కృష్ణా, అందరినీ అన్నీ పోగొట్టుకున్న మమ్మల్ని ఓదార్చడం కోసం వచ్చావా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,258; 104 తత్వాలు (Tatvaalu) and views 224,950.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మహా భారత యుద్ధం ముగిసింది, కౌరవ సైన్యం కుప్పకూలింది, కౌరవ వంశము సర్వ నాశనము అయినది. కృష్ణయ్య, ధర్మరాజు తో కలసి బంధువులు అయిన ధృతరాష్ట్రుడు, గాంధారిని ఓదార్చడానికి పలకరించడానికి వెళ్ళారు.

కృష్ణుని చూడగానే, గాంధారికి ఎక్కడ లేని కోపం ఉద్రేకము వచ్చినది. కృష్ణా, అందరినీ అన్నీ పోగొట్టుకున్న మమ్మల్ని చూసి, ఓదార్చడం కోసం వచ్చావా? నీ కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయా? నీ కోరిక నెరవేరింది కదా? అంతా అయిపోయింది అని, బాధపడుతూ తన అక్కసు వెళ్ళగక్కింది.

అత్తా, నా మీద ఎందుకు అనవసర కోపం. నేను మొదటి నుంచి యుద్ధం వద్దు, సఖ్యతగా ఉండాలి అని చెప్పాను. మంచిని నిలిపాలని వంశాలను నిలపాలని, రాయబారి గా వచ్చిన నన్నే బంధించే ప్రయత్నం చేశారు, మీ బిడ్డలు అవివేకముతో.

దీనంతటికీ కారణం, మీరిద్దరూ మాత్రమే మీ పెంపకమే, నేనూ లేదా పాండవులు కాదు. మీ చర్యల ఫలితమే, ఇప్పటి మీ దుస్థితి.

గాంధారి ఆశ్చర్యం గా, నేనా? కన్నతల్లి ఎక్కడ అయినా, సొంత బిడ్డలు ను చంపుకుంటుందా కృష్ణా? అలా అనకు, నా మీద నిందలు వేయకు అంది. లేదు అత్తా , పుత్ర వ్యామోహం లో పడి, గతం అంతా మరచావు, వివరముగా చెపుతా విను.

చిన్నప్పటి నుంచి వారిని, ఏ విధంగా పెంచారో గుర్తు తెచ్చుకో. అందరి నీ దాసీల చేత పెంచావు, నువ్వు తల్లి ప్రేమ, ఒడిలో చూపించకుండా. భర్త అంధుడు అయితే, కనీసం బిడ్డల ఆలనా పాలనా మంచి చెడు చూడకుండా, నువ్వు కూడా కళ్ళకు గంతలు కట్టుకుని, పిల్లల అహంకార ప్రవర్తన ను, ఖడించి సరిచేయలేక పోయావు. కళ్ళకు గంతలతో మంచి భార్యవు అయ్యావు కానీ, మంచి తల్లివి కాలేక పోయావు.

బిడ్డలు ఎన్ని తప్పులు చేస్తున్నా, వాటిని వ్యామోహం తో, సమర్ధించారు మీ ఇద్దరూ నిర్లజ్జగా. ఉత్తములైన పంచ పాండవుల ను, ఏ రోజైనా సోదరులు గా చూసారా? భీమునికి విషం పెట్టినప్పుడు కానీ, లక్క ఇల్లు కాల్చినప్పుడు గానీ, సూది మోపి నంత భూమి ఇవ్వను అన్నప్పుడు గానీ, మీరు నోరు మెదపలేదు, ఇది తప్పు అని ఘోషించ లేదు.

కౌరవులు తాము చేస్తున్నది అంతా మంచే అనుకొని, ధన అహంకారం తో, అధికార ఆధిపత్యం తో, అడ్డు ఆపు లేకుండా విర్ర వీగారు. చివరకు వంశ నాశనం కొని, తెచ్చుకోవడం జరిగింది.

ఇదంతా కేవలం, మీ బాధ్యత లేని పెంపకం వలన మాత్రమే. నేను మరియు ధర్మరాజు నిమిత్త మాత్రులమే. చెవిలో జోరీగ లాగా, చెడు వద్దు వద్దు అని ఎన్నోసార్లు చెప్పాము.

విదురుడు, భీష్ముడు కూడా చెప్పారు. కానీ మీరు ఎవరినీ, ధన అధికార వ్యామోహం లో, లెక్క చేయలేదు, ఫలితం అనుభవించారు.

ఇందులో నీతి, మన చుట్టూ పక్కల, ఇలాంటి గాంధార ధృతరాష్ట్రులు ఎందరో ఉన్నారు, తమ మరియు తమ బిడ్డలు జీవితాలను తమ చేతులతో తామే నాశనం చేస్తున్నారు. ముందు చెడు గెలిచినా, చివరకు ఓడక తప్పదు. పిల్లలకు నేర్పాలసింది సంస్కారము.

కృష్ణా, పరంధామా , ముందే మాకు కనువిప్పు కలిగించు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,258; 104 తత్వాలు (Tatvaalu) and views 224,950
Dt : 25-Feb-2020, Upd Dt : 25-Feb-2020, Category : General
Views : 1011 ( + More Social Media views ), Id : 362 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : krishna , gandhari , drutarashTra , kourava , pandava
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content