గాలిమేడలు - కాలమంత మనది కాదు, మమతలు లేని, మనుజులలోన - పేరెంట్స్ తప్పుడు పెంపకం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2111 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2146 General Articles and views 2,141,769; 104 తత్వాలు (Tatvaalu) and views 240,249.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

అందరూ తప్పక చూసి, తమను తాము మార్చుకోవాల్సిన, ఉత్తమ సినిమా. ఇలాంటి మనుషులు మన చూట్టూ, రోజూ కనపడతారు.

పిల్లలు చెడిపోవడానికి పెద్దలే మొదటి కారణము అని నిరుపించేది ఈ సినిమా. చెడపకురా చెడేవు అంటే, స్నేహితుల మధ్యలో అనుకుంటాము. కాదు తల్లి దండ్రుల మరియు పిల్లల మధ్యలో కూడా, అని నిరూపించిన చిత్రం. మన ఇన్నాళ్ళ పాపం పుణ్యం, ఎలా మన వద్దకు వెంటపడి వస్తాయో జీవిత చివరి దశలో, స్పష్టము గా చూపారు.

అంతెందుకు, కౌరవులు చెడిపోవడానికి, ప్రధాన కారణం, తండ్రి ద్రుతరాష్ట్రుడు అలాగే తల్లి గాంధారి. వారి గారాభము లో, అంతు లేని సంపదలో అహంకారములో అధికారములో, మంచి చెడు ఉచ్చం నీచం మరచిపోయారు కదా.

పిల్లలు ఎన్ని తప్పులను చేసినా ఆఖరికి భీముడిని చంపబోయినా, వెనకేసుకు వచ్చారు కదా? మరి మేనమామ శకుని కూడా. మా పిల్లలు పసి వారు, ఏమీ తెలీదు, ఎదుట వారిదే తప్పు అన్నారు, చివరికి వంశ నిర్మూలన గావించారు, దిక్కు లేని వారయ్యారు. ప్రపంచములో జరగబోయేవన్ని, భారతములో ఎప్పుడో చెప్పేసారు.

ఇలాంటి మంచి సినిమాలు ఇప్పుడు రావు. జీవిత సత్యాలు చెప్పే వారు ఎవరూ లేరు. వినే పిల్లలు అసలే లేరు. ఎవరి భ్రమలలో వారు బతుకుతున్నారు, అవసరానికి కలవడం, అనవసరం అనుకుంటే విడిపోవడం, ఇదే తేలిక పద్దతి ఇతరులను భరించడం కష్టం అని తమ బలహీనతను చాటుతున్నారు.

మరి ఇలాంటి వారు, తమ ముదుసలి తల్లి దండ్రులను చూస్తారా? చూడండి పాత్రల స్వభావం, హేమా హేమీలు నటించారు.

ఎస్వీ రంగారావు నీతి నియమం లేని తండ్రి పాత్ర, సినిమా మొత్తానికి ప్రధాన పాత్ర - జీవితము మొత్తము అబద్దాలే, ఏ ఎండ కా గొడుగు, కేవలం అవసరం అవకాశం అంతే, ఇంకో మాట నచ్చదు.

స్నేహితుడు (నాగయ్య) తనకు రోగం వచ్చింది ఆసుపత్రి కి వెళుతూ బతికి వస్తానో లేదో అని భయపడి, రంగారావు ని నమ్మి, తన బిడ్డను (ఎంటీయార్), 10 వేలు రొక్కాన్ని ఇస్తే పిల్లాడి సమ్రక్షణకు (ఆ రోజుల్లో లక్షకు పైన సమానం, ఎకరాలు భూములు వస్తాయి), రంగూన్ వెళుతున్నా అని, ఆ ఊళ్ళో ఆ బిడ్డతో సహా మాయమయి, ఇంకో ఊళ్ళో ఆ డబ్బుతో వ్యాపారం కోసం వెళతాడు.

అసలు తండ్రికి, బిడ్డను కావాలనే దూరం చేస్తాడు, తనకు బిడ్డలు లేరన్న స్తితిలో. ఇతరుల బాధలు సమస్యలు అసలు పట్టవు. తన సంపాదన లెక్కలు ఒక్కటే ముఖ్యం, తనకు అవసరమైతే, ప్రేమతో పలకరిస్తాడు పని అయ్యినదాకా. ఆ తర్వాత మరలా నటనే అబద్దాలే. 2 నాల్కల మాటల కపట నటన మనిషికి ఉదాహరణ ఇతను.

కొత్త ఊళ్ళో, భూములు కొనిపించి నిలబెట్టిన, ఇంకో స్నేహితుని కూడా మోసం చేస్తాడు, అతని పొలం కూడా జమిందారు నుంచి కౌలుకు తీసుకుంటాడు.

తన సొంత కొడుకు పుడితే, తన స్నేహితుని బిడ్డను పాలేరు ని చేసి, తన కొడుకుని (జగ్గయ్య) ను చదివిస్తాడు, జులాయిగా నీతి నియమాలు లేకుండా పెంచుతాడు. విచ్చల విడిగా ధనము ఇచ్చి, చేతులారా కొడుకు ను పాడు చేస్తాడు, బాధ్యత లేని మనిషిలా తయారు చేస్తాడు.

ఆ కొడుకు కూడా తండ్రిబాటలో, అబద్దాలు ఆర్భాటాలు మోసాలతో బతుకుతూ, జమిందారు కూతురునే అబద్దాలు తో పెళ్ళి చేసుకుంటాడు. అసలు విషయము తెలుసుకుని, జమిందారు రంగారావు ని ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మంటాడు.

అల్లుడిని కూడా ముందు వెళ్ళమని, తర్వాత తగ్గి, నీ తండ్రినే బయటకు నెట్టు అంటాడు. జగ్గయ్య, తండ్రిని వెళ్ళి బయట ఎలాగోల, బతకమని అవమానించి పంపుతాడు.

అంతే కాదు, కాళ్ళు విరిగి చెప్పులు కుట్టుకుంటున్న తండ్రిని, 80 కిలోమీటర్లు దూరపు ఊరు తీసుకుని వెళ్ళి మాయమాటలతో, చేతి కర్రలు కూడా కారులోనే ఉంచి, తండ్రిని నడిరోడ్డు పై వదలి వెనక్కి వస్తాడు. తన తర్వాత నటనకు తండ్రి అడ్డు రాకూడదని.

ఇలాంటి ఎన్నో హ్రుదయాన్ని కదిలించే, సంఘటనలు ఉంటాయి.

చిన్న బిడ్డను పోగొట్టుకున్న నాగయ్య, తర్వాత ఆరోగ్యం బాగుపడి తన పిల్లాడిని స్నేహితుడిని వెతుకుతూ ఉంటాడు. తర్వాత ఎక్కడో తారసపడిన, ఎదిగిన యువకుడు ఎంటీయారు ని పరాయి బిడ్డగా భావించి, తన ఇంటికి తెచ్చి తోడుగా ఉంచుకుంటాడు. మంచివాడు అయితే చాలు, పరాయి బిడ్డ కూడా తన బిడ్డనే అని, తనని చేరదీస్తే, తనకు పుణ్యం పురుషార్ధం అని నమ్ముతాడు.

మరలా జగ్గయ్య, నాగయ్య ఆస్తి కోసం, కొత్త నాటకు మొదలు పెడతాడు కదా, తండ్రిని దూరము గా విడిచి వచ్చి, అదీ చూడండి.

తర్వాత ఏమి జరిగింది అన్నది మీరే సినిమా చూసి, లింక్ లోపల ఉంది, నేర్చుకోవల్సినది ఎంతో ఉన్నది. దాదాపు గా 80 శాతం ఇళ్ళ లో ఇలాంటి తల్లి దండ్రులే ఉన్నారు. ఇక రాజకీయాలు లో, ఐశ్వర్యము లో, అధికారం లో, సినిమాల లో పూర్తిగా బ్రమలలోనే ఉంటారు.

1)
గాలిమే.డ కూలిపోయేరా... ఎండమా.వులా.యెనురా... . . .
నీవు చే.సిన, పా.ప పుణ్యమే, లోకము లో, మిగులును రా ... ...

కాలమంత, మనది కాదు, ఎదురు తిరుగును రా. 2
నిన్ను, కన్న కొడుకే(బిడ్డలే), శత్రువగు(ను)చు, గెంటి వేయును రా..

అంతులేని ఆశల వలన, హానియే కలుగును రా
చెడపకురా నువు చెడదవనే, ఆ సామెత నీదేరా - 2 లైన్లు కూడా
మోసములో..నా, ఇల గ్రాసము దుమ్మేరా
ఇంతే నిజము, వినరా.. || కాలమంత||

పరులమేలు జూడగ నీవు, బా.గు పడెదవు రా
ఒరుల కష్టములు నీవని ఎంచిన, సౌఖ్యము కలుగునురా 2
వేదన ఎందుకు రా, వెత తీరును నేడేరా
ఇంతే నిజము, వినరా.. || కాలమంత||

2) మమతలు లే.ని, మనుజులలో.న, ఎవరికి ఎవరో తండ్రి, తనయుడు ఎవరో 2
ఎవరికి ఎవరో

ఏ కులమై.నా, నెలవెది ఐ.నా, మదిలో కూ.రిమి జా.లుకొనా 2
పిలిచి లా.లించి, కొడుకు చందా.న 2 చూచి కాచే దాచే నాయన కాదా..
మమతలు లే.ని, మనుజులలో.న, ఎవరికి ఎవరో తండ్రి, తనయుడు ఎవరో
ఎవరికి ఎవరో

మాటలు నమ్మి, మనసు నీరై, దరికీ తీసిన తండ్రులనూ 2
దేవుని చందాన, తలచీ పూజించీ 2 కోలువూ చేసేవాడే కొడుకవు కాదా..
మమతలు లేని, మనుజులలోన, ఎవరికి ఎవరో తండ్రి, తనయుడు ఎవరో
ఎవరికి ఎవరో
ఆఁ ఆఁ అఅఆఁ ఆఁ ఆఁ అఅఆఁ
ఊఁఊఁఉఉఊఁ ఊఁఊఁఉఉఊఁ


Gaali Medalu Songs - Kaalamantha Mandhikadu - NTR, Devika, SVR, Jaggayya

Gaali Medalu Kaalamantha Mandhikadu mamatalu leani manujulu parents bad guidance  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2146 General Articles and views 2,141,769; 104 తత్వాలు (Tatvaalu) and views 240,249
Dt : 25-May-2022, Upd Dt : 25-May-2022, Category : Songs
Views : 984 ( + More Social Media views ), Id : 1403 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : gaali , medalu , kalamanta , manadikadu , mamatalu , manujulu , parents , bad , guidance , pempakam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content