అక్క పతనం కు కారణం ఎవరు? చెల్లి, ప్రియుడు, పేరెంట్స్, పెంపకం, అలవాట్లు, వ్యసన బానిసత్వం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,466; 104 తత్వాలు (Tatvaalu) and views 225,604.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*అక్క పతనం కు కారణం ఎవరు? చెల్లి, ప్రియుడు, పేరెంట్స్, పెంపకం, అలవాట్లు, వ్యసన బానిసత్వం, మానసిక బలహీనం?*

Who is the reason for the downfall of the older sister? Sister, boyfriend, parents, upbringing, habits, addiction, mental weakness?

పోలీసులు, ప్రభుత్వం, చట్టం వాటి విశ్లేషణ దోవ వేరు. ఆధ్యాత్మిక ధర్మ విశ్లేషణ వేరు.

అక్క పతనం కు కారణం ఎవరు? చెల్లి, ప్రియుడు, పేరెంట్స్, సంస్కార పెంపకం, తన/ తమ అలవాట్లు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం, మానసిక బలహీనం?

ఇంకా, అతి గారాబం, పిల్లల పై శ్రద్ద లేకపోవడం, అతి స్వేచ్చ, విచ్చలవిడి తనం, పెద్దలు అంటే భయం భక్తి లేక పోవడం, పిల్లలు ఏమి చేస్తున్నారు ఎలాంటి తిరుగుళ్ళు తిరుగుతున్నారు వారి ఆలోచనలు ఎటు వెళుతున్నాయి అని పట్టించుకునే ఓపిక లేకపోవడం, కుటుంబానికి నిజాయితీ గా మంచి చెప్పే అంటే తమ తప్పులు స్పష్టముగా విడమరచి చెప్పే సజీవ గురు సేవకులు లేకపోవడం, చెప్పినా వినకపోవడం, తమ టీనేజ్ సమస్యలు పెద్దలు మరవడం?

వాట్సాప్ స్టేటస్ ప్రొఫైల్ ఫోటో పెట్టండి, దొంగ చాటు చూడటం వద్దు అంటే, స్పందన లేకుండా మొద్దు గా ఉండొద్దు అంటే, ఎంత మంది విన్నారు? స్టేటస్ లో మీ సంస్కార పెంపకం గురించి ఎంత మంది చెప్పారు? ఆ మౌనం ఫలితాలు మన ఇంట్లో, మన పిల్లలు లో, భాగస్వామిలో, ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు ఫలితాలు ఎవరు అనుభవిస్తున్నారు?

రైతు, పొలం లో పంట వెయ్యాలి అంటే, విత్తనాలు మందు కొనడం దగ్గర నుంచి, దున్నటం, నాట్లు వేయడం, పాదులు చేసి నీళ్ళు పెట్టడం, కలుపు మొక్కలు తీసేయడం, ఎరువులు వేయడం, పక్షులు కీటకాలు వ్యాధుల నుంచి పంటను రక్షించడం, పంటకు కాపలా, ఎదుగుదలను గమనించడం, పంటను జాగ్రత్త గా కోసి, ఇంటికి చేర్చడం. ఇన్ని పనులు ఉన్నాయి.

మరి ఇవి చేతకాని మనలాంటి వారు, పొలం లో పంట వేయడం జోలికి వెళ్ళ వచ్చునా?

పిల్లలను సంస్కారం గా పెంచడం చేత గాని వారికి, పిల్లలు ఎందుకు? తమ కోర్కెలు తీర్చుకుని, చల్లబడవచ్చు కదా? ఆస్తులు అధికారం విదేశం పెంచుకోవచ్చు కదా?

నిన్న మనము రాసిన కధనము పాడిన గుండమ్మ కధ పేరడీ ఇదే కదా, లేపండి నిద్ర లేపండి, మానసిక బలం అని.

ఇప్పుడు పిల్లలను పతనం చేసిన, వంశ పాపం ఎవరిది? కలియుగ పాపం పెంచింది ఎవరు? సరే, మన పిల్లలు పోతే పోయారు, మరి వీరి చెడు స్నేహం వలన, ఇంకెన్ని కుటుంబాలు పతనం? దానికి బాధ్యత ఎవరు? మన ఇంటి నిప్పు, ఎన్ని ఇళ్ళు కాలుస్తుంది?

పోలీసులు సమాజ శాంతి భధ్రతలు చూడాలా? మన ఇంటి చేతగాని కుసంస్కార పెంపకం ను చూడాలా? మన వంశము అంత చేత గానిదా, పిల్లలను భాగస్వామిని అదుపులో పెట్టడం చేత కాదా? ఇంక దేవుని పూజలు కపటం నటనం అంతేగా? పెద్దలుగా మనల్ని ఎందుకు బాధ్యత చేయరు, ఫైన్ వేసి, జైల్ లో పెట్టి?

గుణం లేని పెళ్ళిలో, సంస్కారం లేని పెంపకములో, కపటం, నాటకం, 2 నాల్కలు, ఎవరిని మోసం చేసాయి?

శిక్ష వెయ్యాల్సింది ముందుగా ఎవరికి?

ఎవరి పతనం వారు చేసుకుంటూ, ఎవరి గొయ్య వారు తీసుకుంటున్నారు అంటే, నవ్వారు కదా, ఆనాడు. మరి ఇలాంటి ఉదాహరణలు ఎన్నెన్నో రోజూ వార్తలలో.

ఎవరది మొదటి తప్పు అని, మీ అభిప్రాయం? అయ్యో మా కొంపలో అంతేను, జవాబు ఉండదు అందామా? వార్తలలో ఇప్పుడు మోగుతున్న వార్త.

ఇది ప్రతి కుటుంబ కధ కాదా? ఈ రోజు వారు, రేపు మనము.

ఇదంతా అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం కాదా? పెద్దలు మరియు పిల్లలు ఇద్దరిది? ఈ వ్యసనాలు బలహీనత మారదు కదా? పాత్రలు, కధ అలాగే ముగింపు వేరుగా ఉండవచ్చు, అంతేనా?

మనము మొత్తుకుంటూ, రోజూ అందరినీ వేడుకుంటున్నది, రాతలు మాటలు పాటలు సాధనలు ద్వారా, ఇదే కదా?

పక్క ఇల్లు కాబట్టి, ఇవన్నీ కామన్ అండి అంటాము అంతేనా?

అదే మన ఇంట్లో అయితే, వెక్కి వెక్కి ఏడుస్తాము, జనం ముందు నటనకు, ఎంత నిర్దయ ఈ లోకం. పాడు మనుషులు, పాడు ధనము, పాడు మందు, ఎవరినీ నమ్మలేము అని ఏడుపు. ఎందుకంటే అసలు బాధ్యులు వారే కదా?

పాడు మనుషులు, పాడు ధనము, పాడు మందు - అవి మరి మీ సంస్కార ఇంట్లో ఎందుకు ఉన్నాయి? అంత ధనం ఎలా వచ్చింది? ధర్మ మార్గమేనా?

పిల్లల సంస్కార పెంపకం ఇదేనా? 20 ఏళ్ళకే వోడ్కాలు, బీజర్లు తాగడం? ఇంకా సబ్జెక్టులు తప్పి, గాలికి తిరుగుతూ?

పరాయి మత ప్రియుడు తో లేదా బాబాయి మందిరాల తో తిరగడం, స్నేహితులు/ బంధువులు/ పేరెంట్స్/ అక్క/ తమ్ముడుకి తెలీదా? పేరెంట్స్ అంత బిజీనా 2 చేతులా సంపాదనతో, సరదాలతో లేదా సోషల్ మీడియా/ ఓటీటీలతో? ఎవరు ఎవరిని మోసం, ఎవరు ఎవరికి ద్రోహం చేస్తున్నారు?

పాము తన గుడ్లును తిన్నట్లు, పేరెంట్స్ తమ పిల్లలను, కాల రాయడం, ఇది కాదా? వారే తెలుసుకుంటారు అండీ, ఇప్పుడు తెలుసుకుని ఏమి చేస్తారు? అక్క భూమి పై లేదు, చెల్లి ఇంట్లో లేదు, జైలు లో ఉంది.

కధ వెనక్కు తిప్ప గలమా? ఇలాంటి కుటుంబ సమాజ బాధ్యత లేని, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ మూర్ఖ తల్లి దండ్రులకు పిల్లలు, పెళ్ళి ఎందుకు? అది గుణ పెళ్ళి కాదు అని, మనకు ఈ ఉదాహరణలు చాలా? వీరి మంచి కోరే, మనలాగా బుద్ది చెప్పే ఒక్క బంధువు, స్నేహితులు లేరు? ఏమి బతుకు మనది? ఎవరినీ లెక్క చేయము, ఎవరి మాట వినము. మరి మన పిల్లలు అదే దోవ కాదా?

మన చుట్టూ, మన ఇంట్లోనే ఇంత ఘోరముగా ఉంటే, ఇంక మన పిల్లలు పక్క జిల్లాలు/ నగరాలు/ రాష్ట్రాలలో, ఇతర దేశాలలో చదువు ఉద్యోగం, ఇక అక్కడ పరిస్తితి ఇంకా ఘోరం? తాగుతున్నా, చెడు తిరుగుళ్ళు తిరుగుతు ఉన్నా, సహజీవనం చేస్తున్నా కూడా, ఇది మామూలే అండి అంటున్నారు. అన్ని 30 కే, పెళ్ళి కాక ముందే అయిపోతే, ఇంక పెళ్ళి బంధం, ఎన్ని రోజులు నిలబడుతుంది? వీరు ముదుసలి తల్లి తండ్రి అత్త మామల సేవ చేస్తారా? అంటే, బలహీన మనసులను, మనమే తయారు చేస్తున్నాము. ఆ పాపానికి, పంచభూతాల శిక్షణ మనకే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,466; 104 తత్వాలు (Tatvaalu) and views 225,604
Dt : 02-Sep-2023, Upd Dt : 02-Sep-2023, Category : General
Views : 228 ( + More Social Media views ), Id : 1904 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : downfall , reason , older , sister , boyfriend , parents , upbringing , habits
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content