APLatestNews.com top Banner

Social Media links
జగనన్న, కేసీయార్ హయ్ హయ్, హైదరాబాద్ ఆస్తులు ఒక్క సంతకముతో, బస్సుల మైళ్ళ లొల్లి? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఏవండి ఒక పౌరుని ప్రశ్న, మాకూ పూర్తి జవాబు తెలీదు, తెలియనివి పెద్దలకే వదిలేయాలి, అనుభవజ్ఞులైన వైకాపా నాయకులు ఎవరైనా జవాబు చెప్పవచ్చును. మీ పేరు బయటకు చెప్పము.

చంద్రన్న ఉన్నంతకాలము, అన్ని బస్సులు తిప్పాము ఆదాయముతో, తెలంగాణా కు. కేసీయార్ కి చంద్రన్న కి పడకపోయినా ఉప్పు నిప్పు గా ఉన్నా కూడా, మొత్తము బస్సులు తిప్పాము. అటు ఇటు ఆర్టీసీ అధికారులు, కిక్కురుమన లేదు అప్పుడు.

కేసీయార్ మాట మీద ఉండరని గతము గుర్తు ఉండదని, గద్దెపై దళితుని కూర్చోబెట్టి, కాపలా గా ఉంటానని చెప్పి, తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్స్ కే వెన్నుపోటు పొడిచి బొంద పెట్టారు అని అందరికీ తెలుసు.

జగనన్న, కేసీయార్ ను కలసి, హయ్ హయ్ భాయ్ భాయ్ అనుకుంటూ తిరిగి, హైదరాబాద్ లో ఆంధ్రా బిల్దింగ్ ఆస్తులు అన్ని, ఒక్క సంతకముతో, అత్త గారి సొమ్ము, రాసి ఇచ్చినట్లు అలా ఉచితముగా ఇచ్చేసారు.

చేతికి వెన్నెముక లేనట్లుగా, బేర సారాలు చేయకుండా, మన ఆంధ్రా ఆస్తులకు బదులు, మీరు ఏమి ఇస్తారు అని అడగకుండా నే, పొగడ్తలకు పొంగి లొంగి అనుకున్నారు అప్పుడు.

మరి అంత స్నేహ బంధము ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో, మరి ఈ బస్సుల సంఖ మైళ్ళ దూరము లొల్లి, ఇప్పుడే ఎందుకు వచ్చింది?

ఆ సరే వచ్చింది అనుకో? ఆ మన కేసీయార్ అన్నే కదా, తిప్పుకోండి అన్ని బస్సులు, నేను మాట్లాడతాను అని, ఎందుకు జగనన్న ముందుకు రాలేదు? పోనీ కేసీయార్ ఎందుకు, ఆ మాట భరోసా అనలేదు?

హైదరాబాద్ ఆంధ్రా ఆస్తులు అన్ని, అలా ఊరికే ఇచ్చారు అన్న గౌరవముతో, బస్సుల దగ్గర లేదా నీటి ప్రాజెక్ట్ ల దగ్గర, కేసియార్ అదే స్నేహముతో ఎందుకు లేరు?

అంటే చంద్రన్న అంత అనుభవము లేక, జగన్ తొందరపడి ఆస్తులు రాసారా? ఇప్పుడు నాలుక కరచుకున్నారా?

4 ఏళ్ళు పూర్తిగా ఆదాయముతో బస్సులు తిప్పిన చంద్రన్న, మనకన్నా అనుభవజ్ఞులు తెలివైన వారు అని మనము ఒప్పుకుందామా?

ఇప్పుడు బస్సులు తగ్గిచ్చుకుని తుప్పు పట్టించి, ఆదాయము పోగొట్టుకుని, మన మిగిలిన సిబ్బందికి జీతాలు? హతవిధీ.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 855 General Articles, 46 Tatvaalu
Dt : 09-Nov-2020, Upd Dt : 09-Nov-2020, Category : Politics
Views : 80 ( + More Social Media views ), Id : 802 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , kcr , friendship , hyderabad , andhra , assets , single signature , bus miles , water project , fight
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content