పాటతో పరమార్ధం - ఎవరికీ తలవంచకు - నిండు సంసారం - ఎన్టీఆర్, కృష్ణ కుమారి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,370,739; 104 తత్వాలు (Tatvaalu) and views 256,771.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Yevarikee Thalavanchaku - Nindu Samsaram - NTR, Krishna Kumari

సంస్కార పెంపకం, ఆత్మ విశ్వాసం, ఆత్మాభిమానం ఉన్న వారు, ఎవరికీ తలవంచరు, ఎవరినీ యాచించరు, కపట నటన 2 నాల్కలు ఉండవు. గుండె/ మానసిక బలమే వారి ఆయుధం, నిండు మనసే వారి ధనం.

ధనం ఇవ్వాలన్నా పుచ్చుకోవాలన్నా, గుణ అర్హత ఉండాలి, అని చెప్పే ధైర్యం ఎంత మందికి ఉంటుంది?

ఎవరికీ తలవంచకు అంటే, మరలా మూర్ఖముగా, నీతి నియమము గల సంస్కార పెద్దలకు అలాగే చిన్నలకు, ప్రహ్లాదుడు చిన్నవాడైనా నమస్కరించాలి కదా, దైవాలకు, మంచి వారికి, తల వంచను అని అనకూడదు. అక్కడనే మన సంస్కారం బయట పడేది, అదే పిల్లలు నేర్చుకునేది, ముదుసలి తనములో మనకు ఒంటరితనముతో కన్నీళ్ళు తెప్పించేది చేసిన పాపాలకు.

జీవితమే ఒక వైకుంఠపాళి అని అందరికీ తెలుసు, కానీ బ్రమలు లో ఉంటారు, నిజం తెలుసుకో అన్నా అని చెప్పినా, మనల్ని చూసి నవ్వుతారు. వారికి తర్వాత తెలిసి వస్తుంది, ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములు ఉంటాయి. అందుకే త్యాగం గుణం సంస్కారం తో, మనచి మాటలు పనులు తో, చిరునవ్వులతో విషవలయాలను, ఛేదించి ముందుకు నడవాలి.

చాలీ చాలని జీతంతో, మిడిమేలపు, కొలువులు కొలవకు, అంటే అప్పులు చేసి పప్పు కూడు వద్దు. అలాగని, ముడుచుకుపోయిన ఆశలతో, మిడిమిడి బ్రతుకును గడపకు, ఉన్నదానితో ఆత్మ సంత్రుప్తి ఉండాలి. అందరూ గొప్ప గా చెప్పుకునే, బానసత్వం చేసే, చీకటి రాజ్యం ఎంతో కాలం, చెలాయించదని మరవకు.

ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములు ఉంటాయి మనకు ఎందరో మహానుభావులు నిరూపించారు, ఈ మధ్యకాలములో, మన పుట్టిన తర్వాతనే సుమా. ఇంట్లో పెద్దలను అడగండి, వీరి జీవితాలలో చివరి పేజీలు అర్ధం అయేలా చెప్పమని - రామన్న రాజన్న సావిత్రమ్మ జయలలితమ్మ కోడెలయ్య శ్రీదేవమ్మ‌‌‌ కాఫీడేఅయ్య.

నిజాయితీకై నిలిచేవారికి, పరాజయం ఉంటుందా? మంచితనమ్మును మించిన పెన్నిధి మనిషికి, వేరే ఉందా? పై వారికి తోడుగా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేని వారు ఒకరైనా దొరికి ఉంటే, ఇంకా ఎక్కువ కాలం జీవించి, ఎంతో మంచి చేసి ఉండేవారు.

ఎవరికీ. తలవంచకు, ఎవరినీ. యాచించకు
గుండె బలమే నీ. ఆయుధం, నిండుమనసే నీ. ధనం ||ఎవరికీ ||

చరణం: 1
కండలు పిండే కష్టజీవులకు, తిండికి కరువుంటుందా..? 2
నిజాయితీకై నిలిచేవారికి, పరాజయం ఉంటుందా.?
మంచితనమ్ము.ను మించిన పెన్నిధి 2 మనిషికి, వేరే ఉందా..? 2 ||ఎవరికీ ||

చరణం: 2
చాలీ చాలని జీతంతో, మిడిమేలపు కొలువులు కొలవకు 2
ముడుచుకుపోయిన ఆశలతో... హోయ్ మిడిమిడి బ్రతుకును గడపకు 2
చీకటి రాజ్యం ఎంతో కాలం, చెలాయించదని మరవకు,
చెలాయించదని మరవకు||ఎవరికీ ||

చరణం: 3
జీవితమే ఒక వైకుంఠపాళి, నిజం తెలుసుకో భాయీ.. 2
ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములు ఉంటాయి
చిరునవ్వులతో విషవలయాలను, ఛేదించి ముందుకు పదవోయి,
ఛేదించి ముందుకు పదవోయి ||ఎవరికీ ||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,370,739; 104 తత్వాలు (Tatvaalu) and views 256,771
Dt : 22-Sep-2023, Upd Dt : 22-Sep-2023, Category : Songs
Views : 506 ( + More Social Media views ), Id : 1924 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Yevarikee , Thalavanchaku , Nindu , Samsaram , NTR , Krishna , Kumari , evarikee , Talavanchaku
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content