ప్రకాశం జిల్లా మంత్రి వర్యులు బాలినేని గారు, జగనన్న మర్యాద నిలబెడుతున్నారా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,762; 104 తత్వాలు (Tatvaalu) and views 225,620.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

గౌరవ పార్టీ పెద్దలు జగనన్న, సజ్జల, విజయసాయి, వేమిరెడ్డి, వైవీ, మాగుంట, సురేష్ మరియు ఇంఛార్జి మంత్రి గార్లు, మీరైనా ధర్మం, న్యాయం చెప్పండి.

ప్రకాశం జిల్లా మంత్రి వర్యులు బాలినేని గారు, మన జగనన్న పరువు తీస్తున్నారా లేక నిలబెడుతున్నారా? చూడండి ఈ కింది జనం గుసగుసలు, ఇవన్నీ మనకు అవసరమా?

* చంద్రన్న కక్కిన కూడు మనకు అవసరమా? తెదేపా ఎమ్మెల్యేలు లేకపోతే, మన ప్రభుత్వం పడిపోతుందా?

* చంద్రన్న గ్రానైట్ పన్నులు చూపించి భయపెడితే, మనం అదే నీచానికి పాల్పడిన, ఇంక తేడా ఏముంది? అందులో మంత్రి గొప్పతనం చాకచక్యం చాణక్యం ఏముంది?

* జగనన్న, దర్జాగా రాజీనామా చేసి రమ్మన్నారు. అలా ఒక ఎమ్మెల్యే నైనా తేగలిగారా? అసలు 151 ఉన్న మనకు అవసరమా? అనవసర చీరాల నిప్పు రాజేసింది ఎవరు? మనము నవ్వుల పాలు కావడం లేదా?

* అందరినీ భయపెట్టి, నియంతలా ఉంటే, దేవుడు మెచ్చుతారా? వెన్నలాంటి మనసున్న మన జగనన్న అభిమతం కు, వ్యతిరేకంగా చేయవచ్చు నా?

* ఇప్పుడు అన్ని జిల్లా కలెక్టర్ ల ను ఇతర అధికారులు ను, మేము సంవత్సరం గా బతిమాలుతున్నాము, మా జగనన్న పధకాలు సమాచారం పెట్టండి బాబూ అని, జగనన్న అంటే అభిమానంతో అడుగుతున్నామా? లేక జగనన్న మమ్మల్ని భయపెడితే అడుగుతున్నామా? లేక మాకు వారు ఇచ్చిన పదవి, ఆదాయం ఉందా? మరి మీరు ఎందుకు చేయడము లేదు అదే పని?

* మంత్రి పదవి కూడా లేని, బాపట్ల ఎమ్మెల్యే గారు, బాపట్ల కు మెడికల్ కాలేజీ కోర్టు తెస్తే, విద్యుత్ అటవీ ఇంధన శాఖ, అంత పవర్ ఫుల్ పదవి ఉండి, చీరాలకు ఏమి తెచ్చారు? ఇదేనా చీరాలలో చుట్టుపక్కల జగనన్న పరువు కాపాడడం? ఓ మంత్రి చేయలేని పని, ఓ ఎమ్మెల్యే చేశారు అంటే, మనకు సిగ్గుచేటు కాదా? మన నిర్లక్ష్యం, చేతకాని తనం కాదా?

* కరణం గారిని తెచ్చాను పార్టీలోకి అని, ఫిషింగ్ హార్బర్, చేనేత పార్కు, మెడికల్ కాలేజీ, ఏదైనా ఒకటి చీరాలకు ఇచ్చారా?

* కనీసం మీరు ఉండే, ఒంగోలు కార్పోరేషన్, కలెక్టర్ ఆఫీసు లోనే, సోషల్ మీడియా పెట్టించే, పలుకుబడి సత్తా చాణక్యం, మనకు ఉందా?

* చెన్నైలో ధనం తో పట్టబడిన అనుచరుడు కార్పొరేటర్, ఏమి చేస్తాడో నాకు తెలీదు అని చెప్పడం, జగనన్న పరువు తీయడం కాదా? ఇంత అమాయక వ్యక్తి ని, మంత్రి పదవి లో పెట్టానా, అని అనుకోరా?

* నగరంలో ఓ వడ్డీ వ్యాపారి, ఎంతోమంది కి ధనం ఎగకొట్టి కన్నీళ్ళు తో ఆడుకుంటూ ఉంటే, కేసులో తిరుగుతూ ఉంటే, అతని కొడుకు కు, కార్పోరేషన్ సీటు ఇచ్చి, ఇంకా ఎక్కువ మంది జనం కన్నీళ్ళు తాగమనడం, జగనన్న పరువు కాపాడడమా? దేవుని దయతో ఆ ఎలక్షన్ ఆగిపోయింది మొన్న అని వినికిడి.

* మేము కూడా పెరిగిన 2 నెలల విద్యుత్ ఛార్జీలు కు 400 కట్టాము. అవి వెనక్కి రాలేదు, ఇక రావు. మరలా కొత్త బిల్లు వచ్చింది ఆ తర్వాత నెలలో, గతంలో హఠాత్తుగా పెరిగిన విద్యుత్ బాదుడు కు. వెనక్కి ఇప్పించ గలిగారా?

* కనీసం మన జిల్లా ఎస్పీ గారు ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటే, మంత్రి గారి ఫేస్బుక్ లో శభాష్ ఎస్పీ గారు, మా జిల్లా కు దొరికిన ఆణిముత్యం అని పొగిడారా?

ఇలా చెప్పుకుంటూ పోతున్న ఎన్నో ఉన్నాయి, పెద్దవి మేము అనము, దానికి ప్రతి పక్షాలు ఉన్నాయి. మన జిల్లా మంత్రి వర్యులు కు, మీరైనా సర్దిచెప్పి, మా మీద కోపం తెచ్చుకోకుండా, సక్రమమైన దోవలో, మన జగనన్న గౌరవం కు భంగం కలగకుండా, పార్టీ ఇమేజ్ ను కాపాడవలసిందిగా, ప్రకాశం జిల్లా వైసీపీ కార్యకర్తలు శ్రేయోభిలాషులు మరీ మరీ కోరుతున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,762; 104 తత్వాలు (Tatvaalu) and views 225,620
Dt : 05-Nov-2020, Upd Dt : 05-Nov-2020, Category : Politics
Views : 772 ( + More Social Media views ), Id : 793 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : district minister , balineni , keeping , elevating , jagan , courtesy , values , morals , magunta , suresh , yv , vijay
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content