ఒకే కుటుంబ పెద్దలు పిల్లలు, జీవిత భాగస్వాములు, వేరు వేరు పార్టీ లో పరమార్ధం? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,884; 104 తత్వాలు (Tatvaalu) and views 226,208.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

చక్కటి ప్రశ్న, ప్రజాస్వామ్యం లో ఏ పార్టీలో అయినా చేరే, ఆ హక్కు ప్రతి ఒకరు కూ ఉంది. అందులో మన దేశంలో, ఆ స్వేచ్ఛ ఎక్కువ.

చాలా తక్కువ మంది, ఒకే కుటుంబం నుంచి, ఇలాంటి చిత్రమైన పరిస్థితిలో ఉంటారు. అవకాశవాదము అవసరము అధికార కాంక్ష మాత్రమే వీరికి ముఖ్యం. జనానికి అలాగే పార్టీకి, ఎటూ దమ్మిడి ఉపయోగము ఉండదు.

మిగతా మంచి వారికి ఇది నామర్ధా, చిన్నతనము, ప్రాణం పోయిన దానితో సమానము.

ధన అవసర అవకాశ వర్గాల మాయలో ఉన్న, ఊసరవెల్లి జనం, పవిత్ర మైన ఓటు ను అపవిత్రం చేసి, మోహంతో ఓట్లు వేసి గెలిపించిన, ఆ గెలిచిన ఊసరవెల్లి నాయక కుటుంబం, వివిధ పార్టీల లో ఉండి, వీలైనంత గా, పది చేతులారా సంపాదించి, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటూ, ఇతరులు ఎక్కువ మందిని ఇబ్బందులు కు గురి చేయాలి అంటే, ఇదే మంచి మార్గం కదా?

సిద్దాంతము లేని పార్టీలు, నాయకులు, జనము తో మన రాజ్యాలు అల్లాడుతున్నాయి. ఎప్పుడు ఏ పార్టీలో నాయకులు ఉంటారో తెలీదు. అలాంటి వారిని ఎన్నుకున్న, జనము మనము కూడా ఏ పార్టీలో ఉన్నామో మనకూ తెలీదు. ఇంక వారినేమి అంటాము.

మనకు శాస్త్రాలు నిగూఢ అర్ధాలను ఎలా ఇస్తాయో, వీరు వివిధ పార్టీల లో ఉండటం బట్టి, వారి కుటుంబ ఆలోచనలు ఒద్దిక సంస్కారం ను, నిజాయితీగా నిగూఢ బహిరంగంగా, ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు.

ఇలాంటి వి ఎన్నికల అఫిడవిట్ పెట్టలేరు, పార్టీ గానీ ఎన్నికల సంఘం గానీ ఇవి పట్టించుకోవు, ప్రజలకు లేని దురద మనకెందుకు లే అని. పెద్దలు కొందరు, ఈ అర్ధాలు చెపుతారు, కాదంటే మీరూ సరిచేయవచ్చును.

తప్పు ఒప్పులు సరిచేయగలరు విజ్ఞాన వంతులు, పరుల మంచి కోసం, మన పిల్లలు చదివినా , వాస్తవం తెలియాలి.

మంచి మూలన ఉంటే, చెడు ప్రతి చెవి దగ్గరకు, పరుగులు తీస్తుంది. మనమూ బాధ్యులమే.

1). తల్లి దండ్రులు మరియు బిడ్డ రెండు పార్టీలు లో

* పెద్దల ఆలోచన

1. - బంధువులకు ఎటూ చెప్పి పార్టీ లో చేర్చ లేను, ఇంక ప్రజలకు చెప్పి మార్చ గలనా? నా సొంత పిల్లలు కు కూడా పార్టీ సిద్దాంతం చెప్పుకుని, మన పార్టీలో నే చేర్పించలేని, నా లాంటి చవటను పలికిమాలిన కృతఘ్నులు ను, ఇన్నాళ్లు మోసిన, ఈ దిక్కు మాలిన పార్టీలో, నా బిడ్డ ఉండ కూడదు కదా?

2. నేను మాయ మాటలతో, ఒక పార్టీ ని సగం జనాన్ని మోసం చేస్తున్న, నా వంశాంకురం, ఇంకో పార్టీ ని అలాగే మిగతా జనాన్ని మోసం చేయవద్దా? సగం జనాభా ని, మోసం చేసిన ఘనత, మా వంశానికి ఉండవద్దా?

* పిల్లల ఆలోచన -

1. మా విశ్వాశం లేని తప్పుడు పెద్దలను, ఇన్నాళ్లు ఎదగమని సంపాదించమని, అవకాశం ఇచ్చిన సంస్కారహీన జన క్షేమం పట్టని పార్టీ ని, వెన్నపోటు పొడవాలంటే, ద్రోహం మోసం చేయాలంటే, ఇంకో పార్టీ కండువా వేసుకోవాలి కదా.

2. కృతజ్ఞతలు లేని పెద్దల పెంపకంలో, సంస్కార హీనంగా పెరిగిన నేను, ఇంకో పార్టీ ని జనాన్ని ఇబ్బందులు పెట్టాలంటే, మరలా గోడ దూకాలంటే, ఇదే ఉత్తమం, ఇంకో పార్టీ తో పోవడం.

2) జీవిత భాగస్వాములు -

ఇంట్లోనే భరించలేము, జీవిత భాగస్వామి సంస్కారమును చెడు లక్షణాలను, ధన అధికార కాంక్షను, ఇక అదే పార్టీలో కూడా ఎక్కడ భరిస్తాము, అన్న ఆలోచన కావచ్చు.

రెంటిలో ఉంటే, రెందు చేతులా సంపాదించవచ్చు, ఒకరికి అధికారం పోయినా, ఇంకొకరికి పదవి ఉంటుంది అన్న దురాశ అధికార కాంక్ష కావచ్చు.

ఇక ఒకే కుటుంబ, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ సంగతి అనుకోవడము అనవసరం, ఈ అవకాశ వాద నాయకులు మరియు ప్రజలతో.

సొంత ఇంట్లోనే చెప్పుకోలేని వానిని, మనము ఎలా తీసుకుని భరిస్తున్నాము, అన్న ఆలోచన ఆ పార్టీకి గాని, ఓటు వేసే జనానికి కూడా ఉండదు, ఈ కలియుగములో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,884; 104 తత్వాలు (Tatvaalu) and views 226,208
Dt : 14-Feb-2021, Upd Dt : 14-Feb-2021, Category : Politics
Views : 805 ( + More Social Media views ), Id : 976 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : family , adults , parents , children , spouses , separate , political party
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content