Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. అయ్యో, ఎవరూ చెప్పలేదు ఇంతవరకు, బాబాయి శివైక్యము చెందారు అని. నేను రెండు ఏళ్ళ క్రితం చూసినప్పుడు, బాగానే షాపు దగ్గర కూర్చుని ఉన్నారు బాబాయి, నవ్వుతూ పక్కన వాళ్ళ తో అన్నాడు రాము సోముతో.
అందరూ బాబాయి ని చూసి, మా నాన్న అనుకుంటారు, కవలలు లాగా ముక్కట్లు కలుస్తాయి. చిన్నప్పుడు, ఇందాకే మీ నాన్న స్టేషన్ లో రైల్ దిగి వెళ్ళారు అనేవాళ్ళు. పిన్నిని అడిగి నట్లు చెప్పగలరు. బాబాయి ఆత్మ కు, శాంతి కలగాలని దేవుని ప్రార్ధిస్తున్నాము.
మరి సూదకం ఉంటుంది కదా, గుడి దగ్గర వచ్చే వారం బయట చేసే ప్రదక్షిణలు కు ఇబ్బంది ఉంటుందా లేక దినం వారం దాకా ఆపడమా? ప్రత్యేక పూజలు తప్ప, వేరేవి ఆపనవసరం లేదంటారు. అందులో రాకపోకలు మాటలు లేకపోతే, అసలు పట్టింపు లేదంటారు. తెలిసిన, చెప్పగలరు. విశేష పూజలు మాత్రమే వద్దు అంటారు, ఇంటి పేరు సూదకం లో. అంటే సత్యనారాయణ వృతం లేదా పదిమంది ని పిలిచి పూజ, యాగాలు, ...
నిన్న జరిగితే, ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. తెలియనంత వరకూ ఇబ్బంది లేదు, తెలిసీ చెప్పకపోతే వారికి పాపం.
ఈ రెండు ఏళ్ళలో, రెండో సారి మీ అందరి ఎదురు ఒప్పకుంటున్నా. రాజధాని చుట్టాలు లో, అత్తే నయం. ధన్యవాదాలు, నమస్కారములు. అత్త చెప్పింది, ఈ ముఖ్యమైన విషయం.
ఎందుకంటే మా ఇంటి పేరు లో, 6 ఏళ్లుగా తల్లి సేవ చేస్తూ ప్రపంచ అత్యుత్తమ వైద్యం అందిస్తూ, వారం వారం గుడి లో దీపం పెడుతూ, 48 వారాలు 108 ప్రదక్షిణలు చేసింది, ఎవరో మీకు తెలుసు. నేను తర్పణాలు వదిలితే, చుట్టం అయినా బయటవారైనా, ఉత్తమ గతి కలుగుతుంది. కాబట్టి, తప్పక చెప్పాలి, నా చేత చేయించాలి, నేను తర్పణం వదలాలి. వారు మనతో కలసి ఉన్నారు లేదు అన్నది విషయం కాదు ఇక్కడ. మన మంచి, మనం చేద్దాం. బాబాయి నా దగ్గరకు తప్పకుండా వస్తారు స్వీకరించడానికి.
తప్పు అయినా ఒప్పు అయినా, కష్టం గా ఉన్నా, వెంటనే అడగటం, అడిగించుకోవడం కరెక్టు. ఇద్దరు మనసులు ప్రశాంతంగా ఉంటాయి, ఎవరికైనా. నటనలు, దొంగ మాటలు, దాంకోవడం వలన, ఎవరికీ ప్రయోజనం లేదు. చివరలో నష్టం వారికే, అవే వారి వెంట పడుతాయి.
ఈ సమయంలో పిన్ని మంచి తనం, ఒకసారి గుర్తు చేసుకుందాం. మామూలు గా పిన్ని, బాబాయి ఎదరు గట్టిగా మాట్లాడదు.
కానీ ఈ 5 ఏళ్ల లో, ఒకసారి బాబాయి ఇంటి కి పలకరింపు కు వెళితే, బాబాయి కోపం లో ఉంటే, పిన్ని గట్టిగా వాదించి స్పష్టంగా చెప్పింది. మంచి నీళ్ళు, కాఫీ తెచ్చి ఇవ్వబోయింది.
అప్పుడు పిన్ని మాటలు - వాడు ఈ ఇంటి పెద్ద కొడుకు. ఎప్పుడు అయినా, వాడు రావచ్చు పోవచ్చు, ఆపే హక్కు ఎవరికీ లేదు. కన్నతల్లి ని పక్కన పెట్టుకుని, వైద్యం చేపిస్తూ, అక్కడ ఉన్నాడు.
ఒరే, ఆయన మాటలు పట్టించుకోకు అని నన్ను సముదాయించింది, అండగా నిలచింది. పిన్ని కి దండం పెట్టి, పిన్ని నీ మంచే నిన్ను కాపాడుతుంది అని, తిరిగి వచ్చాను నవ్వుతూ. అప్పుడే, అందరికీ చెప్పాను, పిన్ని మంచితనం.
బహుశా ఆమె కూడా, మరచి పోయి ఉండవచ్చు. ఆమె కు భగవంతుడు, మనోధైర్యం ను, అండ ఇవ్వాలి. తోడు పోయిన, ఏ మనిషి పరిస్తితి అయినా ఇలాగే ఉంటుంది కదా.
కార్యక్రమం అన్ని అయిన తర్వాత, ఖాళీగా, ఉండి , మాట్లాడుతాను ఇబ్బంది లేదు అంటే, మాట్లాండిచగలరు, ముందు గా చెప్పి. పిన్ని ఆరోగ్యం గా, క్షేమంగా ఉండాలి.
అత్త కు, ఒంగోలు కొత్త ఇంట్లో చేరేటప్ఫుడు పిలుపులకు, గొడుగు నేను పట్టుకున్నా. ఆ రుణం ఈరోజు అత్త తీర్చుకున్నది, ఈ మాటను చెప్పి.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,386,524; 104 తత్వాలు (Tatvaalu) and views 258,185 Dt : 06-Sep-2020, Upd Dt : 06-Sep-2020, Category : General
Views : 979
( + More Social Media views ), Id : 680 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
uncle ,
babai ,
father ,
twins ,
venkatrao Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments