ఏం పిల్లడో ఎల్దుమొస్తవా తెలంగాణ కొమరయ్య కొండకి-అర్ధరాత్రి స్వతంత్రం-నారాయణ మూర్తి, టి. కృష్ణ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,049,991; 104 తత్వాలు (Tatvaalu) and views 235,741.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పిరికిపందల్లా నిత్యం, భూస్వాముల పెత్తందార్ల అధికార దాహం ముందు తలొగ్గుతున్న, బడుగు బలహీన గిరిజన వర్గాల జనాన్ని, చైతన్య పరచి ఆలోచన తెప్పించి ధైర్యం కలిగించే విధముగా, ఈ గీతాన్ని వంగపండు మలిచారు.

మీరూ ఒకసారి ఈ గీతాన్ని పాడి, మనిషిలాగా ఆవేశము ఆలోచన తెచ్చుకుని, బానిసత్వము నుంచి బయటకు రండి. మంచి తనానికి మనము తలొగ్గాలి కాని, అధికారం ఐశ్వర్యము అహంకారము మోసము కుట్ర దొపిడీ లకు గాదు సుమా.

ఈ పాట వింటే, ఎవరికైనా ఆవేశము కలిగి భవిష్యత్ పై ఆశ కలిగి, మంచి కోసం ఏమైనా చేద్దాము, పాపాన్ని సమ్హరించి మనము లేకపోయినా, మన తర్వాత తరాలు అయినా, ఈ బానిసత్వ శ్రుంఖలాలు తెంపుకుని, స్వేచ్చగా ఆనందముగా జీవిస్తారన్న, తెగువను ఈ పాట తెప్పిస్తుంది. ప్రతి పదము లో, ఎంతో అర్ధం, ఎంతో గూఢార్ధం.

పిల్లినైనా పొద్దుగూకులు కొడితే, పులిలా తిరగబడుతుంది ఎదిరిస్తుంది అన్న నానుడి ని నిజం చేస్తుంది ఈ పాట. మనిషిని మనిషి తమ కాలి కింద చెప్పులా ఉంచుకోవాలి అని భావిస్తే, అది డబ్బు లేదా అధికారం లేదా అవకాశం తో, అవి ఏదో ఒకనాడు తిరగబడతాయని, ఈనాడు కూడా మనము ఎన్నో విషయాలలో ఉదాహరణలు చూస్తున్నాము.

శ్రీకాకుళంలో అమాయక గిరిజన ప్రజలు, తమ బతుకులు బాగు చేసుకోవడానికి ఏవిధంగా పోరాటం చేశారో వివరిస్తూ, వంగపండు రాసిన, ఏం పిల్లడో ఎల్ద మొత్తవా, పాట విశేష ప్రజాదరణ పొందింది. దానిని టి. కృష్ణ మీద ఆర్‌. నారాయణమూరి చిత్రీకరించారు. సినిమాలో గీతాన్నీ వంగపండు పాడటం గమనార్హం.

ఏం పిల్లడో ఎల్దుమొస్తవా ఏం పిల్లో ఎల్దుమొస్తవా 2

సికాకులంలో సీమకొండకి <ఏం పిల్లడో...>
అరె చిలకలు... అరె చిలకలు... ఏయ్ చిలకలు కత్తులు దులపరిస్తయట <ఏం పిల్లడో....>
అరె సాలూరవతల సవర్లకొండకి <ఏం పిల్లడో....>
చెవర పిల్లులు భల్ శంఖమూదెనట <ఏం పిల్లడో....>
నల్లగొండ నట్టడివిలోనికి <ఏం పిల్లడో....>
పాముని... అరె పాముని... అరె పొడిచిన చీమలున్నవట <ఏం పిల్లడో....>
అరె తెలంగాణ కొమరయ్య కొండకి <ఏం పిల్లడో....> అరె అరె అరె హా హా హూ

అరె గద్దని...అరె గద్దని తన్నిన గేద్దూలున్నవట <ఏం పిల్లడో....>
ఆకులు మేసిన మేకలకొండకు <ఏం పిల్లడో....>
పులుళ్ళి అరె పులుళ్ళి అరె పులుళ్ళి మింగిన గొర్రెలున్నయంట <ఏం పిల్లడో....>
రాయలసీమ రాలుగొండకి <ఏం పిల్లడో....>
రక్తం....అరె రక్తం రాజ్యం ఏలుతున్నదట <ఏం పిల్లడో....>
తూరుపు అరె తూరుపు దిక్కున దోరకొండకి <ఏం పిల్లడో....> అరె అరె అరె హా హా హూ

అరె తుపాకి...భలె తుపాకి... అరె తుపాకి పేల్చిన తూనీగలున్నవట <ఏం పిల్లడో....> 2
అరె కలకత్తా కొస కారుకొండకి <ఏం పిల్లడో....>
ఎలుకలు... అహ ఎలుకలు...అరె ఎలుకలు పిల్లిని ఎంటా తగెలెనట <ఏం పిల్లడో....>

ఏం పిల్లడో...ఏం పిల్లో...
ఏం పిల్లడో...ఏం పిల్లో...
భలె భలె భలె భలె
ఏం పిల్లడో...ఏం పిల్లో...
ఏం పిల్లడో...ఏం పిల్లో...


మిగతా పూర్తి మాటలు వీడియో పాటలు లింక్ లోపల మరి.

Telugu Song: Em pillado, Genre: Popular folk song, Writer: Vangapandu
Yem Pillodo Eldumostava Telangana Komarayya kondaki | Ardharatri Swatantram | Narayana Murthy, t. Krishna, P. L. Narayana
ఏమ్ పిల్లోడో | అర్ధరాత్రి స్వతంత్రం | నారాయణ మూర్తి, పి.ఎల్. నారాయణ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,049,991; 104 తత్వాలు (Tatvaalu) and views 235,741
Dt : 02-May-2022, Upd Dt : 02-May-2022, Category : Songs
Views : 765 ( + More Social Media views ), Id : 1377 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : pillodo , eldumostava , telangana , komarayya , kondaki , ardharatri , swatantram , narayana , murthy , tkrishna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content