ఆంధ్ర కేసరి - వేదంలా ఘోషించే గోదావరీ, పదండి దండయాత్ర గా - విజయచందర్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,164; 104 తత్వాలు (Tatvaalu) and views 225,568.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

విజయచందర్ నిర్మించి, దర్శకత్వం వహించి తాను ప్రధాన పాత్ర పోషించిన 1983 నాటి తెలుగు జీవిత చరిత్రాత్మక చిత్రం, ఆంధ్రకేసరి. ఈ సినిమా, ఆంధ్రకేసరి గా పేరుపొందిన, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితం ఆధారంగా రూపొందించారు.

ఆయన పేరు మీద గానే, మా జిల్లా కు, ప్రకాశం జిల్లా గా పెట్టారు. ఆ మహనీయుని గుర్తుకు తెచ్చుకుని, ఒక్క సారి పాడే అవకాశం తీసుకుందాం, కొత్త తరానికి ఆయన గురించి తెలియచేద్దాం. మనం గాయకులం కాదు, కేవలం ప్రయత్నం చేద్దాము.

వేదంలా ఘోషించే గోదావరీ - ఈ ఒక్క పాటలో ఆంధ్రుల చరిత్ర, రాజమండ్రి గొప్పతనం ఎంతో కనపడుతుంది. ఆరుద్ర గారు గొప్ప గా రాసారు. ప్రకాశం పంతులు గారి కాలం లో, మనం పుట్టుక పోయినా, ఆనాటి రాజమండ్రి ‌గురించి చాలా చక్కగా వివరించారు. రచయిత కు అభినందనలు. గోదావరి ని రాజమహేంద్రవరం ను చూడగానే గుర్తు కు వచ్చే పాట ఇది.

పదండి దండయాత్ర గా - ఈ పాటలో ఉప్పు సత్యాగ్రహం జరిగిని తీరు, ఆంగ్లేయుల పాలనలో మనము పడిన కష్టాలను వివరించారు. ఆయుధ బలం కన్నా, ఆత్మ బలం ముఖ్యం అని చాటి చెప్పింది ప్రకాశం పంతులు గారు, ధైర్యముగా తూటకు ఎదురు నిలబడ్డారు.

నటుడు, నిర్మాత, డైరెక్టర్ విజ‌య‌చంద‌ర్ కు టంగుటూరి ప్రకాశం పంతులు గారు తాత అవుతారు అంట. ప్రకాశం పంతులు గారి, కూతురు పుష్పావతి గారు, విజయచందర్ తల్లి.
ఆంధ్రకేసరి సినిమా 1-11-1983 లో విడుదలైంది. సినిమా షూటింగ్ అప్పుడు అస్సెంబ్లీ ముందు అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య క్లాప్, సినిమాటోగ్రఫీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు కెమెరా స్విచ్చాన్ చేసారు.

1) వేదంలా ఘోషించే గోదావరీ
అమర ధామంలా శోభిల్లె రాజమహేంద్రీ 2
శతాబ్దాల చరిత గల సుందర నగరం 2
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం

రాజ రాజ నరేంద్రుడు, కాకతీయులు
తేజమున్న మేటి దొరలు, రెడ్డి రాజులు
గజపతులు నరపతులు, ఏలిన ఊరు
ఆ కథలన్ని నినదించె, గౌతమి హొరు ||వేదంలా||

శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో, వక్షోముఖాంగేషు, యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం, స్త్రీ పుంస యోగోద్భవాం,
తే వేదత్రయ మూర్తాయ, స్త్రీపురుషా, స్సంపూజితావ స్సురై:
భూయాసు:, పురుషోత్తమాంబుజ భవశ్రీకంధరా: శ్రేయసే

ఆది కవిత నన్నయ్య, వ్రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివాసము, పెద్ద ముచ్చటా 2
కవిసా.ర్వభౌములకిది, ఆలవాలము 2
నవ కవితలు వికసించె, నందనవనము ||వేదంలా||

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి, కనక మేడలు 2
కొట్టుకొని పోయె, కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు ||వేదంలా||


2)ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యగ్రహం, వందేమాతరం, వందేమాతరం

పదండి దండయాత్ర గా, పదండి దండు దండుగా
ప్రకాశ సిమ్హ గర్జన, దిగంతరాలు నిండగా 2

* ఇది ఉప్పు కాదు నిప్పురా, దొరల పాలి ముప్పు రా
ఇదే ఇదే మన బానిస, బంధనాలు విప్పురా
ఇది దావాగ్ని జ్వాలరా, దావాచల ఏరురా
పరపాలన పీడనమే, మసిగ నుసిగ కాల్చునురా ||పదండి దండయాత్ర||

* మన తల్లిని మన చెల్లిని, కాటేసిన త్రాచులు
మన కలిమిని మన బలిమిని, కబళించిన నీచులు
ఈ పిడికెడు ఉప్పు చూసి, గడ గడ లాడాలిరా
స్వాతంత్రపు జేగంటలు, గణ గణ మోగాలిరా||పదండి దండయాత్ర||

* ఆయుధాల శక్తి కన్నా, ఆత్మ శక్తి మెండురా
అలనాడిది చాటి చెప్పె, టంగుటూరి గుండెరా
ప్రతిమనిషి ఈ నాడొక, ప్రకాశమై వెలుగురా
ఒక్క గుండె వెయ్యి గుండ్లు, ధిక్కరించి గెలుచురా||పదండి దండయాత్ర||

ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యగ్రహం, వందేమాతరం, వందేమాతరం

విజయచందర్, మురళీమోహన్
రచన: ఆరుద్ర, గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

Andhra Kesari - vedamla ghoshinche godavai, Padandi dandayatra gaa- Vijaya chandar  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,164; 104 తత్వాలు (Tatvaalu) and views 225,568
Dt : 30-May-2022, Upd Dt : 30-May-2022, Category : Songs
Views : 706 ( + More Social Media views ), Id : 1408 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , kesari , vedamla , godavai , padandi , dandayatra , vijaya , chandar , tanguturi , prakasam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content