Condition of Arishadvarg Ashtavyasan, Mental Peace, Control of 5 Senses? - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,922; 104 తత్వాలు (Tatvaalu) and views 226,448.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

కనీసం 5+ ఏళ్ళు సజీవ గురువు సేవ చేసిన, మన గురువు/ శిష్యుడు మాత్రమే, ధైర్యముగా, ప్రేమగా, మన భవిష్యత్ జీవిత కష్టాలను ఆపడానికి, ఈ ప్రశ్న మనల్ని తరచుగా అడుగుతారు, అడగాలి -

At least 5+ years of living guru Seva person, only our Guru/Disciple, bravely, lovingly, to stop future troubles in our life, often asks this question, they should ask -

అంతా క్షేమమేనా? మనలో అరిషడ్వర్గ అష్టవ్యసన జయం పరిస్థితి, మానసిక శాంతి, అప్పు, పంచేంద్రియాల నియంత్రణ స్ధాయి, ఎలా ఉంది మిత్రమా?

Is everything alright? How is the condition of Arishadvarg Ashtavyasan Jayam, mental peace, debt, control of the five senses, my friend?

ఏవి ప్రతివారం, మీ సొంత అనుభవ మాటలు, తెలుగు, తమిళ, హిందీ, మళయాళ, కన్నడ, లేదా ఇతర మాత్రు భాషల్లో,

Every week, your own words of experience, in Telugu, Tamil, Hindi, Malayalam, Kannada, or other mother languages,

ముదుసలి తల్లి తండ్రుల అత్తా మామల సజీవ గురువు సేవ, సామాజిక నిస్వార్ధ సేవ మన మొఖ ఫోటోలు లేకుండా, పిల్లల సంస్కార గుణ చమత్కారాలు, పిల్లలకు నేర్పే సంస్కార జ్ఞాన గుళికలు, మనల్ని మనం తెలుసుకుందాం అనే తపనలో చేస్తున్న సాధనలు,

The living guru Seva of old parents, in-laws, Social selfless service without our face photos, children's cultural virtues, the cultural knowledge capsules taught to children, the sadhanas we are doing in our quest to know ourselves,

వినే, చదివే, చూసే, భాగ్యం ఆనందం అద్రుష్టం మాకు, ఈ సంవత్సరం కూడా లేదా? అని అడుగుతారు, అడగాలి.

Hearing, reading, seeing, lucky, happiness, not even this year for us? It is asked, it should be asked.

ఒకవేళ మనం జవాబుగా లేదు అంటే లేదా మౌనముగా ఉంటే, మనం పంచభూతాల శిక్షణ కు సిద్ధం అని తెలుస్తోంది కదా? ఎందుకంటే మనలో అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ పరిస్థితి, మానసిక అశాంతి, అప్పు, సామాజిక స్వార్ధ సేవ, పంచేంద్రియాల అనియంత్రణ స్ధాయి ఉచ్చ స్తితిలో ఉన్నాయి. అంటే ప్రాపంచిక బ్రమలులో ఉన్నాము.

If we do not answer or remain silent, it seem that we are ready for the training of the Pancha Bhuta? Because we are in the state of Arishadvarg Ashtavyasan slavery, mental restlessness, debt, Social selfish service, uncontrolled stage of five senses. That means we are in the worldly illusions.

కాబట్టి, అహంకారముతో కోపము వద్దు. శాంతముతో మార్పు కావాలి. లేదంటే ఇతరులు తన్ని తిట్టి మార్పులు తెస్తారు.

So, don't be angry with pride. Change should be done gently. Otherwise others will scold hit and bring changes.

మొన్న చూసాము కదా స్టేటస్ లో, మామ/ అత్త ను చేతి కర్ర పెట్టి, కిందకు తోసి పడేసి, కోడలు/అల్లుడు ఎలా బుద్ది చెపుతున్నారో? ఇంకా బయటకు రాని, కన్నీటి బాధలు ఎన్నో మిత్రమా.

We have seen the other day in the status, how the uncle/aunt is beaten down by a hand stick, and the daughter-in-law/son-in-law scolds them? There are many tears and sorrows that have not yet come out, my friend.

ఇప్పుడు చెప్పండి ఈ శిష్యుడికి, మీ పరిస్తితి ఏమిటి? అంతా క్షేమమేనా? మనలో అరిషడ్వర్గ అష్టవ్యసన జయం పరిస్థితి, మానసిక శాంతి, పంచేంద్రియాల నియంత్రణ స్ధాయి, ఎలా ఉంది?

Now tell this disciple, what is your situation? Is everything alright? How is the condition of Arishadvarg Ashtavyasan Jayam, mental peace, control of the five senses?

సాత్వికుల జవాబు - మన్నించాలి, మీరు అడగక ముందే, మేము చెప్పాలి. మా తల్లి దండ్రులు, అత్త మామలు మా ఇంట్లో సేవలను అంగీకరించడం లేదు. మేము ఇంకా ఎక్కువ సాధనతో, నీతి నియమాలతో, వారికి నమ్మకం కలిగిస్తాం. వారే నమ్మలేదు అంటే, ఇంక మా పిల్లలకు సంస్కారం సరిగ్గా ఇవ్వడం లేదు అని మాకు అర్ధం అయ్యింది.

Satvik's Answer - Forgive, we must say before you ask. Our parents, aunts and uncles do not accept seva in our house. We will convince them with more practice, more ethics. We understood that if they did not believe, our children were not being properly educated/ samskara by us.

రజోగుణ జవాబు - మీకు మేమెందుకు చెప్పాలి? మా తల్లి దండ్రులు అత్త మామలు తప్పుడు వారు, వారిని మాతో ఉంచము. ఉన్న 4 రోజులు కనపడింది తిను, పదిమందితో తిరుగు, రోగం తో ఆసుపత్రిలో పో, వెన్నుపోటు గుండె పోటుతో. ఇదే మా వంశ సిద్దాంతం. మా పిల్లలు మా మాటలు వినరని మేము బయటకు చెప్పము, వింటున్నట్లుగా నటిస్తాము. అసలు మీకెందుకు, మేము మిమ్మల్ని, ఎవరినీ పట్టించుకోము, మీరు మమ్మల్ని పట్టించుకోవద్దు. మా సర్కిల్, మా ధనం, మా పదవి, మా అధికారం, మా అందం, మమ్మల్ని కాపాడుతుంది.

Rajoguna Answer - Why should we tell you? Our parents, aunts and uncles are wrong, we don't keep them with us. For 4 days living, eat what we want, enjoy with 10 people, go to the hospital with disease, with backstabbing and heart attack. This is our lineage theory. We don't say out loud that our children don't listen to us, we pretend to. Why you need? We don't care about you or others, you don't care about us. Our circle, our wealth, our position, our power, our beauty, protects us.

తమోగుణ జవాబు - ఏంటో ఈ సోది. తిన్నామా, పడుకున్నామా, సీరియల్ చూసాం అంతే గానీ, ఈ గోల ఏమిటి. మేము చదవము, జవాబు చెప్పే ఓపికా లేదు. అంతా బురద మయం, సర్వం మత్తు మయం. నిద్ర వస్తుంది. మాకు బయట లోకం సంగతులు వద్దు, మా పతనమే మాకు ముద్దు. మాకు ఇప్పుడు అన్నీ బాగున్నాయి, ఎవరినీ పట్టించుకోము. లేదా అసలు జవాబు ఉండదు.

Tamoguna's answer - What is this nonsense/ headache. Did we eat, slept, watch the serial that's all, what is this Gola. We don't read, we don't have the patience to answer. Everything is mud, everything is intoxicating. Sleep comes. We don't want the things of the outside world, our downfall is our kiss. Everything is fine with us now, we don't care about anyone. or no reply at all.

ఈ రజో మరియు తమో గుణము కల వారు, తాము ఏదో గొప్పగా, ఎవరితో అవసరము లేనట్టుగా, ఎవరినీ లెక్క చేయనట్లుగా, భావిస్తూ ఉంటారు. వీరు ఇతరులను అవమానిస్తున్నాము అనుకుంటారు కానీ, తమ పిల్లలు ఇవే లక్షణాలు నేర్చుకుని, తమనే అవమానిస్తారని తెలుసుకోలేని మూర్ఖులు. వీరి పిల్లలు కూడా ఎవరినీ లెక్క చేయరు.

People with this Rajo and Tamo quality feel that they are something great, that they don't need anyone, that they don't care anyone. They think they are insulting others, but they are fools who don't realize that their children learn the same traits and insult themselves. Even their children don't care anyone.

అసలు వారి బాధలు వినేవారు లేక, పిచ్చెక్కి, మతి పోగొట్టుకున్న అభాగ్యులు ఎందరో, మీ చుట్టూ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. లోలోన కుళ్ళుతూ ఉంటే, అవే కణితలుగా/ రోగాలుగా మారి, పూర్తిగా మైండ్ పోతుంది. మానసిక రోగానికి, మందు లేదు. మనసులో ఉన్నది అంతా, నమ్మకమైన వారిదగ్గర కక్కేయాలి, నిర్మలంగా ఉంచుకోవాలి. వారి బాధ వినడం ఇతరులకు, అవసరం మరియు ఆనందం కాదు. వారి బాధ చెప్పుకోవడం అనేది, వారి అవసరం, వారి ఆరోగ్యం అని మరువద్దు. అలా మన బాధ వినే వారికి మనము ఎంతో రుణపడి ఉండాలి, ఎందుకంటే మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతూ, మతిపోకుండా ఆపుతున్నారు మిత్రమా.

Open your eyes and look around you to see if there are any people who actually listen to their sufferings, how many mad and demented wretched people there are. If it rots inside, it turns into lumps/ diseases and the mind is completely lost. There is no cure for mental illness. All that is in the mind, should be kept in the hands of the faithful folks and keep mind clean/ pure. For others to hear their pain, it is not a necessity and pleasure. Don't forget that to talk about their pain is their need and health. So we should be very indebted to those who listen to our pain, because they protect our mental health and prevent us from going crazy, friend.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,922; 104 తత్వాలు (Tatvaalu) and views 226,448
Dt : 19-Mar-2024, Upd Dt : 19-Mar-2024, Category : Devotional
Views : 118 ( + More Social Media views ), Id : 2057 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Condition , Arishadvarg , Ashtavyasan , mental peace , control , 5 , senses
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content