పాటతో పరమార్ధం - రండి కదలి రండి ఊరంతా, కలసి రండి మీరంతా - ఈనాడు - కృష్ణ, రాధిక - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2137 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2172 General Articles and views 2,211,092; 104 తత్వాలు (Tatvaalu) and views 244,633.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Randi Kadali randi - Eenadu - Krishna, Radhika, Rao Gopal Rao, Balu

అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వదలి, రండి, కదలి రండి ఉరంతా, కలసి రండి మీరంతా, మీకు భయము లేదు, దైవ సేవకునిగా మేముంటాము, మీ తోడుగ అండగా చివరదాకా, ఒక వేళ మీ ఇంట్లో వారు పట్టించుకోక పోయినా ముదుసలి తనములో, అంటే. అవి వదలక పోతే, మా దగ్గర నే నెగ్గలేకపోతే సర్దుకోలేకపోతే, ఇక దేవుని దగ్గర, పంచభూతాల దగ్గర మీరు చెల్లలేరు, ఆ కఠిన పరీక్షలు మీరు ఎదుర్కోలేరు ఎన్నో జన్మలు అంటే, వింటారా?

ఓహో, మమ్మల్ని బురదలో నుంచి లాగా లని, మానసిక శుద్ది చేయాలని చూస్తున్నావా, మా అమ్మ అయ్య మాటే వినము, మీ మాట వింటామా, ఆ పన్నీరు వదలి మేము రాము, అని 20 ఏళ్ళుగా ప్రాపంచిక మత్తులో ఓలలాడుతూ ఉన్నారు. కొంత మంది, నేడు ఈ నేలపైనే లేరు. కానీ, మిగతావారు మారతారా? అబ్బే, పంచభూతాల శిక్షలకు రెడీ అంటారు ముందు, అవి మొదలు అయ్యాక పరుగులే పరుగులు.

ఒకటే జాతీ, ఒకటే నీతి, చీలికలెందుకు మనలో అన్నా, అలాగే ఒకటే ధ్యేయం, ఒకటే శపధం, తప్పదు నీతి నియమాలు దైవ ఆధ్యాత్మిక సాధనలో, చెడు పై సమరావనిలో అంటే, ముందు అంతా తల ఊపుతారు, ఆ తర్వాత, అలాగే మరచిపోతారు, మాకెందుకు ఈ తలనొప్పి అని, నీతిగా మాట మీద నిలబడే మానసిక బలం లేక.

నాయకులు, ఇదే బలహీనతను వాడుకుని, కులాలు వర్గాలు గా, ఇంకా దిగజార్చేసారు, ఇక ఎన్నటికీ కలవనివ్వరు, కుల సంఘాలతో పోషిస్తున్నారు తమ అవసరాలకోసం.

అమాయకపు శ్రమికుల శక్తికి, స్వార్ధ అధికారం నాయకుల ధనికుల యుక్తికి, సాగే సంగ్రామం లో, దోపిడి భవనపు, గోడలు కూల్చే, నూతన సమాజ నిర్మాణం. మరి విజయమే నిశ్చయం, మారది నిర్ణయం అంటూ మన పని మనము, శాశ్వత దైవ సేవక పదవిగా కొనసాగిస్తున్నాము. సేవ చేయడానికి భౌతిక పదవులు, బానిసత్వము అవసరము లేదు అని మనము నిరూపించాము 20 ఏళ్ళు పైగా.

ఆకలి పేగుల, మంటలలోనే ఈ దేశం రగిలింది, ఆనాడు. మరలా ఇప్పుడు 3 పంటల పొలాలను, కాంక్రీట్ చేస్తూ, అదే బాటకు వెనక్కు తీసుకుని వెళుతున్నారు. చీకటి బ్రతుకుల, కేకలతోనే ఆకాశం ఆదిరింది ఆనాడు, ఇప్పుడు మరలా అదే ప్రయత్నములో ఉన్నారు.

ఆరని తీరని, పేదల వేదన, తిరుగుబాటుగా రేగింది, దారుణ దానవ, సమ్హారానికి దారిని చూపింది ఆనాడు ఆత్మాభిమానముతో. మరి నేడు అవసర అవకాశవాదముతో, కనీసం ఇంట్లో వారినే పట్టికంచుకునే సమయము ఎవరికీ లేదు, సంపాదన ఆస్తుల కూడపెట్టడములో, చివరకు ఉత్త చేతులతో వెళతాము అని తెలిసినా. అదే మూర్ఖత్వము.

రండి.., కదలి రండి, రండి.. కలసి రండి
కదలి రండి, ఊరంతా, కలసి రండి మీరంతా 2
రామ రాజును నేనుంటా.., 2 మీ తోడుగ చివరంత
రండి.., కదలి రండి, రండి.. కలసి రండి

ఒకటే జాతీ, ఒకటే నీతి 2 చీలికలెందుకు మనలో..
ఒకటే ధ్యేయం, ఒకటే శపధం 2 తప్పదు సమరావనిలో ..
శ్రమికుల శక్తికి, ధనికుల యుక్తికి, సాగే సంగ్రామం
దోపిడి భవనపు, గోడలు కూల్చే, నూతన నిర్మాణం
విజయమే.. నిశ్చయం., మారది.. నిర్ణయం. ||రండి.., కదలి రండి||

ఆకలి పేగుల, మంటలలోనే 2 ఈ దేశం రగిలింది..
చీకటి బ్రతుకుల, కేకలతోనే 2 ఆకాశం అదిరింది
ఆరని తీరని, పేదల వేదన, తిరుగుబాటుగా రేగింది..
దారుణ దానవ, సమ్హారానికి దారిని చూపింది
విజయమే.. నిశ్చయం., మా.రది.. నిర్ణయం. ||రండి.., కదలి రండి||

చిత్రం: ఈనాడు (1982); సంగీతం: జె. వి.రాఘవులు; సాహిత్యం: శ్రీ శ్రీ , కొసరాజు, గోపి; గానం: యస్.పి.బాలు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2172 General Articles and views 2,211,092; 104 తత్వాలు (Tatvaalu) and views 244,633
Dt : 16-Jul-2023, Upd Dt : 16-Jul-2023, Category : Songs
Views : 963 ( + More Social Media views ), Id : 1844 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : randi , kadali , randi , eenadu , krishna , radhika , rao , gopala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content