సాక్షి - అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా - కృష్ణ, విజయ నిర్మల, బాపు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,571; 104 తత్వాలు (Tatvaalu) and views 224,973.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఈ రోజుల్లో గుణం చూడకుండా, ఇతర విషయాల కోసం చేసుకున్న భాగస్వామి, తన భాగస్వామి బతుకు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారో లేదో తెలియదు, కానీ నాడు మాత్రం, అసలు పెళ్ళి కాకుండానే, నచ్చిన వాడి ప్రాణాల ని కాపాడటానికి, ఈ పాటలోనే తాళి కట్టించుకుని, నిన్ను నేను కాపాడుకుంటాను, మీ అమ్మ అలాగే మా అమ్మ కడుపు చల్లగా ఉండాలి, బతకరా బతకరా అని కొండంత ధైర్యాన్ని ఇస్తూ సాగే ఈ పాట, మనసున్న హ్రుదయాలను కదిలించి వేస్తుంది.

అందుకే గుణము చూసి భాగస్వామిని ఎన్నుకోవాలి, లేదంటే జీవితము లో ఏదో ఒక సమయములో, పరిస్తితులు తల్లక్రిందులు అయినప్పుడు, దాని ప్రభావం మనల్ని చేరుతుంది.

మొన్నే సోషల్ మీడియాలో, ఒకరు అడుగుతున్నారు, మా పిల్లకు నిశ్చితార్ధం అయ్యింది, ఇప్పుడు అబ్బాయి ఉద్యోగం పోయింది అంటా లేఆఫ్ లో, పెళ్ళి రద్దు చేయాలని మా ఆలోచన అని, దాదాపు 80 శాతం, మీరే కరెక్ట్ అన్నారు. మాట దేముంది అండీ, మనీ నే మనకు జీవం అంటున్నారు.

అలాగే 15 ఏళ్ళుగా, లక్షల ఆదాయముతో, మంచిగా పిల్లలతో ఉన్న దంపతులు, ఇప్పుడు ఉద్యోగం పోయే సరికి, ఆదాయము సౌకర్యాలు తగ్గేసరికి, వాస్తవం బయట పడేసరికి, ఇక భాగస్వామి ప్రేమ ని భరించలేము అంటున్నారు. విదేశాల్లో వద్దు అని ఒకరు, మన రాష్ట్రం లో వద్దు అని ఇంకొకరు వీధిన పడుతున్నారు. ఇలా ఎన్నో, ముందు మురిపెం, తర్వాత సహించం.

పెళ్ళి తర్వాత కూడా, కోర్టులలో క్షణం తీరిక లేకుండా, పెళ్ళిళ్ళతో పోటీ పడుతున్నాయి విడాకులు కూడా. రోగం వచ్చినా, ఆదాయము లేకపోయినా, తలవంచకపోయినా, పని మనిషిలాగా చాకిరి చేయకపోయినా, తానా తందానా అనకపోయినా, భాగస్వామిని వద్దు అనే సంస్క్రుతి ఎప్పుడో మొదలు అయ్యింది.

మరి కలియుగ పాపం పెంచడంలో ప్రతి ఒక్కరు, తమ వంతు చేయి తాము వేస్తున్నారు. మన పాట మనము పాడుకుందామా?

అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా
బతకరా. బతకరా. పచ్చగా.
నీకు నేనుంటా, వెయ్యేళ్ళు, తోడుగా నీడగా ||అమ్మ కడుపు||

నా మెడలో, తాళిబొట్టు, కట్టరా.
నా నుదుట, నిలువు బొట్టు, పెట్టరా.. - మొత్తము 2 సార్లు
నీ పెదవి మీద సిరునవ్వు, చెరగదురా..
నా సిగపూవుల, రేకైనా, వాడదురా వాడదురా.. ||బతకరా ||

సల్లనీ అయిరేణికి మొక్కరా.
సన్నికల్లు, మీద కాలు, తొక్కరా.. - మొత్తము 2 సార్లు
చల్లనేళ, కంటనీరు, వద్దురా..
నా నల్ల పూసలే, నీకు, రక్షరా రక్షరా.. ||బతకరా ||

నా కొంగు, నీ చెంగూ, ముడివే.యరా..
నా చేయీ, నీ చేయీ, కలపరా.. - మొత్తము 2 సార్లు
ఏడడుగులు, నా.తో నడవరా.
ఆ యముడైనా, మనమద్దికి, రాడురా రాడురా.. ||బతకరా ||

Album : Sakshi; Starring: Krishna, Vijaya Nirmala; Music : KV Mahadevan; Lyrics-Arudra ; Singers :Suseela ; Producer:N/A; Director: Bapu;Year: 1967

Sakshi, Amma Kadupu Challaga, Krishna, Vijaya Nirmala, Bapu  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,571; 104 తత్వాలు (Tatvaalu) and views 224,973
Dt : 20-Feb-2023, Upd Dt : 19-Feb-2023, Category : Songs
Views : 430 ( + More Social Media views ), Id : 1709 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sakshi , amma , kadupu , challaga , krishna , vijaya , nirmala , bapu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content