వైసీపీ పెద్దలు సజ్జల మరియు జిల్లా మంత్రి బాలినేని గార్ల, ప్రకాశం జిల్లా, ఎన్నికల రివ్యూ మీటింగ్ - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1097 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1125 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

గతంలో మనం, వైకాపా పార్టీ జాగ్రత్తలు కోసం, అలాగే బాలినేని గారు జాగ్రత్తలు పడటానికి, కధనాలు రాసాం లింకు లో చూడగలరు. link.

అదే విధానం కొనసాగుతున్నది అనడానికి, ఓ కధనం ఇప్పుడు చదవండి.

మీ జిల్లా లో కూడా, ఇదే స్వార్థ రాజకీయాలు ఉంటాయి కదా, సొంత పార్టీని తొక్కి, వ్యక్తులకు స్వార్ధముతో ఉపయోగ పడుతున్నప్పుడు, ఇలాగే.

* వైసీపీ పెద్దలు సజ్జల మరియు జిల్లా మంత్రి బాలినేని గార్ల, ప్రకాశం జిల్లా, ఎన్నికల రివ్యూ మీటింగ్ జరుగుతుంది.

* ఏమయ్యా, బాలినేని అందరూ నన్ను మెతక మనిషి, గట్టిగా అడగడం రాదు, సరిగ్గా పట్టించుకోను పక్కవారికి అప్పగించి, వాస్తవ పరిస్థితులు లోతుగా చూడటం రాదు అంటారు. అలాగని ఎవరూ తమ స్వార్ధం కోసం, సొంతంగా నిర్ణయం తీసుకుని, తన స్వలాభం కోసం పార్టీ ని నాశనం చేస్తున్న, చూస్తూ ఊరుకోను ఊరుకోలేను, జగనన్న కు ద్రోహం చేయను.

బంధువు అయితే మాత్రం, పార్టీ చెడు కోరితే, జగనన్న సహించడు. చంద్రన్న లాగా, తన మనిషి కోసం, సొంత పార్టీ ని జిల్లా లో పట్టణంలో నాశనం చేయడం, జగనన్న కు ఇష్టం ఉండదు.

ఎక్కడ అయినా బావే, వంగ తోటలో బావ కాదని, సామెత మరువకు. పార్టీ పార్టీ నే, బంధుత్వం బంధుత్వమే.

జిల్లా లో తెదేపా బలోపేతం చేయడానికి, వైకాపా ను అణగదొక్కడానికి, భవిష్యత్తు లో జిల్లా లో, మీ వ్యాపారం గౌరవం పలుకుబడి దెబ్బతినకుండా ఉండటానికి, మీ స్వార్థం మాత్రమే చూసుకుంటూ ఉన్నారు, అని వార్తలు వస్తున్నాయి చాలా కాలంగా.

నేను, మిమ్మల్ని నమ్మి, ఈ తలనొప్పి వ్యవహారాలు మీ చేతిలో పెట్టి, ప్రశాంతంగా ఉన్నా. నా పదవి కే నా సమర్ధత కే, ఎసరు తెచ్చేలా ఉంది మీ పనులు. ఏమిటి దీనికి, మీ సమాధానం?

* సజ్జల గారు, ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు, జిల్లా లో తెదేపా ను అణగదొక్కి, వైకాపా ను బలోపేతం చేయడం, నా తప్పా? మీరే చెప్పండి?

* బాలినేని, ఇంకా బుకాయింపు ఏమిటి అయ్యా, మనలో మనకు కూడా. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న మనకు, తెదేపా నాయకులు అవసరమా? తెదేపా ను అణగదొక్కావా, వారికి నీ వ్యక్తి గత అవసరం, పేరు ప్రతిష్ఠ కోసం, ఆక్సిజన్ ఇచ్చావా? సరిగ్గా చెప్పు.

మాజీ జిల్లా తెదేపా మంత్రి సిద్దా తో కలసి భోజనం చేసిన, ఆయనకు మంత్రి అండ ఉంది అని, ఆయనకు గౌరవం విలువ పెరగదా?

ఎక్కడ అయినా తెదేపా వారు, బాబోయ్ మమ్మల్ని కాపాడు అని వచ్చి, ఓ పక్కన సైలెంట్ గా ఉండాలి కాని, అధికారం చలాయించడం ఏమిటి?

పోనీ అందర్ని రాజీనామా చేయించి, తిరిగి ఫాన్ మీద గెలిపించావా, చీరాల ఎమ్మెల్సీ లాగా? జగనన్న పక్క దోవ నటనలు వద్దు, అని గట్టిగా చెప్పారు కదా? అలా పక్క దోవలు చేసి, ఇప్పుడు చంద్రన్న ఏమి సాధించారు?

రేపు తెదేపా ప్రభుత్వం వస్తే, చంద్రన్న కు గతిలేక పక్కకు పోయిన ఆయనకే మంత్రి పదవి ఇస్తే, ఆయన మరలా మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. అంటే మీ ఇద్దరుకు పార్టీ ప్రతిష్ఠ, విలువ లు, జగనన్న మాట మీకనవసరం. మీ గొప్పలు మీ స్వార్థం, మీకు కావాలి అంతే నా?

* ఇంకా మీ వల్ల గాని, మిమ్మల్ని లెక్క చేయని మీ ట్రాప్ లో పడని, ఇద్దరు నిఖార్సు అయిన తెదేపా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎప్పుడు తెస్తావు పార్టీ లోకి, 2024 కు వస్తారా? ఇదేనా పనితీరు, అదీ పూర్తిగా చేయలేవా 2 ఏళ్ల కు?

జిల్లా పెద్దలు వైవీ సుబ్బారెడ్డి గారు కూడా, గమ్ముగా జరిగే తంతు చూస్తున్నారు, జిల్లా మనిషి గా. ఆయన గనుక నోరు ఎత్తి తే, మనందరి పరువు పోతుంది జాగ్రత్తలు.

* సరే మున్సిపల్ ఎన్నికలు లో మన పార్టీలో, మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చావా?

* ఇచ్చాను సజ్జల గారు, భలే వారే, మొదట నుంచి వైకాపా లో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత, ఎలక్షన్ ముందు వచ్చిన వారికి రెండో ప్రాధాన్యత, గెలిచిన తర్వాత వచ్చిన వారికి మూడో ప్రాధాన్యత కింద, మన నిజమైన కార్యకర్తలు కు, జగనన్న తోడు రక్షణ కల్పించాను.

తెదేపా నుంచి వచ్చిన వారు, మూడో ప్రాధాన్యత గా ఇచ్చి, తక్కువ సీట్లు ఇచ్చిన. అమ్మ తోడుగా, జగనన్న ను పార్టీ ని కార్యకర్తల ను, నేను మోసం చేయలేదు, బాధ పెట్టలేదు.

* పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ, ఎవరూ నన్ను చూడటం లేదు, అని అనుకుంటుంది అంట. మీరు జిల్లా లో చేస్తున్న పనులు, ఎవరికీ కనపడవు అనుకుంటున్నారా?

చీరాలలో ఎక్కువ వార్డు మెంబర్ లు గా, మూడో ప్రాధాన్యత లో ఉన్న వారికి వచ్చింది అంట, పుకార్లు వస్తోంది. తెదేపా కార్యకర్తలు, మీకు దండం పెడుతున్నారు అంట, మరలా తెదేపా గెలించిందాకా, మాకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చేశారు అని. ఆమంచి వర్గం కోపం గా ఉన్నారు అంట.

తెదేపా కు 13 మంది కన్నా దొరకలేదు అంటే, వారంతా, మన దాంట్లోకి వచ్చినట్టే గదా? ఇంత కన్నా రుజువు ఏమి కావాలి?

* కావాలని సొంత పార్టీలో నిప్పులు పెట్టి, ఆర్పుతున్నట్లుగా మీరు చేస్తున్న నటన, అద్భుతంగా ఉంది అంటున్నారు జనము. జగనన్న కు ఇవన్నీ తెలిసిన, మన పరిస్థితి చాలా ఇబ్బంది గా ఉంటుంది, తర్వాత మీ ఇష్టం.

బాలినేని గారు, దయచేసి మరలా మీరు చేసే పనులు, ఒకసారి సరిచూసుకోండి. నా పరువు, జగనన్న పరువు, పార్టీ పరువు తీయకండి.

ఇలా వారి రివ్యూ మీటింగ్ నిజముగా జరిగి ఉంటే, ఎప్పుడూ ఇలా జరుగుతుంటే, జిల్లా లో వైకాపా కు ఎదురు ఉండదు, అని వైసీపీ శ్రేయోభిలాషులు భావిస్తున్నారు.

మరి పార్టీ అధిష్ఠానం, ఎప్పుడులా ఎలా పోతే మాకెందుకు అనుకుంటున్నారా లేదా జిల్లా ను పదిలంగా చూసుకుంటారా, గట్టి వారి చేతిలో పెట్టి? బంధుత్వం లేదా వ్యక్తి కన్నా, పార్టీ ప్రతిష్టాత్మక ముఖ్యం అంటారా జగనన్న చూద్దాం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1125 General Articles, 47 Tatvaalu
Dt : 04-Mar-2021, Upd Dt : 04-Mar-2021, Category : Politics
Views : 113 ( + More Social Media views ), Id : 1000 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ycp , jagan , sajjala , district , minister , balineni , prakasam , election , review , meeting , story , ongole , chirala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content