ఉన్నప్పుడు పలుకు బువ్వ లేవు, పోయాక గంధపు నీరాజనం, మందికి ఘన భోజనం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2127 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2162 General Articles and views 2,187,743; 104 తత్వాలు (Tatvaalu) and views 243,038.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఉమ, సుమ అక్క చెల్లెళ్ళు. భర్తలకు నగరంలో వ్యాపారం. తల్లి బాధ్యతలు వదిలేసారు, ఒకరు నాకు కష్టమని ఇంకొకరు నాకు భారమని. ఎందుకంటే తల్లి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, వయసు ఉడిగి పోయింది, పెద్దగా పనులకి పనికి రాదు.

ఒక కూతురు కి పెద్ద జబ్బు చేస్తే, పక్క రాష్ట్ర మహనగరం మద్రాసు కు భాష రాకపొయినా, చదువు లేక పోయినా, దూరా భారము అయినా , 8 ఏళ్ళు హాస్పిటల్ కి తిరిగి, బతికించింది. అలాగే, ఉద్యోగ ఊరు ప్రయాణాలలో తోడు గా ఉంది, నెలలకు నెలలు, ముసలి భర్తను కూడా వదిలి. ఇంకో కూతురు కి కానుపుల సేవలు మరియు పిల్లల్ని పెంచింది దగ్గర ఉంచుకొని. రోగాలోస్తే , దగ్గర ఉండి కూలి మనిషిలా తిరుగుతూ, సేవలు చేసింది. చాటుగా చేతిలో ఉన్న డబ్బు ఇచ్చింది. అవన్నీ గతము, ఎవరికీ గుర్తు లేవు రావు.

తల్లి వయస్సు 70 దాటింది. అడుగులు తడబడుతున్నాయి. కర్ర లేకుండా నడవ లేని పరిస్తితి. కూతుళ్ళు, ఇంక పైసా రాదు అని తెలిసి, 4 ఏళ్ళ నుంచి మాటలు, రాక పోకలు లేవు. ఎవరన్నా అడిగినా, మాకు పెళ్ళి అయ్యింది, మా ఇబ్బందులు మాకు ఉన్నాయి. చేతిలో ఉన్న డబ్బులతో ఆమె ఇష్టము అని చెప్పి దులిపేసుకున్నారు. 5 ఏళ్ళ ముందు వచ్చినా కూడా, తల్లి పని మనిషిలా అన్ని చేసి పెట్టాలి, వారు మంచము దిగరు 7 దాకా తల్లి 5 కే లేచినా. వారితో వచ్చిన చుట్టాలకు కూడా, ఊడిగం చెయ్యాలి, తల్లి సొంత ఖర్చుతో. తల్లిని చూడకున్నా, అత్తను చూస్తారా అదీ లేదు. అటువైపూ గొడవలే.

పిల్లలకు 10 ఏళ్ళ దాకా, పెద్దలకు 60 తర్వాత లేదా శక్తి కోల్పోయాక, కావాల్సినది డబ్బు కాదు, కేవలము పలుకు ఆప్యాయత ప్రేమ అనే విషయాన్ని ఎప్పుడో మరచిపోయారు. మానవత్వ మన్నది, కరుణ అన్నది, క్రుతజ్ఞత అన్నది వారికి అసలు తెలీదు. వారికి తగ్గవారే అల్లుళ్ళు కూడా.

ఒకరు ఆస్తి ఎలా కాజేయాలి, ఏలా అమ్ముకోని ఆనందము గా గడపాలి అని నిరంతర తపన. తన మన అనేది, అసలే లేని, మనిషి కాని మనిషి. ఎందుకంటే సొంత తల్లి కి కూడా, కళ్ళ చికిత్స , ప్రభుత్వ ఆసుపత్రి లో చేయించాడు డబ్బులు మిగలాలనో లేక మనకెందుకనో. అడిగిన వారికి, వాళ్ళు అక్కడకే వెళతాము అంటే ఎమి చెయాలి అని ఎదురు ప్రశ్న. ఇంకా అత్తింటిది ఏమైన దొరుకుతుందేమో అని ఆశ.

ఇంకొకరు, అసలు సొంత భార్యతో లేదా కడుపున పుట్టిన పిల్లలకు , దగ్గర గా ఉండాలి అంటేనే కష్టము. ఎప్పుడూ వారికి దూరంగా, సంపాదనలో సంతోషాలలో మునిగితేలుతూ ఉంటాడు. అమ్మ లేదా అత్త వైపు విషయాలు అసలు పట్టవు.

ఉమ, సుమ ఇలా అనుకుంటున్నారు. అక్కా, అమ్మ బతికి ఉన్నప్పుడే, ఇద్దరం స్థలము రియల్ ఎస్టేట్ కి, అమ్ముకోని బాగా సంపాదించాము అమ్మ వలన. బంధం, జ్ఞాపకాలు మనకు వద్దు. హయిగా, మన సొమ్ముతో, ఇల్లు కట్టుకొనే బాధ తప్పింది.

అసలు అమ్మ దేనికీ పనికి రాదూ, పొనీలే ముద్ద పెట్టి ఉంచుకుందాము అంటే, షుగరు, బీపీ, ఎప్పుడు ఏమౌతుందో తెలీదు. హస్పిటల్ ఖర్చు ఎవరు భరిస్తారు, ఆమెను కని పెట్టుకోని ఎవరు ఇంటి దగ్గర కూర్చుంటారు. వైద్యం కోసం, పెద్ద నగరాలు ఎవరు తిరుగుతారు. అబ్బో, ముసలి వాళ్ళు అంటే చాల కష్టము, నష్టము. మనల్ని కన్నారు గనుక, భాధ్యత గా మన చిన్నప్పుడు చేసారు, మన కేమి అవసరం ఇప్పుడు. మనము అడిగామా కనమని చెయ్యమని. అమ్మకు, వైద్యానికి రూపాయి ఇవ్వనవసరం లేదు.

ఉమ : మనము ఇలా ఉంటే, జనము మనల్ని తప్పు గా అనుకుంటారేమో అక్కా.

సుమ : భలే దానివే, అందరూ అలాంటి తప్పుడు రకాలే. మన 15 మంది ఉండే అపర్ట్మెంట్ లో ఎవరన్నా బాధపడ్డరా? అడిగారా? అడిగినా, అంత కష్టము గా మీకు ఉంటే మీరు చూడండి అనో, ఆమె మమ్మల్ని వద్దు అని అన్నదనో, ఎదో ఒక అబద్దము చెప్పలేమా? నేను పవిత్రమైన టీచర్ వ్రుత్తి చేస్తున్న, అలా అబద్దము చెప్పటము నాకు 5 నిమిషాల పని. నీకు ఎటూ, నా కన్న అబద్దాలు ఎక్కువ వచ్చు, భయం లేదులే అంది చిరునవ్వు తో.

ఉమ : తెలుసులే అక్కా, డబ్బు దగ్గర మన ఇద్దరిది ఒకటే మనసు. మరి అమ్మకు ఏమైనా జరిగితే, మనము ఏమైనా చెయ్యాలా? చేయక పోతే ఇంత చేసిన తల్లికి, ఇదే మన క్రుతఘ్నత అని తెలిసిపోతుందేమో?

సుమ : జనము కూడా దొంగలే. వాళ్ళూ, వాళ్ళ ఇంట్లో ఇలాగే చేస్తుంటారు. భయము వద్దు. అంత గా పోతే, మనమే అమ్మ ఇచ్చిన లక్ష లో చెరి సగం వేసుకోని, నాలుగు గంధపు చెక్కలతో ఖననం చేసి, 50 మందికి మంచి పసందు ఘనమైన భోజనాలు పెడితే ముక్కలు వేసి, అందరూ మనల్నే పొగుడుతారు, కన్న తల్లి అంటే ఎంతో ప్రేమ అని. పిచ్చి లోకం ఇది, బతికి ఉన్నప్పుడు వదిలేసాము, అని అసలు గుర్తు ఉండదు వాళ్ళకి.

విదేశాల్లో అలాగే స్వదేశం లో పెద్దనగరాల్లో చాలా మంది విశ్వాసఘాతకులు, తమ తల్లి దండ్రులను దగ్గర ఉంచి, సేవ చేసి మంచి వైద్యం ఇప్పించకుండా, మేము అమ్ముడు బోయాము, మా భాగస్వామి ఒప్పుకోరు లేదా మా పేరెంట్స్ మమ్మల్ని నమ్మి రారు లేదా మేము ఇక్కడపోయినా పర్లేదు వారు అక్కడే పోతారంట అని అబద్దాలతో బతుకుతూ ఉన్నారు కదా. వారే మనకు ఆదర్శం.

ఉమ : అక్కా, మరి మన పిల్లలు ఇలా చెయ్యరా మనకూ?

సుమ : మన పెంపకము బంగారము, అలా చేయరు. మనల్ని పువ్వుల్లో పెట్టుకొని బంగారం గా చూస్తారు. చూడకపొయినా, మనము హయిగా బతకొచ్చు.

ఉమ : శక్తి లేని అమ్మను చూసాక 70 లో, తడబడే అడుగులు చూసాక కూడా నీకు ధైర్యం ఉందంటే, వామ్మో , నువ్వు సామాన్యురాలివి కాదక్కా. అని ఇద్దరు ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.

అంతే కాదు, మన బాబాయ్ లు ఏమి చేసారో తెలుసు గదా. ఒకాయన, తాతయ్యను పక్కన ఇల్లు అమ్ముకొని దూరంగా పరిగెత్తేటట్టు చేశారు. ఇంకోకాయన, ఉద్యోగం కోసం తల్లి దండ్రులను మన నాన్నకు అప్పగించి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు పోయాక, బాబాయి లు కలసి మరీ ఏటి తద్దినం, గర్వంగా ఘనం గా చేస్తుంటే, మన చుట్టాలు హయిగా సంతోషము గా వెళ్ళారు గతం మరచి . అలాగే మనకు ఏమీ ఇబ్బంది రాదు.

పెద్దలను అనుసరించండి అంటారు, మనకు మన బాబాయి లే ఆదర్శము. దేవుడుంటే, వాళ్ళది తప్పు కానప్పుడు మనది తప్పు ఎలా అవుతుంది.

కానీ మనిద్దరము సూపర్ అక్కా, మంచి చేయక పోగా, కబ్జా చేస్తుంటే నీ మొగుడి వైపు వాళ్ళు, ఇద్దరము మా కేమి సంభందము అని సినిమా చూస్తున్నాము చూడూ అది హైలైట్. మనకు అందులో రుపాయి రానప్పుడు, మనకెందుకు అక్కా? క్రుతజ్ఞత, పసుపు కుంకం పాత చింత కాయ మాటలు.

అసలు, మనం ఏమి చెయ్యకుండా గమ్మున ఉండి, ఇంటికొచ్చిన వారికి టిఫ్ఫిన్ పెడితే చాలు, మనమే మంచి వాళ్ళం అంటారు, పిచ్చి జనం, స్నేహితులు, చుట్టాలు. అందరం అవకాశవాదులమే.

వయసుడిగిన తల్లి దండ్రులను, డబ్బుతో కాక, మనసు, ఆప్యాయత, ప్రేమతో చూసే రోజులు వస్తాయా? 25 ఏళ్ళు ఇంట్లో పెట్టుకోని పెంచిన మనకే, ఇంత క్రుతజ్ఞత ఉంటే, ఇంక 5 ఏళ్ళ నుంచే దురంగా పెట్టిన మన పిల్లలు మనలను చూస్తారా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2162 General Articles and views 2,187,743; 104 తత్వాలు (Tatvaalu) and views 243,038
Dt : 29-Jan-2019, Upd Dt : 10-Apr-2019, Category : General
Views : 2019 ( + More Social Media views ), Id : 44 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sisters , mother , care , old , parents , person , alive , word , food , death , sandalwood , lamps , Orphan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content