నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ చావాలిరా - మాయదారి మల్లిగాడు - కృష్ణ, మంజుల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,874,964; 104 తత్వాలు (Tatvaalu) and views 225,723.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

అన్నా మంచిగుండవే, మంచి పనులు మాత్రమే చేయవే అంటే, అబ్బ ముందు నువ్వు చేసి చూపించు అంటారు. ఒకవేళ ఇతరులు, మనసు త్యాగం గుణము తో మంచి పని చేసి చూపిస్తే, అబ్బో వీరు ఒక్కరే మంచివారు, ఏమి పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు (5 ఏళ్ళు పైగా పేరు మరియు ఫోటో లేకుండా ఏమిటో, ఆఖరికి పబ్లిసిటీ ఎలా చెయ్యాలో కూడా తెలీదు, కానీ ఏదో ఒకటి అనాలి, హా హా), మనమంతా చెడ్డావాళ్ళం అంటూ, మన దొంగ బుద్ది చూపిస్తాము.

అంటే, ప్రతి దాని మీదా, ఇతరుల మీద, ఆఖరికి చిన్న విషయాలకు కూడా, ఏడ్వటానికే మన జీవితం సగం వ్రుధాగా పోతుంది. మనం మంచి చేయం, ఇంకొకరు చేస్తే సహించం. చెడ్డపనులు చెయ్యకుండా ఉండలేము, మనసు అదుపు ఉండదు. ఇతరులు ఉండగలిగితే, ఎగతాళి చేస్తాము. మరి మనసు నిండుగా నవ్వేది ఎప్పుడూ?

మనము వంద అప్పులు, వంద తప్పులు చేస్తుంటే, నవ్వు వస్తుందా? ఎటూ రాదు. వచ్చినా అది నటన నవ్వే గాని, మనసు నవ్వు కాదు? మన పిల్లలు అవే నేర్చుకుని, మనకు మనశ్శాంతి అసలు ఉండదు. అందుకే అంటారు, నవ్వటం ఒక యోగం భోగం ఆరోగ్యం, అలాగే ఏడ్వటం ఒక రోగం అని.

రోడ్ ప్రమాదాలు లేదా ఇంకా ఎన్నో వింటున్నాము, ఎంతో మంది అర్ధాంతరముగా మనల్ని వీడి వెళ్ళిపోతున్నారు. కాబట్టి, ఉన్న 4 రోజులు నవ్వుతూ అందరిని పలకరిద్దాము. మన ఇంట్లో వారిని సంతోష పెడదాము. అలా చెయ్యాలి అంటే, మన మనస్సు నిర్మలముగా ఉండాలి, అంటే అరిషడ్వర్గాలకు అష్ట వ్యసనాలకు బానిసలం కాకుండా ఉండాలి. మరి ఇప్పుడు నుంచే ప్రయత్నం చేద్దాము కదూ?

పల్లవి :
నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా.. ఆయ్ 2
చచ్చినాక నవ్వలేవురా.., ఎందరేడ్చినా బతికిరావురా, తిరిగిరావురా..
అందుకే, నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా..

చరణం 1 :
సంపేది ఎవడురా.., సచ్చేది ఎవడురా.. ఆయ్ 2
శివుడాజ్ఞ లేకుండా, చీమైనా కుట్టదురా 2
కుడితే సావా.లని, వరమడిగిన చీమ..
కుట్టీ కుట్టక ముందె, సస్తోంది సూడరా..ఆ ఆ ఆ
అందుకే, నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా..

చరణం 2 :
బతికుండగా నిన్ను, ఏడిపించినోళ్లు
నువ్వు సస్తె ఏడుత్తారు, దొంగమాయోళ్లు... దొంగమాయోళ్లు
అది నువ్వు సూసేదికాదు, నిను కాసేదికాదు 2
నువ్వు పోయినా ...ఆ ఆ , నువ్వు పోయినా.., నీ మంచి సచ్చిపోదురా..
ఒరె సన్నాసీ నవ్వరా..
అందుకే, నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా..

చరణం 3 :
వున్నాడురా.. దేవుడు, వాడు ఒస్తాడురా.. తమ్ముడు..ఎప్పుడు?
అన్నాయం జరిగినపుడు - అక్కరమం పెరిగినపుడు 2
వస్తాడురా..ఆ ఆ, సచ్చినట్టు వస్తాడురా.., అందుకే

నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా..
చచ్చినాక నవ్వలేవురా..
ఎందరేడ్చినా బతికిరావురా.. తిరిగిరావురా..
అందుకే, నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా..

చిత్రం: మాయదారి మల్లిగాడు (1973), సంగీతం: కె.వి. మహదేవన్, రచన: ఆత్రేయ, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

Mayadari Malligadu Songs - Navvuthu Bathakaalira - Krishna - Manjula కృష్ణ - మంజుల

Mayadari Malligadu-Navvutu Batakalira navvutu chavalira

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,874,964; 104 తత్వాలు (Tatvaalu) and views 225,723
Dt : 28-Sep-2022, Upd Dt : 28-Sep-2022, Category : Songs
Views : 736 ( + More Social Media views ), Id : 1540 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mayadari , malligadu , navvutu , batakalira , chavalira , krishna , manjula
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content