పాటతో పరమార్ధం- మిన్నేటి సూరీడు (భక్తి పేరడీ) - సీతాకోక చిలక - కార్తీక్, అరుణ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,885,513; 104 తత్వాలు (Tatvaalu) and views 226,544.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Minneti Sooredu (Bhakti Parody) - Seethakoka Chilaka - Karthik, Aruna

మనకు జ్ఞానము రావడానికి ఓ కారణము/ సందర్భము ఉండాలా, పోనీ అది ఆ సూర్యనారాయణ వెలుగు లతో వచ్చింది/ వస్తుంది అని అనుకుందాము. కిరణాలు పడగానే పూలు ఎక్కడ ఉన్నా, అది కోనేరు అయినా, మా మీ ఊరు అయినా, ప్రాణ శక్తి తో విచ్చుకుంటాయి.

మరి మనము మానసిక శుద్ది చేసుకోవడానికి, ఆ అందమైన పూల మార్పు, ఎండ జల్లు తాకగానే ఏ విధముగా మారుతుందో, ప్రతి రోజూ మన మనసు కూడా అంత కంతకు శుద్ది అయి, మానసిక బలం పుంజుకోవాలి అంటే మానసిక నియంత్రణ పెరగాలని ఆశిద్దాం.

ఓ.. చుక్కా నవ్వవే మన బద్దకానికి నిర్లక్ష్యానికి, ఆ ప్రాపంచిక బ్రమల కంటి కోలాటాల మాయలో పడి, మంట మూర్ఖత్వాల తో పతనమయ్యే, రజో తమో గుణ దాసులను, మంచి ఆచరణల ఆలోచనతో మార్చవే.

కోరికల పరుగు ఆరాటాల తో, మనసు పోరాటాలతో మనశ్శాంతి లేకుండా పోతున్నారు ఇంటిల్లిపాదీ. ఆ మోహం తుంచకుంటే, తర్వాత అందరమూ ఆగమవ్వాలా? అలాగని ఆ మోహం దాచుకుంటే, పతనమవ్వాలా నేడో రేపో? కాబట్టి మన కోతి మనసు అదుపుచేయడాని, నచ్చచెప్పడానికి, ఇన్ని సాధనలు ఉన్నాయి మిత్రమా. ప్రపంచాన్ని జయించిన వారు కూడా, తమను తాము జయించలేరు, చరిత్ర చెప్పిన సత్యం సాక్ష్యంతో.

ఓ మనసనే రామచిలకా, మనము బాగుపడటానికి అవకాశం చక్కని ధ్యాన మొలక. పరుగులు తీసే కోతి మనసు ఏమందమ్మ, అందులో అర్ధం కాని లోతు ఏముందమ్మ? అందరికీ ఈడుకున్న గోడు మీరే, ఓ మోహాలా ఓ బ్రమలా. మీ తోడువద్దు పోవే, లేకపోతే మన కంటి నిండా నీరింకా, అని మనం స్తిరముగా స్తితప్రజ్ఞత తో ఉండగలిగితే, మానసిక ధ్యానం నుంచి ఆత్మను/ మనసును/ హ్రుదయాన్ని, ఎవరూ ఎన్ని కష్టాలు కూడా తుంచలేరులే ఇంకా.

Parody

మిన్నేటి సూరీడు వచ్చెన మా పల్లె
కోనేటి తామర్లు విచ్చెనమ్మ 2
అందమైన రంగవల్లులై, ఎండలాన్ని పూలజల్లులై
శుద్దికే పొద్దు పొడిచి ||మిన్నేటి ||

ఓ.. చుక్కా నవ్వవే, వేగుల చుక్కా నవ్వవే
కంటి కోలాటాల, మంట మూర్ఖత్వాల
ఓ.. చుక్కా నవ్వవే, నావకు చుక్కానవ్వవే
పరుగు ఆరాటాల, మనసు పోరాటాల
మోహం తుంచకుంటే, ఆగమవ్వాలా ..
మోహం దాచుకుంటే, పతనమవ్వాలా..
మనసు అదుపుచేయడాని కిన్ని సాధనలు.. ||మిన్నేటి ||

ఓ రామచిలకా, చక్కని ధ్యాన మొలక
మనసు ఏమందమ్మ, లోతు ఏముందమ్మ
ఈడుకున్న గోడు మీరే, మోహాలా..
తోడువద్దుపోవే కంటి, నీరింకా..
ధ్యానం నుంచి ఆత్మను, తుంచలేరులే ఇంకా

మిన్నేటి సూరీడు లాలాలాల
మిన్నేటి సూరీడు లాలాలాల లాలాలాల ||మిన్నేటి ||

Original

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ 2
అందమైన రంగవల్లులై
ఎండలాన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దు పొడిచి ||మిన్నేటి ||

ఓ చుక్కా నవ్వవే, వేగుల చుక్కా నవ్వవే
కంటి కోలాటాల, జంట పేరంటాల
ఓ చుక్కా నవ్వవే నావకు చుక్కానవ్వవే
పొందు ఆరాటాల, పొంగు పోరాటాల
మొగ్గ తుంచుకుంటే, మొగమాటాలా
బుగ్గ దాచుకుంటే, బులపాటల్లా
దప్పికంటే తీర్చటానికిన్ని తంటాలా ||మిన్నేటి ||

ఓ రామచిలకా చిక్కని ప్రేమ మొలక
గూడు ఏమందమ్మ, ఈడు ఏమందమ్మ
ఈడుకున్న గోడు నువ్వే, గోరింకా
తోడుగుండిపోవే కంటి, నీరింకా
పువ్వునుంచి నవ్వును, తుంచలేరులే ఇంకా

మిన్నేటి సూరీడు లాలాలాల
మిన్నేటి సూరీడు లాలాలాల లాలాలాల ||మిన్నేటి ||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,885,513; 104 తత్వాలు (Tatvaalu) and views 226,544
Dt : 06-Feb-2024, Upd Dt : 06-Feb-2024, Category : Songs
Views : 123 ( + More Social Media views ), Id : 2006 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Minneti , Sooredu , Bhakti , Parody , Seethakoka , Chilaka , Karthik , Aruna , Sitakoka Chiluka
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content