత్త మామలు బంధాలు కాదు అంటూ, నీళ్లు నములుతూ, చేతులు నలుపుతారు.

మరి చేతగాని భీకరాలు ప్రతిజ్ఞ లు ఎందుకు? ఇతరుల సేవలను గేళి తో తక్కువ చేయడం ఎందుకు? అబద్ధాల శపధాలు భీషణలు ఎందుకు? కన్నవారి కే, పిల్ల నిచ్చిన వారికే, ద్రోహం చేసేవారు, మంచి చేయనివారు, ఇతరుల కు నిస్వార్థంగా సేవ చేయగలరా? పిల్లలను సంస్కార వంతులు గా తీర్చి దిద్దు తారా? బంధాల విలువ గురించి వీరు ఉపన్యాసం చెబుతారా?

ఆ అమిత ధనం తో, వాళ్ళ సొంత కన్న అమ్మ నాన్న ను, పిల్లనిచ్చిన అత్త మామను తెచ్చి, మంచి వైద్యం తిండి ఇప్పించి, సొంత ఇంట్లో పెట్టి, భాగస్వామి, పిల్లలు, 4 గురు పని వారితో, మీ కన్నా గొప్పగా సేవలు చేపిస్తాము, సౌకర్యాలు కల్పిస్తాము అని ఛాలెంజ్ కోపంతో ఊగిపోతూ అన్నారు.

మరి ఇలాంటి ఛాలెంజ్ లు, మనం గత పదేళ్లు గా ఎన్నో చూశాం కదా, అని నవ్వాము.

సొంత ఇల్లు చేతిలో చిల్లి గవ్వ లేని, మనం కూడా, కనీసం 2 ఏళ్ళు అయినా వారికి సేవ చెయ్యి చాలు లే బాబు, నీకు సత్తా క్రుతజ్ఞత విశ్వసనీయత ఉంటే, మాలాంటి బీదవారిగా 8 ఏళ్ళు చేపించలేకపోయినా అని జాలి చూపిస్తే, ఓయస్ తప్పకుండా చేస్తాను అని ఛాలెంజ్ చేశారు, ఒప్పుకున్నారు.

సవాలు ఎప్పుడూ కూడా, ఇతరుల క్షేమం కోసం ఉండాలి సుమా, నాశనం కోసం ఉండకూడదు.

కరోనా లేదా కాలం తో పేరెంట్స్ ఇన్లాస్ పోయిన దాకా, ఇంట్లో కి తేకుండా, అబద్ధాలు తో బతికేస్తావా, గత 10 ఏళ్ళు నటించిన విధంగా అంటే, అంత ఖర్మ పట్టలేదు, సంవత్సరం లో, నా కెపాసిటీ చూపుతాం అన్నారు.

మీరు చేసింది ఏదీ గొప్ప కాదు, మేము గొప్పలు చాలా చేసి చూపిస్తాను అన్నారు. నువ్వు దేవుని వి కాదు, నేనే దేవత అన్నారు.

ఓరి స్వామి, ముందు కన్న వారికి ఇంట్లో ఉంచి ఓ ముద్ద పెట్టరా ఓ ఏడాది రెండేళ్ళు, మాటలు చేతల లోకి వస్తే, నువ్వూ దేవుడి వే, నీకూ దేవుని లా పూజ చేస్తానని చెప్పిన.

మీ అమ్మ నాన్న అత్త మామకు, నీ చేతిలో ఇంట్లో మంచి జరిగిన, అది మాకు మంచి చేసినట్లు గానే భావించాం, ఋణపడి ఉంటాము అని, ఛాలెంజ్ స్వీకరించాం మనం. అదే దైవత్వం.

మరి, మీకు చూపారా, అమ్మ నాన్న అత్త మామను? మీరు చూశారా? కనీసం ఓ ఏడాది అయినా?

ఇకనైనా డబ్బు తో అన్ని సాధించలేకపోయాం, సొంత అమ్మ నాన్నకు ముద్ద పెట్టలేకపోయాం, అని సిగ్గు తో తలవంచాలి కదా?

ఛాలెంజ్ తూచ్ అన్నారా? మాట తప్పడం మడమ తిప్పడం, అబద్ధాలు, గొప్పలు చెప్పడం, గుడ్డ కాల్చి, బురద నెత్తిన, వేయడం మామూలేనా?

అని సోము, రాముతో తన కోటీశ్వరుల మిత్రుల తల్లి దండ్రుల ఆవేదనను తెలిపాడు.

Increased Money Business Status, decreased Mind Bond Gratitude - Millionaire Challenge - Forgot Mom Dads Service?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,084; 104 తత్వాలు (Tatvaalu) and views 226,042
Dt : 23-Aug-2022, Upd Dt : 23-Aug-2022, Category : General
Views : 492 ( + More Social Media views ), Id : 1504 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : increased , money , business , status , decreased , mind , bond , gratitude , millionaire , challenge , forgot , parents , mom , dads , service , older
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content