Krishna Ashtakam - Shankaracharya – కృష్ణ అష్టకం - ఆదిశంకరాచార్య कृष्ण अष्टकम - शंकराचार्य - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,296; 104 తత్వాలు (Tatvaalu) and views 225,141.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*Krishna Ashtakam - Adi Shankaracharya Kritam – కృష్ణ అష్టకం - ఆదిశంకరాచార్య కృతం कृष्ण अष्टकम - आदि शंकराचार्य कृतम*

Yesterday we saw the songs for the uneducated. People like Bhakta Kannappa are sincere, they will put out their eye for good, even if they don't get any poems/ slokas, still they are great devotees.

చదువు లేని వారికోసం పాటలు నిన్న చూసాము. భక్త కన్నప్ప లాంటి వారికి చిత్తశుద్ది ఉంటుంది, మంచికోసం, తమ కన్ను అయినా తీసి ఇస్తారు, వారికి ఏమీ పద్యాలు/ శ్లోకాలు రాకపోయినా, వారు గొప్ప భక్తులే.

But we who are educated, who are not sincere, do not even hesitate to do evil to others, with hypocritical acting 2 words of life.

కాని చదువుకున్న మనం, చిత్తశుద్ది లేని మనం, కపట నటన 2 నాల్కల బతుకు తో, ఇతరులకు చెడు చేయటం కోసం కూడా వెనుకాడము.

That's why every one who has studied 10th class should say that they have mental and tongue control power i.e. read Vedas, Shlokas and Mantras with precision. The words in it ignite the soul power in us.

అందుకే 10 వ తరగతి చదివిన ప్రతి ఒక్కరు, తమకు మానసిక మరియు నాలుక నియంత్రణ శక్తి ఉంది అని చెప్పాలి అంటే, ఖచ్చితముగా వేదాలు, శ్లోకాలు, మంత్రాలు చదవాలి. అందులోని బీజాక్షరాలు, మనలోని ఆత్మ శక్తిని రగిలిస్తాయి.

And we too, together with our children, let's try to see if our tongue words will listen to us?

మరి మనము కూడా, మన పిల్లలతో కూడి, మన నాలుక పదాలు, మన మాట వింటాయో లేదో ప్రయత్నం చేద్దామా?

శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచరగురుర్వేదవిషయో
ధియాం సాక్షీ శుద్ధో హరిరసురహంతాబ్జనయనః |
గదీ శంఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || 1 ||

śriyāśliṣṭō viṣṇuḥ sthiracaragururvēdaviṣayō
dhiyāṁ sākṣī śuddhō harirasurahantābjanayanaḥ |
gadī śaṅkhī cakrī vimalavanamālī sthiraruciḥ
śaraṇyō lōkēśō mama bhavatu kr̥ṣṇō:’kṣiviṣayaḥ || 1 ||

श्रियाश्लिष्टो विष्णुः स्थिरचरगुरुर्वेदविषयो
धियां साक्षी शुद्धो हरिरसुरहन्ताब्जनयनः ।
गदी शङ्खी चक्री विमलवनमाली स्थिररुचिः
शरण्यो लोकेशो मम भवतु कृष्णोऽक्षिविषयः ॥ १ ॥

యతః సర్వం జాతం వియదనిలముఖ్యం జగదిదమ్
స్థితౌ నిశ్శేషం యోఽవతి నిజసుఖాంశేన మధుహా |
లయే సర్వం స్వస్మిన్హరతి కలయా యస్తు స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || 2 ||

అసూనాయమ్యాదౌ యమనియమముఖ్యైః సుకరణై-
ర్నిరుద్ధ్యేదం చిత్తం హృది విలయమానీయ సకలమ్ |
యమీడ్యం పశ్యంతి ప్రవరమతయో మాయినమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || 3 ||

పృథివ్యాం తిష్ఠన్యో యమయతి మహీం వేద న ధరా
యమిత్యాదౌ వేదో వదతి జగతామీశమమలమ్ |
నియంతారం ధ్యేయం మునిసురనృణాం మోక్షదమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || 4 ||

మహేంద్రాదిర్దేవో జయతి దితిజాన్యస్య బలతో
న కస్య స్వాతంత్ర్యం క్వచిదపి కృతౌ యత్కృతిమృతే |
కవిత్వాదేర్గర్వం పరిహరతి యోఽసౌ విజయినః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || 5 ||

వినా యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖామ్
వినా యస్య జ్ఞానం జనిమృతిభయం యాతి జనతా |
వినా యస్య స్మృత్యా కృమిశతజనిం యాతి స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || 6 ||

నరాతంకోత్తంకః శరణశరణో భ్రాంతిహరణో
ఘనశ్యామో వామో వ్రజశిశువయస్యోఽర్జునసఖః |
స్వయంభూర్భూతానాం జనక ఉచితాచారసుఖదః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || 7 ||

యథా ధర్మగ్లానిర్భవతి జగతాం క్షోభకరణీ
తదా లోకస్వామీ ప్రకటితవపుః సేతుధృగజః |
సతాం ధాతా స్వచ్ఛో నిగమగుణగీతో వ్రజపతిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || 8 ||

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

krishna ashtakam adi shankaracharya kritam sriyaslisto vishnuhu  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,296; 104 తత్వాలు (Tatvaalu) and views 225,141
Dt : 23-Oct-2022, Upd Dt : 23-Oct-2022, Category : Songs
Views : 480 ( + More Social Media views ), Id : 1592 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : krishna , ashtakam , adi , shankaracharya , kritam , sriyaslisto , vishnuhu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content