మన ఇంటి మొదటి సజీవ తెలుగు గురువు సేవ భాగ్యం ఎందరికి ఉంది, ఉంటుంది, ఉండబోతుంది? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,340; 104 తత్వాలు (Tatvaalu) and views 225,144.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అందరితో పంచుకుందాము, అందరి ముదుసలి అమ్మా నాన్నకు అండను ఇద్దాము, ఉదాహరణ గా ఉందాము, మిత్రమా.

గురువారం వచ్చినా, గురు పౌర్ణమి వచ్చినా, ఊగిపోతూ, పరాయి గురువుల సేవకులమని పరుగులు తీస్తారు, వారి హారతులు కూడా నోటికి రావు. వీరికి తెలుగు గురువులు కనపడరు, ఇంట్లో గురువులు అసలు పనికి రారు.

మన ఇంట్లో, మన జీవితంలో, 9 నెలలు, శ్రమ అనుకోకుండా, మనల్ని తనలో మోసి, తనతో అన్ని చోటులకు తిప్పి, తన తిండి లో బలం లో ఆయువులో సగ భాగం ఆనందంగా త్యాగబుద్దితో, కలిమి ఉన్నా లేకపోయినా, ఎన్ని కష్టాలు ఎదుర్కొని అయినా అన్నిటిని సమం గా పంచిన,

తెలుగు భాషను భావాన్ని, పాటను మంచి మాటను, సేవను నడతను నడకను, కరుణ దయ త్యాగాన్ని మర్యాదను సంస్కారం ను, అరిషడ్వర్గాల సాధన, సంఘము లో ప్రవర్తనను ఉచితముగా నేర్పించిన, అష్టవ్యసనాలకు దూరము గా ఉంచిన,

మొదటి మరియు సజీవ తెలుగు గురువు, చేతి కర్ర లేదా మన చేయి పట్టుకోకుండా పదడుగులు కూడా సొంతముగా నడవలేని, ఎన్నో సార్లు పడి ఎమర్జెన్సీకి వెళ్ళిన, 76 ఏళ్ల పై బడిన కన్నతల్లి సేవా భాగ్యం, 8 ఏళ్ళ (2014 నుంచి) పైగా భగవంతుడు మనకు ప్రసాదించారు.

ఎన్ని జన్మల అదృష్టం ఉంటే ఎంత గత జన్మ పుణ్య ఫలం ఇప్పుడు వచ్చి, ఆ ముదుసలి వయసు లో కూడా, అమ్మ చేతి ముద్ద తినే భాగ్యం, అమ్మను నిద్రపుచ్చుతూ జోలపాట పాడి జోకొట్టే, సౌభాగ్యం అర్హత పుణ్యం ఎందరికి ఉంటుంది.

మనము తినే ప్రతి తిండి, తిరిగే ప్రతి చోటు, మనకు దేవుడు ఇచ్చిన సమస్త సౌకర్యాలు అమ్మ కు కూడా రోజూ అందుతున్నాయి, ప్రపంచం అత్యుత్తమ వైద్యం తో సహా. ముదుసలి అమ్మ ను చూడడం అంటే, ఇంట్లో ఓ మూల పడేయడము లేదా ఇంట్లో వారి పై వదిలేయడం కాదు సుమా.

పసి తనము లో మనల్ని ఎలా బయట అన్ని చోట్లకు తిప్పారో, అలాగే ముదుసలి వయసులో కూడా, వారిని మనము తిప్పాలి, క్రుతజ్ఞత విశ్వసనీయత సంస్కారం మనకు ఉంటే.

అమ్మకు పనికి వచ్చే, ఓ చేతి కర్రలా, చారులో కరివేపాకు కొత్తిమీరలా, మనల్ని కూడా ఒక పాద సేవ దాసుడు అనే సాధనముగా మలచి, శక్తి ఇచ్చిన ఆ దేవ దేవుడికి, ఏమిచ్చి రుణము తీర్చుకోగలము? కళ్ళ వెంట కన్నీళ్ళు, నోటి వెంట 4 అష్టోత్తరాలు, 14 వేల ప్రదక్షిణాలు, శాఖాహారం, నేల నిద్ర, 26 శిరోముండనాలు, అప్పు లేకుండా చేయి చాచకుండా తప్ప?

అన్ని ఆయనవే కదా? మనది ఏముంది ఇవ్వడానికి, నాది అని విర్రవీగడానికి? భూమి పైకి వచ్చింది ఉత్త చేతులతో, ఆకాశానికి పోయేది మరలా ఉత్త చేతులతోనే కదా, మరలా భూమిపై పునర్జన్మకు?

నీదీ నాదీ ఏదీ లేదని, ఎంత మందికి ఎన్ని జన్మలలో, అరిషడ్వర్గాల సాధన ద్వారా అర్ధము అవుతుంది?

ఇవిన్నీ మన గొప్పకు కాదు, త్రికరణ శుద్ది గా భగవద్గీత ఆచరిస్తే, మంత్ర మహిమ దేవుడి లీలలకు నిదర్శనం. మీరు చేసేవి కూడా ఇంకా చెబితే, అవి కూడా చేద్దామని మాత్రమే, శిరస్సు వంచి మిమ్మల్ని ప్రాధేయపడుతూ,

* రోజూ దేవుని పూజ తర్వాత అమ్మ పాదాలకు నమస్కారం కూడా.
* ప్రతి శని వారము, అమ్మకు పాదాలు కడిగి, వేదోక్త పుజ, 3 సార్లు చుట్టూ తిరిగి వినాయకుడు లా
* మన 134 వ వారం, 108 ప్రదక్షణాలు లో కూడా, అమ్మ దేవతలతో పాటుగా గుడి లో ఉంటే, అమ్మ చుట్టూ కూడా తిరగడమే కదా.
* రోజూ మైలు నడకకు చేయి పట్టుకుని, మాటలు కబుర్లు నవ్వులు గత జ్ఞాపకాలతో
* రోజూ 2 సార్లు బూటు సాక్సులు పట్టీలు వేయడం, కాళ్ళు గట్టిగా ఉండి నడవడానికి
* అవసరం అయితే, జుట్టు దువ్వడం నూనె రాయడం రంగు వేయడం, మన త్రుప్తి కోసం
* మంచము దిగలేని రోజుల్లో, ఒకటి రెండు అన్ని మనమే ఎత్తి పోయడం
* తట్టుకుని పడి, ఎన్నో సార్లు ఎమర్జెన్సీ లకు వెళ్ళి రావడం
* ఇంటి ఆయుర్వేదం - వేప, కషాయం, కాకర, వెల్లుల్లి, అల్లం, ఆకు రసం, . . .
* కల్తీ లేని బలమైన పౌష్టికాహారం, పండ్లు, ఫలాలు,
* మనకు 3 ఏళ్ళు పైగా, రూపాయి ఆదాయం లేక పోయినా, అమ్మకు ఏమాత్రం తగ్గని సౌకర్యాలు
* ప్రపంచ వింతలు కూడా, మనతో తిరిగి చూడటం ఈ వయస్సులో, బస్సు రైలు ఆకాశం మార్గము లో.

ఇలాంటివి ఇంకా ఎన్నో, ఇవన్నీ మన అమ్మ నాన్న భిక్షనే, మన పెద్దమ్మ ఆదిశక్తి భిక్షనే. మరి వారిది వారికి ఇవ్వడము కూడా ఒక గొప్పెనా?

మరి వారివి వారికి వెనక్కు ఇవ్వకుండా ఎందుకు తప్పించుకుని, క్రుతగ్నులుగా నీచమైన బ్రతుకు ప్రాపంచిక మోహములో బతుకుతున్నాము అన్ని ఉండి కూడా?

కాబట్టి ఇప్పుడైనా, మొదటి మరియు సజీవ తెలుగు గురువుల సేవ భాగ్యం పొందుదాం. ఆ తర్వాతనే ఇతర గురువులు, దైవాల పూజకు విలువ సుమా.

మాత్రుదేవోభవ Maatrudevobhava పిత్రుదేవోభవ Pitrudevobhava

ఓం నమో గురుభ్యో నమః, ఓం నమో వీరబ్రహ్మేంద్రస్వామి యే నమః, ఓం నమో రాఘవేంద్ర స్వామి యే నమః, ఓం నమో యోగి వేమనాయ నమః, ఓం నమో దత్తాత్రేయ నమః.

Who had, has, will have, the fortune of serving our home first living Telugu Guru?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,340; 104 తత్వాలు (Tatvaalu) and views 225,144
Dt : 12-May-2022, Upd Dt : 12-May-2022, Category : General
Views : 491 ( + More Social Media views ), Id : 1385 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : fortune , serving , living , telugu , guru , mom , dad , parents , home
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content