Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. Whose money 100 rs, by seeing which movie, people will change? Without leaving slavery of Ashtavyasanas and Arishadvarga? Without self-criticism?
*ఎవరి సొమ్ము 100 రూ పెట్టి, ఏ సినిమా చూసి, మారతారు జనం? అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం వీడకుండా? ఆత్మ విమర్శ చేసుకోకుండా?*
ఉన్నప్పుడు పలుకు బువ్వ లేవు, పోయాక గంధపు నీరాజనం, మందికి ఘన భోజనం అని 2019 లో చెప్పాము, ఒక్క సాత్విక మనసు కన్నీరు పెట్టిందా, తమకు రాబోయే రోజులు తలచుకుని?
link
వీలుంటే కుటుంబ సమేతంగా, ఎవరైనా పంపే ఉచిత ధనంతో లేదా టిక్కెట్లతో, చూడగలరు జలగం బలగం పులగం సినిమా! మన ఇళ్ళలో లేని, ఆచరణలో మనము చెయ్యలేని, గుణం తో పెళ్ళిళ్ళు లేని మనకు, సిగ్గు తెచ్చే, ఆదర్శ మానవ సంబంధాలను సహజంగా ఆవిష్కరించిన గొప్ప సినిమా, హాల్లో నే కూల్ డ్రింక్ తాగి, కారే కళ్ళ కన్నీళ్ళు ముక్కు నీళ్ళు కర్చీఫ్ తో తుడుచుకుని, పల్లీలు తింటూ ఇంటికి చేరే లోపు, మరచిపోవచ్చు.
ఇంక ఓటీటీ అయితే ఇంకా పుణ్యం, ఒళ్ళు కదిలించకుండా పెంచుకుంటూ చూసి, సినిమా అయిపోయిన వెంటనే దానిని వదలి, ఇంకో సినిమా చూడవచ్చు, కళ్ళ అద్దాలు లావు పెంచుతూ. శ్లోకాలు మంత్రాలు పాటలు కు సమయం కష్టం కానీ, వీటికి కావలసినంత వృధా సమయం.
ఈ పులగం జలగం సినిమా చూడమని ఎవరో చెబితే, నే ఈ జవాబు. మామూలుగా చూడండి అంటే తప్పు లేదు. బంధాలు అనుబంధాలు అంటే? ధనం ఉంటే చాలు, మనకు అవి ఎందుకు? సినిమా లు మారుస్తాయా, మనం మారుతామా? టీవీ లో ఉచితం గా రాకుండా, ఖర్చు తో ఎవరివో కష్టాలు ఎందుకు చూడాలి? మన కష్టాల సినిమా ఎవరు చూస్తున్నారు, కనీసం ఉచితముగా?
1* ఇంట్లో అమ్మ నాన్న చెబితే, పోనీ స్నేహితులు బంధువులు చెబితే నేర్చుకోవాలి, అది పిల్లల కు నేర్పాలి. సాధనలో, మాటలలో, నడత లో, రోజూ/ వారం వారం చూపాలి. ఆ ఓపిక లేని జనం,
2* సొంత తల్లి తండ్రులు కాళ్ళు కడిగి, కేవలం పాదాల ఫోటో లు స్టేటస్ లో పెట్టండి ఇతరులకు ఆదర్శముగా అని 3 ఏళ్లు పై గా ప్రాధేయడుతుంటే, అన్నం పెట్టిన చేతులనే గౌరవించలేని మన మారని జనం,
3* మా 30 ఏళ్ళ లోపు పిల్లలు లేదా మేము అయినా, కనీసం 7 వారాలు 108 ప్రదక్షణాలు చేయగలిగే సత్తా, మానసిక బలం ఉంది అని చెప్పలేని, జీవం ఇచ్చిన దైవాన్ని త్రికరణ శుద్దితో సాధనతో గౌరవించలేని మన జనం,
4* మా 60 పైన ముదుసలి తల్లి దండ్రులు మాతో సమాన వైద్య మరియు సౌకర్యాలు అనుభవిస్తున్నారు 4 ఏళ్ళు పై గా వరుసగా అని చెప్పలేని క్రుతజ్ఞత విశ్వసనీయత లేని తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే జనం,
5* మా పిల్లలు సంస్కార పెంపకంతో, మా ముదుసలి తనం లో, వారి ఇంట్లో మమ్మల్ని ఉంచి చూస్తారు, అని గట్టిగా చెప్పలేని భవిష్యత్ భాధ్యత లేని మోహ జనం
6* మా పిల్లలు చదువుతున్న, రామాయణ భారత భాగవత భగవద్గీత నుంచి శ్లోకాలు పద్యాలు పాటలు వినండి అని చెప్పలేని, సాత్విక గుణం లేని తమ కుటుంబ శ్రేయస్సుకే సమయం లేని, జనం,
7* ఎందుకు అనాధాశ్రమాలు పెరుగుతున్నాయి అని, అందులో ఉన్న ప్రతి ఒక్కరి పిల్లల దగ్గరకు వెళ్ళి, కనీసం మనకు తెలిసిన వారిని, పిల్లలను మందలించి ఇంట్లో పెట్టలేని కపట అవసర అవకాశ స్నేహిత బంధు కుటుంబ జనం,
8* గల్లి నుంచి రాష్ట్ర నాయకులు దాకా, త్రికరణ శుద్దితో, ఆత్మ ద్రోహముతో ఆవుకు ఓటు వెయ్యకుండా, నక్క పాము పులి కి ఓటు వేసే, పంచభూతాల ప్రళయాలను ఆహ్వానిస్తున్న, మన జనం
9* తల్లి తండ్రులు లాంటి, తెలుగు గురువులు బ్రహ్మం, రాఘవేంద్ర, వేమన లను నిర్దాక్షిణ్యముగా వదలి, పరాయి భాషా బాబాయి ల వెంట పడే, మన మోహ జనం
ఎవరి సొమ్ము 100 రూ పెట్టి, ఏ సినిమా చూసి, మారతారు జనం? అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం వీడకుండా? ఆత్మ విమర్శ చేసుకోకుండా? వీళ్ళు ముదుసలి తల్లి తండ్రులు ను, గౌరవం గా సమాన వైద్య మరియు సదుపాయాలు తో చూస్తారా? తమ పిల్లల చేతిలో చూడబడతారా? కాబట్టి ధనం వ్రుధా చెయ్యొద్దు.
మరి, ఎందుకు ఇలా జరుగుతుంది?
మన జనం అందరి ఆలోచన ఒకటే, కలియుగ పాపాన్ని తొందరగా 80 నుంచి 100 శాతం కు చేర్చి, ప్రళయములో ముంచి, భవిష్యత్ తరాలను తుంచి, మరల సత్యయుగాన్ని కొత్త గా తేవాలని, రాముడిని చూడాలని? ఈ మంచి ప్రజల కోరిక తప్పా? తప్పా? తప్పా? పూర్తి గా పతనం కాకుండా, అది ఎలా సాధ్యం? అందుకే మన అందరి పరుగులు వేగంగా పతనం వైపు సుమా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,370,554; 104 తత్వాలు (Tatvaalu) and views 256,752 Dt : 27-Mar-2023, Upd Dt : 27-Mar-2023, Category : General
Views : 628
( + More Social Media views ), Id : 1739 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
money ,
100 ,
movie ,
people ,
change ,
slavery ,
ashtavyasana ,
arishadvarga ,
self ,
criticism Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments