APLatestNews.com top Banner

Social Media links
చంద్రన్న, కష్టజీవి, ముందు చూపు, అడ్మినిస్ట్రేటర్, తన గుర్తులు ఎప్పుడూ నిలుపుకుంటారు - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 నిమిష చదువు సమయం.

కొన్ని విషయాలలో విభేదిస్తున్నాము కాని, చంద్రన్న, కష్టజీవి, ముందు చూపు గలవారు, మంచి అడ్మినిస్ట్రేటర్, తన గుర్తులు ఎప్పుడూ నిలుపుకుంటారు. అన్ని విషయాలలో ఆయనను, వేలెత్తి చూపించలేము కూడా, కొన్ని మంచివి కూడా అనుకోవాలి కదా. ఎందుకంటే కళ్ళెదుట సాక్ష్యాలు ఉన్నాయి. పది రుపాయలు తిన్నా, పది కాలాల పాటు ఉండే, కట్టడము ఉండాలి కూడా అని నమ్ముతారు ఎక్కువమంది.

మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు, అసలు హైటెక్ సిటీ లేదు. ఆ తర్వాత ఆ కట్టడం రావడం, ఇప్పుడు ఆ ప్రాంత పరిస్తితి ఎంత అద్భుతముగా ఉందో, అందరికీ తెలుసు. ఆ అభివ్రుద్ది ఎవరూ కాదనలేని నిజము. సాఫ్ట్వేర్ కి ఆ ప్రాంతములో ప్రాణం పోసింది ఆయనే. సిటీ లో ఎన్ని బ్రిడ్జ్ లు కట్టారో తెలుసు కదా.

మా ఊళ్ళో, ప్రభుత్వ పాఠశాల కట్టారు అన్ని హంగులతో కొత్తది లోకేష్ ప్రారంభము చేసారు, కొత్త మార్కెట్, చెత్త డంపింగ్ యార్డ్, కూడా కట్టారు. ఇంకొన్ని, నాకు తెలియనివి కూడా ఉండవచ్చు. మా వూరు తెదేపా వారికి, కనీసము చేసినవి చెప్పుకోవడము కూడా చాతకాదు, సరైన లీడర్ ని తయారు చేయలేకపోయింది పార్టీ. పసుపు కుంకుమ కింద ధనం తిన్నవారు కూడా, మొఖము చాటు వేశారు.

సరే రాష్ట్ర విషయానికి వస్తే, అప్పులు ఈ సంవత్సరములో ఎక్కువ అయినాయి అంటున్నారు, గత 5 ఏళ్ళకన్నా. పప్పు బెల్లాలు లాగా, నవ్వుతూ ధనము ఇచ్చుకుంటూ పంచుకుంటూ పోతే, చివరకు అప్పుల కుప్పలు తప్ప ఏమీ మిగలదు. అంత పంచినా చివరకు మరలా, నేల మీద కట్టినది ఏమీ ఉండదు, అని జగనన్న అభిమానులే అంటారు రేపు.

జగన్ ఈ వైపు కూడా ఆలోచన చెయ్యాలి, పంచిన డబ్బు చంద్రన్న కూ మంచి చేయలేదు సుమా, నిరూపితం. చంద్రన్న కన్నా, జగనన్నవి కూడా ఎక్కువ కొత్త కట్టడాలు రావాలి ఉండాలి చిరకాలం. విజయవాడ కు అంతర్జాతీయ విమానాలు రావాలి, మేమూ విజయవాడలో ఇన్ని చేసాము అని చూపించాలి చేతలలో.

నేను నివసించడానికి, ఇటుకతో మొదలుపెట్టి కొత్త ఇల్లు కట్టేవాడా, కష్టజీవి? లేక, వామ్మో నావల్ల కాదు, ఉన్న ఇల్లు కొనుక్కునే లేదా అద్దెకు వాడుకునే వాడు, సుఖజీవి? అమరావతిలో తాత్కాలిక భవనాలైనా, సరే కట్టి, చేతలలో చూపించారు కదా. ఇక్కడ, నా ఆలోచనల పరంపరలో, భవనాలు కట్టి పాలన చేస్తాను అని, మొనగాడుగా కట్టి చూపించారు.

ఇప్పుడు ఆ హైకోర్ట్ భవనము నుంచే, మనకు తీర్పులు వస్తున్నాయి. విజయవాడ వెళ్ళే హైవే ఎంతో మారిపోయింది, ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్ తిరుపతి విజయవాడ, పెద్ద పెద్ద రోడ్లు, ఎన్నో రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లు, వెలిసాయి చుట్టుపక్కల. తిరుపతి శ్రీ సిటీ ఇంకా ఎన్నో అభివ్రుద్ది కార్యక్రమాలు జరిగాయి. కడప కు విమానాలు.క్రిష్ణ పట్నం రేవు పోర్ట్.

రైతన్నల పచ్చటి పొలాలు పోయాయి అన్న బాధ, తన వర్గం వారికి వేల ఎకరాలు ఆరోపణ (ఇంకా నిరుపణ కాలేదు), పక్కన పెడితే, కొన్ని అయినా మన కళ్ళకు కనపడుతున్నాయి కదా సజీవముగా. పట్టిసీమ ప్రాజెక్ట్. పోలవరం లో కదలిక, ముంపు గ్రామాల కలయిక, రియల్ టైం గవర్నమెంట్, మీ సేవ.

సరే, ప్రచారము అనండి, ఏమైనా అనండి, ప్రపంచము మొత్తము, అమరావతి పేరు మోగించారు. తప్పదు, కొన్ని సార్లు ఆ పబ్లిసిటి. మన ఇంట్లో ఉద్యోగము లేని పిల్లలకు కూడా, ఎన్నో మాయ మాటలు చెప్పి పెళ్ళి చేస్తాము, కోట్లు ఉన్నాయి అని, మరి అది తప్పా అబద్దమా అంటే, అందరమూ చేస్తున్నదే గదా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 793 General Articles, 46 Tatvaalu
Dt : 07-Aug-2020, Upd Dt : 07-Aug-2020, Category : Politics
Views : 166 ( + More Social Media views ), Id : 634 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : chandranna , hardworking , forward thinking , good administrator , retains marks , andhra , development , lokesh
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content