APLatestNews.com top Banner
కార్తీక పౌర్ణమి శుభప్రదం - శివ కేశవులు - సత్యనారాయణ స్వామి వ్రతము - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం / వీడియో మరువద్దు.

కార్తీక పౌర్ణమి శుభప్రదం అయిన రోజు మన అందరికీ. దేవ దేవులు శివ కేశవులు ఇద్దరు కూ, ప్రీతికరమైన రోజు. సముద్ర స్నానం లకు మరియు సత్యనారాయణ స్వామి (కేశవ/ విష్ణు ప్రతి రూపం) వ్రతము కు చాలా మంచి రోజు.

కోరిక తీరినాక చేస్తాము అనేది సామాన్యుల పద్దతి. మనశ్శాంతి కోసము ముందే చేస్తాము, తర్వాత మీ దయ అనేది, మంచి వాళ్ళ పద్దతి.

ఈ రోజు కార్తీక సోమవారము కూడా, శివయ్యకు కార్తీక దీపము ఎటూ పెడతాము. 365 రోజుల వత్తులు కూడా ఈ రోజు వెలిగిస్తారు శివయ్య గుడిలో, ఎందుకంటే, అనుకోకుండా రాబోయే రోజుల్లో ఏదైనా ఇబ్బందులు వస్తే పరిహారముగా. అంతే కానీ, ఈ రోజు పెట్టి, 365 రోజులు పెట్టకుండా వదిలి వేయమని కాదు.

ఊరువాడలా అయ్యప్ప శరణుగోష మొదలైంది. హరి హర సుత స్వామియే శరణం అయ్యప్ప అంటూ, భక్తజన కోటి దీక్షలకు సిద్ధమవుతున్నారు. అయ్యప్ప మాలధారణ, చేసే సమయం ప్రారంభమైంది. మకరజ్యోతి సమయానికి శబరిమల కొండకు చేరుకోవాలనుకునే స్వాములు, దీక్ష తీసుకోవడానికి మంచి రోజులు మొదలవుతున్నాయి.

ఈ రోజు చాలా మంచి రోజు, పొద్దున్న కుదరక పోతే సాయంత్రము కూడా పూజ చేయవచ్చు. చీకటి పడే వేళ అంటే షుమారు 5 లేదా 6 pm కొంచెం అటు ఇటు అయినా. నిండు పౌర్ణమి, వెలిగిపోయే చందమామను, చూసేది రాత్రిపూటే కదా. శాస్త్రములో చెప్పింది కూడా రాత్రి పూజనే. పొద్దున చేసిన వారు, మరలా సాయంత్రము తిరిగి చిన్న పాటి పూజ కూడా చేస్తారు.

అన్ని సామానులు ఉండి, కావలసిన జనము ఉండి, పంతులు గారు ఉంటే, అన్ని పద్దతిగా చెయ్యవచ్చు. అవి లేనప్పుడు కూడా, వదలకూడదు, కనీసము ఉన్నవాటితో అయినా మనకు వీలైన పద్దతిలో , పూజ చేస్తే మంచిది.

బిడ్డల ప్రయత్నము తప్పు అయినా కూడా, తల్లి దండ్రులు అయిన దేవుళ్ళు క్షమిస్తారు, ప్రయత్నమునకు సంతోషపడతారు. ఏమీ లేని దానికన్నా, ఏదో ఒకటి నయము కదా.

మరి చెప్పినప్పుడు చేయాలి కదా, ఈ రోజు ఆ స్వామి కి పూజ చేసుకునే భాగ్యము దక్కినది. మాటలకు చేతలకు మనసు కు లంకె కుదిరితే నే, కదా మన పూజ ఆయనకు చేరుతుంది.

స్వామి వారి పూజలో ఆనందం, ఈ పాట మాటలలో చూడండి.

స్వామి ని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తి ని దర్శించే కన్నులే కన్నులట

అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా , స్వామి కి మదిలోనే కోవెల కడదామా


చూడండి పై వాక్యాలలో, ఎంత అర్థం ఉందో. ఎక్కడ అయినా డబ్బు హోదా అధికారము మాట ఉందా ఇక్కడ. కేవలము మనసు మనసు మనసు మాత్రమే. బీదవారికి కూడ ఇబ్బంది లేదు ఆయన పూజతో.

వ్రతము తో పాటు ఐదు వ్రత కధలు కూడా చదవాలి. మానసిక వికారములు, నీతి నియమాలు గురించి మాత్రమే, ఈ కధల రూపేణా వివరణ. ఎంత ఆనందం, మనశ్శాంతి మనసు తో చేస్తే.

పెద్దలు అంటే పితృ దేవుల కు కూడా దీపం నైవేద్యం పెట్టుకోవచ్చు.

డబ్బు ఉందని జనం ఉన్నారు అని హోదా చూపి కడుపు నింపటానికి, ఏదో మమ అని అనిపించడానికి కాదు ఈ పూజ. మనసు తో మనసులో(అంటే చూపు, మాట, మనసు భగవంతుని వైపు మాత్రమే) చేయాల్సిన గొప్ప పూజ.

పూజ తర్వాత, కనీసం వారం రోజులు ఆ ప్రభావం మన మనసు పై ఉండాలి, మన చేతలలో అది కనిపించాలి.

ఓం నమో సత్యనారాయణ స్వామి నే నమః.

Update :

ఈరోజు కార్తీకం పౌర్ణమి మరియు సత్యనారాయణ స్వామి వ్రతం, అవకాశం వదులు కోవద్దు అని చెప్పినాము కదా, దానిని చాలా మంది ఉపయోగించుకున్నారు, అమెరికా లో మరియు ఇండియా లో కూడా. ఫోటో లు పంపారు. ధన్యవాదాలు. మన కష్ట కాలంలో ఇవి టానిక్ లు.

ఈ పౌర్ణమి నుంచి చాలా గ్రహాలు మార్పులు జరుగుతున్నవి. డిసెంబర్ 25 న 6 గ్రహల కలయిక జరుగుతుంది అంట. కొన్ని కొంత వరకు నమ్మాలి, మనలో తప్పు లేకపోతే భయం అవసరం లేదు.

ఎన్నో మార్పులు, మంచి కానీ చెడు గాని. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇలాంటి మంచి సమయం వదులు కోకూడదు. మోహం, అహంకారం వద్దు. ఫలితాలు తప్పవు.
 
కార్తీక పౌర్ణమి శుభప్రదం - శివ కేశవులు - సత్యనారాయణ స్వామి వ్రతము - Pic 2
చిత్రము 2



Dt : 11-Nov-2019, Upd Dt : 11-Nov-2019 , Category : General
Views : 113 ( + More Social Media views ) ( id : 216 )
Tags : satynarayana swami puja , Kartika Purnima

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content