ఎంగిలి పేట్లు కడిగాం, 3 పిల్లల కు ఆస్తులన్నీ ఇచ్చాం, ఇప్పుడు మాకు బతకడానికి దారి చూపండయ్యా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2111 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2146 General Articles and views 2,141,756; 104 తత్వాలు (Tatvaalu) and views 240,248.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ధన ఆస్తులు సంపాదన కన్నా మన సొంత ఆనందాలకన్నా, పిల్లల సంస్కార పెంపకం ముఖ్యం అంటుంటే, ఈ రోజుల్లో ఎవరికీ వినే తీరిక ఓపిక లేదు. వారు ముదుసలి వారు అయ్యాక, వారి గోడు వినేవారు కూడా లేరు, ఉండరు. ఎందుకంటే, మనము నేర్పిన విద్యనే అది.

గూడూరు నుంచి ఇంకో తల్లి దండ్రుల వార్త, పూర్తి వివరాలు లోపల చూడండి - కాయ కష్టం చేసి సంపాదించి, 3 పిల్లల పెళ్ళిళ్ళు చేసి, అన్ని ఆస్తులు ముందే పిల్లలకు రాశారు. ఇప్పుడు అందరినీ, బాబూ, దయచేసి మా బతుకు కు దోవ చూపించ మంటున్నారు.

ఇంకా ధనం ఇవ్వమని పిల్లలు కొడుతున్నారు, తిడుతున్నారు, పక్షవాతం వచ్చినా జాలి చూపడం లేదు. మమ్మల్ని ఆదరించడం లేదు అని వాపోతున్నారు. 4 ఏళ్ళ క్రితం పోలీసు కేసు కూడా పెట్టారు, కోర్టుకు కూడా పోయి వచ్చారు.

కోర్టు కు వెళ్ళి, తాము పిల్లలకు రాసింది వెనక్కు తీసుకోవచ్చు. మరి ఎందుకు ఆ ప్రయత్నము చేయడం లేదో తెలీదు. మీకు దగ్గరలో ఉంటే, మీరైనా చెప్పగలరు.

లేక ఇంకా తమకే పనికి రాని మూర్ఖపు ప్రేమలో అలా వద్దు, మేమే పతనము అవుదాము అనుకుంటున్నారా తెలియ రాలేదు.

మరి ఇతరులను దారి చూపమనడం ఎందుకు? వారి ఇబ్బందులు వారు పడవచ్చు కదా?

ఆస్తులు పిల్లలకు, కష్టాలు బాధలు ఇతరులకా? ఇతరులు కూడా ధనం ఇచ్చి సహాయం చేస్తే, అదీ తీసుకుని వెళ్ళి పిల్లలకు ఇస్తారా?

కాలు జారనేల బురద కడుగ నేలా అన్న సామెత గుర్తుకు వస్తుంది. 40 ఏళ్ళకు ముందు వచ్చిన, గాలి మేడలు సినిమా చూసినా, అది సినిమానే కదా, మన పక్కింట్లో ముదుసలి వారికి అలాంటివి ఎన్ని జరిగినా, మన ఇంట్లో అలా జరగదు అని మురిసిపోతాము. ఇదీ అరిషడ్వర్గాల బానిసత్వమే.

పాములను, మనము పాలు పోసి, ఇంట్లో గారాబముగా పెంచి, వాటికి ఆస్తులు ఐశ్వర్యము ఇచ్చి బలవంతులను చేసి, ఇప్పుడు మమ్మల్ని కాటు వేస్తున్నాయి కాపాడండి బాబోయ్ అంటే, ఎవరు వింటారు మన గోడు? ఎందుకు సహాయం చేస్తారు? మనము చేసిన/ పెంచిన పాపానికి మనము శిక్ష అనుభవించద్దా?

ఇంటి భస్మాసురులను పెంచుతున్నప్పుడు, పెళ్ళి అయ్యాక, ఆస్తులు పంచేటప్పుడు కూడా, అవి విష నాగులో, వాటి బుద్దులు ఎలా ఉన్నాయో, ఎలా మారతాయో కూడా తెలియడం లేదు అంటే, ఎంత మత్తులో మనము ఉన్నామో, ఎంత మత్తులో పెంచామో, ఎంత సంస్కారం గా పెంచామో కదా? ప్రతి ఇంట్లో ఒక ద్రుతరాష్ట్రుడు గాంధారి ఉన్నట్లే కదా?

దయచేసి మీరూ జాగ్రత్తలు గా ఉండండి. కాల రాసే సొంత వారి కన్నా, దయ జాలి సంస్కారం అభిమానం ఆప్యాయత గల బయట జీవులు మిన్న, అంటారా?

కరిచే చంపే, కపట నటన పాము నక్క పులి తోడేలు కన్నా, విశ్వాసం గల కుక్క అయినా నయమే కదా? కాదు అంటారా, సరే కాలమే, రుజువు చేస్తుంది.

గూడూరు రెండో పట్టణం (తిరుపతి జిల్లా) వార్త - ఎంగిలిపేట్లు కడిగి ఆస్తులు సంపాదించాం. పిల్లలకు ఏ కష్టం తెలియకుండా పెంచి ప్రయోజకుల్ని చేశాం. ఆస్తులన్నీ రాసిచ్చాం. వృద్ధాప్యంలో ఆదుకుంటారనుకుంటే చిత్రహింసలు పెడుతున్నారు. పదమూడేళ్లుగా జీవచ్ఛవాళ్లా జీవిస్తున్నాం. బతకడానికి దారి చూపండయ్యా’ అంటూ వృద్ధ దంపతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

బాధితుల కథనం మేరకు.. జానకిరాంపేట ప్రాంతానికి చెందిన కోనేరు సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు, 3 సంతానం. కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఉన్న నగదుతోపాటు, బంగారం కూడా వారికే ఇచ్చేశారు. ఇంతచేసినా ఇంకా ఇవ్వాలంటూ తరచూ తల్లిదండ్రులను కొట్టడంతోపాటు, హింసించడం మొదలు పెట్టారు. ఈ మేరకు వృద్ధదంపతులు నాలుగేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోతున్న సుబ్బయ్యకు పక్షవాతం వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వస్తే కొడుకులు కొడుతున్నారని వాపోతున్నారు.

Parents washed tiffin plates, gave all property to 3 children, and now show a a way to live - saakshi news - link  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2146 General Articles and views 2,141,756; 104 తత్వాలు (Tatvaalu) and views 240,248
Dt : 25-May-2022, Upd Dt : 25-May-2022, Category : General
Views : 601 ( + More Social Media views ), Id : 1404 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : parents , tiffin , plates , assets , property , children , begging , live
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content