వ్యాస గురు పౌర్ణమి సత్సంగం - బాబాయి అమాయకపు భక్తుని కనువిప్పు - మానస వెలుగులోకి పయనం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,323; 104 తత్వాలు (Tatvaalu) and views 225,584.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

గురు పౌర్ణమి రోజు వ్యాసుని, ఆదిశంకరుని, వాల్మీకి లాంటి వేద మునుల పూజ చేయాలి, స్మరించాలి. మన తెలుగు గురువులు, తండ్రి లాంటి వారు, బ్రహ్మం గారు, రాఘవేంద్ర, వేమన గార్లను స్మరించాలి. వీరంతా, హైందవ దేవుళ్ళనే పూజ చేయమని చెప్పారు, వేదాలనే మూలముగా చెప్పారు.

మనము, ఇతర భాషల ఆచారాల భావాల వారిని, ఎప్పుడూ తప్పు పట్టడం లేదు, దేశములో 100 మంది వారి స్థానిక గురువులు, మతాలు ఉండవచ్చు. మన కధనములు కూడా వారి గురించి కాదు, అంత అవసరము లేదు.

తెలుగు వారిమి అయ్యి, తెలుగు గురువులు రాసిన కాలజ్ఞానం, రాఘవేంద్ర చరిత్ర, వేమన శతకాలు లాంటివి లాంటి క్షుణ్ణముగా చదివి, 1 సంవత్సరం అవి త్రికరణ శుద్దిగా ఆచరించి, మాకు ఇంత కన్నా ఎక్కువ నీతి నియమాలు కఠిన సాధనలు కావాలని, ఇతర భాష పై, ఆ ప్రాంత ఆచార వ్యవహారాలపై పట్టు సాధించి, ఇతరుల వైపు పోయాము అని రుజువులతో చెపితే, వారి గురించి కూడా మనకు వద్దు.

మన బాధ అంతా, సొంత తెలుగు తల్లి భాషలో చెప్పిన తండ్రి/ తల్లి దగ్గర లేని ఆత్మజ్ఞానం, ఇతర భాషా బాబాయి/ పిన్ని దగ్గర ఉండదని తెలుసుకోలేని, బలహీన అవసర అవకాసవాద తత్వముతో, కపట వ్యాపార సామ్రాజ్య విస్తరణకు అమాయకముగా బలి అవుతున్న, సామాన్యుల గురించి మాత్రమే.

ఎందుకంటే, వారి పిల్లలు, భాగస్వాములు కూడా, మా ఇష్టం మాది, మేము ఇంటి యజమాని అయిన మీ మాటకన్నా, ఇంటి బయట ఇతరుల మాటే వేదం అంటే, ఇలాగే వీరిని కారణం లేకుండా అవసర అవకాశం తో వదిలేస్తే, చివరకు ఒంటరిగా కుళ్ళి క్రుశించి పోతారు. నాడు ఎవరూ ఆదుకోరు, ఎందుకంటే, నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అంటారు సుమీ. ఇక కధలోకి వెళదాము,

* ఏమి వీరన్న, ఎక్కడ నుంచి రాక, చేతిలో ప్రసాదం బాక్స్ తో, 1 గంటకు?

** ఇక్కడనే బాబాయి మందిరం నుంచి వస్తున్నా, ఈ రోజు గురు పౌర్ణమి కదా? అబ్బో ఎంత విపరీత జనం 75 శాతం మంది, 1 గంట పట్టింది, భోజనం పాకెట్లు, ఏమి కళ కళ, పెద్ద పెద్ద లైన్లు, మరి నువ్వు వెళ్ళ లేదా? మేము ఎప్పుడూ భోజనం సమయం లో నే, విపరీతమైన రష్ ఉన్నప్పుడే వెళతాం, జనం లేనిదే, మాకు మనశ్శాంతి రాదు, రంగులతో కళ్ళకు ఇంపుగా ఉండదు. మా పిల్లలకూ సరదానే హోటెల్ కు వచ్చినట్లు. మందిరములో, చిన్న చిన్న ఇతర హైందవ దేవతలు ఉన్నారు, కానీ అందరికీ ఒక గది నే.

* వెళ్ళాను, ఆది జగత్ గురువు క్రిష్ణయ్య గుడి ఆ పక్కనే, లయకారుడు శివయ్య గుడి కి వెళ్ళి వచ్చాను. 25 శాతం మందే ఉన్నారు, వెంటనే దర్శనం అయ్యి, ప్రశాంతముగా ఓ అరగంట కూర్చుని, పొద్దున్నే 10 లోపే వెనక్కి వచ్చాను. మామూలు ప్రసాదమే పెట్టారు, మా లాగే సాధారణముగా చిన్నది గా, నిడారంబరముగా ఉంటుంది గుడి. మరి ఇక్కడకు రాలేదే?

** చెప్పా కదా, మా విశాల మందిరములో షోకులు, భోజనాలు, అబ్బో మైకులు ఎన్నో ఉంటాయి, పాల రాతి నేల, ఏసీ కూడా. ఇక్కడ పట్టింపులేమి ఉండవు. మేము పైకి ఎక్కి బాబాయిని తాకవచ్చు. నేనైతే, పాదాలు, వేళ్ళు, కాళ్ళు, చేతులు, తల అన్ని 10 నిమిషాలు తడిమి తడిమి, ఆనందముగా వస్తాను, వెనక ఎంత పెద్ద లైను ఉన్నా, మనకనవసరం. మీ దగ్గర అలా ఉండదు కదా? అసలు తాకనీయరు.

* అంటే మీ నాన్న తాత కూడా, 50 ఏళ్ళ క్రితం బాబాయి దగ్గరికే వెళ్ళారా? గతములో క్రిష్ణయ్య శివయ్య దగ్గరకు వెళ్ళ లేదా? వారి కన్నా, మనకు ఎక్కువ తెలుసా?

మెరిసేదంతా బంగారం కాదని తెలీదా? అన్ని ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది అని, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని తెలీదా? ఉప్పు కర్పూరం తెల్ల గా ఉన్నా, అన్ని ఒకటి కాదు, వాటి లక్షణాలు ఉపయోగం వేరు అని తెలీదా?

నువ్వు పని చేసే కంపెనీలో, మీ యజమాని/ మేస్త్రి/ సూపర్వైజర్ ని ఎన్ని సార్లు తాకుతావు? ఎంత దగ్గరగా? తాకితే లేదా తాకకపోతే జీతములో/ పనిలో/ గౌరవం/ మర్యాద/ విలువలో మార్పు ఉంటుందా? మీ కంపనీ లో, పిల్లల స్కూల్ లో నియమాలు లేవా? అవి మీరు పాటించరా? అందరము వెళ్ళి, తాసిల్దారుని తాకుదామా?

మరి అక్కడ లేని ఆలోచన, దేవుడి దగ్గర ఎందుకు? మనసు ముఖ్యమా? లేక ఆర్భాటాలు నటనలు ముఖమా? ప్రాణ ప్రతిష్ట జరిగిన విగ్రహాన్ని, కలుషిత దేహం మనసు గల మనము తాకి పాపం తెచ్చుకోవడం అవసరమా?

పరీక్షలు అప్పుడు, పాఠ్య పుస్తకం తాకి చూసి రాస్తామా లేక మనసులో ఉన్న దానిని క్రోడీకరించి రాస్తామా? మానసిక బలం, తాకితే వస్తుందా, మనసులో ధ్యానం జపము మననం చేస్తే వస్తుందా?

రోగము వస్తే నే, మూల గదిలో, సొంత మనిషిని పెట్టావు దూరంగా, తాకకుండా మొన్న?

** పాత రోజులు పిచ్చి రోజులు. చదువుకోని తెలివిలేని మా పెద్దలు, వెళ్ళి ఉండవచ్చు, ఇప్పుడు కొత్త గురువులు, కొత్త మందిరాలు, కొత్త పద్దతులు, అంతా కొత్తే. 10 మంది దోవలో పోవాలి.

చూసావు కదా 75 మంది ఈ బాబాయి మందిరం కు వస్తే, 25 మందే మీ గుడికి వచ్చారు. కమ్మటి భోజనం, నువ్వు రా, ఈ ఉపయోగం లేని నీతి మాటలు కట్టి పెట్టి.

మా యజమానిని తాకను, అవసరము లేదు, జీతము తగ్గదు. నిజమే కదా? ఇంకొకరు తాకుతారు, కానీ వారికీ అదే జీతం నాకు తెలుసు.

నియమాలు ఉన్నాయి, పాటించకపోతే, ఇక రానివ్వరు, ఆదాయం పోతుంది, పిల్లల చదువు ఆగుతుంది. నిజమే కదా, మరి దేవుని దగ్గర కూడా నియమాలు కరెక్టే.

నిజమే, విడి గదిలో పెట్టాను, జీవిత భాగస్వామిని. అంటే, నేను మూర్ఖముగా చేస్తున్నానా?

నిజమే మనసులో అంతర్మధనం జరగాలి, మనసును నియంత్రణ చేయాలి, అది మదిలోనే జరగాలి, అయ్యో ఏమిటి, నావి అన్ని పిచ్చిపనులు గానే, ఉన్నాయే?

ఉప్పు, కర్పూరం వేరు. అంటే నేను, ఉప్పు వైపు ఆలోచనలతో, వాస్తవానికి దూరం అవుతున్నానా?

* గుడులు దేవాదాయ శాఖ కింద ఉండి, వారికి పన్నులు కడుతూ, అధికారుల చేతుల మీదుగా పనులు జరగాలి, జమ ఖర్చు లెక్కలు చూపాలి, ప్రజలకు జవాబు దారి.

కానీ బాబాయి మందిరములో లెక్కలు ఎవరికీ చూపక్కరలేదు. 5 వస్తే, 3 దాచి, 1 ఖర్చుపెడితే, అందరూ ఆనందపడుతున్నారు. 3 ఏమైనాయి అని అడిగే ధర్మం, ధైర్యం, ఎవరికైనా ఉందా? అడిగినా చెపుతారా?

బాబాయి గుడి కట్టిన వ్యాపారస్తుల, 10-20 ఏళ్ళ జీవితములో, ఐశ్వర్య పెరుగుదల చూసావా? మా ఊళ్ళో ధర్మకర్త కు 5 వేళ్ళకి 5 ఉంగరాలు వచ్చాయి, డాబాలు పెరిగాయి. మీ దగ్గర చూసావా? అంటే భక్తుల పిచ్చి నమ్మకము తో, వారు బాగుపడుతున్నారు.

అంటే, నువ్వు పాపాన్ని పంచుకుంటూ, పెంచుతున్నావని తెలుసా? అధర్మాన్ని కాపాడుతున్నావు? సొంత తెలుగు గురువులను/ హైందవ దేవతలను నిరాదరిస్తున్నావు? అంటే మాయకు లోబడుతున్నావు. పాత రోత, కొత్త వింత అని నీ పిల్లలకు నువ్వే చెపుతున్నావు.

నియమాలు లేవు అన్నావు, ఎప్పుడైనా, అన్ని ఇచ్చి నిన్ను ఇంత వాడిని చేసిన, మీ తల్లి దండ్రుల, తాతల కాళ్ళు కడిగావా, నెత్తిన చల్లుకున్నావా? ఇలాగే కాళ్ళు చేతులు తల, ఓ 5 నిమిషాలు పట్టావా?

** చీ పాడు, అమ్మా నాన్న కాళ్ళు కడగడం ఏమిటి? నెత్తిన చల్లుకోవడం ఏమిటి? పట్టడం ఏమిటి? బాబాయి అంటే గురువు, వీళ్ళు మనుషులు. ఒక్క నిమిషం ఉండు.

ఎవరో ఓ పిచ్చోడు, 8 ఏళ్ళ సజీవ గురువు పెద్దల సేవ చేస్తూ, 2 ఏళ్ళు గా పెద్దల కాళ్ళు కడుగుతూ వేదోక్తముగా పూజిస్తూ, మీరు కడగండి అని, అలాగే 140 వారాల 108 ప్రదక్షిణలు చేస్తూ, మనల్ని చెయ్యమని, నేల నిద్ర చేస్తూ, శాఖాహారం తింటూ, నీతులు పంచుతున్నారు అంట అని అనుకున్నా.

కానీ ఇప్పుడు నేనే పిచ్చోడిని, బద్దకం, నిర్లక్ష్యం, అనారోగ్యం తో, మానసిక బలహీనతతో ఉన్నానా అని అనిపిస్తుంది. మాత్రుదేవోభవ పిత్రుదేవోభవ, మొదటి గురువు తల్లి తండ్రి అని మరచానా? అంటే అప్పుడు తెలుగు లో, మొదటి గురువులు కూడా, బ్రహ్మం లాంటి వారే కదా?

ఏది చేసినా ఒళ్ళు వంగకుండా, కందకుండా చేయాలి, అంతా పైపైనే. అసలు మా ఇంట్లో ఒక్కరి నోటికి ఒక్క శ్లోకం పలకదు, ఉదయం 5 కి లెగవము, బాబాయి ఆరతులు కూడా, 10 ఏళ్ళు గా వెళుతున్నా, ఏవీ రావు. మైకే పాడుకుంటుంది, ఒక్క నిమిషము అక్కడ నిల్చుని, కాసేపు స్నేహితులతో మాట్లాడుకుని, వెంటనే ప్రసాదం వైపు.

కనీసం ఇంట్లో నుంచి బొట్టుతో కూడా బయలు దేరము. కట్టె కొట్టె తెచ్చే లాగా ఉండాలి. మా బంధాలైనా అంతే, అవసరం అవకాశం. అంటే, నా కుటుంబానికి, నీతి నియమము నిబద్దత బాధ్యత క్రుతజ్ఞత విశ్వసనీయత తనమన లేకుండా, పెంచుతున్నాను? అరిషడ్వర్గాలకు బానిసలు గా చేస్తున్నాను.

పై వన్నీ, చేయకుండా, నా పిల్లలకు మరియు నేను ఉన్నా/ లేకపోయినా నా భాగస్వామికి, మానసిక ధైర్యం ఎలా వస్తుంది? జీవిత కష్టాలు ఎలా ఎదురుకుంటారు? మందిరము లో వ్యాపారస్తుల విత్తనాలకు, నేను నీళ్ళు పోసి, సేద్యం చేస్తున్నాను మూర్ఖత్వముతో?

సొంత తెలుగు గురువులకు, నిలువ నీడ లేకుండా చేసి, ఊరికో గుడి కట్టకుండానే, ఇతరులకు కట్టి దానిని పోషించి, పొరుగింటి పుల్ల కూర, భేష్ అంటున్నానా, వారికి దాసోహం అంటూ పల్లకీలు మోస్తున్నానా? అంటే నాది వక్రబుద్దే?

* కలియుగంలో 3 వంతులు చెడు (75 మంది), 1 వంతు మంచి అన్నది (25 మంది), నీ మాటలలో నే చెప్పావు. మనము ఎన్నుకున్న నాయకులు పాము, పులి స్వభావం కలవారని అందరికీ తెలుసు, ఎందుకంటే, ఓటు వేసే మన స్వభావం కూడా అదే. అంటే మంచి మరియు వాస్తవం వైపు 25 మందే ఉంటారు. అటే కదా నువ్వు ఉండాలి, రుజువుల తో?

రేపు నీ ఇంట్లో వారు కూడా, నీ కన్నా, ఎక్కువ అబద్దాలు కల్పనలు ఉచితాలతో ఆకర్షించబడి, ఇలాగే నిన్ను వదిలేస్తే? అప్పుడు నువ్వు అది అన్యాయం అంటావా? లేదు, అది మంచి పనే, అవసరం, అవకాశం, నేను నేర్పిన విద్యనే, అని ప్రశాంతముగా ఉంటావా?

** నా కళ్ళు తెరిపించావు. నేను బాధపడతాను, ఒంటరినౌతాను. ఎందుకంటే అధర్మాన్ని నమ్మి, పోషించి, ఎండమావుల వైపు పరుగులు తీసాను. తల్లి దండ్రులకు పనికి రాని పిల్లలు, నీతి లేని నక్కల కన్నా హీనం లాంటి, వేమన పద్యాలు గుర్తుకు వస్తున్నాయి. భగవద్గీత వేదాంతం అందులో ఉంది. బ్రహ్మం గారి కాల జ్ఞానములో ఎన్నో విషయాలు చెప్పారు, ఎన్నో జరిగాయి.

మా ఇంటావిడ నన్ను గౌరవించాలి గానీ, నన్ను వదిలి, ఇతరులను గౌరవిస్తే భరించలేను. నేను చేస్తున్నది తప్పు, నా ఆధ్యాత్మిక తెలుగు తండ్రులైన, వేమన రాఘవేంద్ర బ్రహ్మం గార్లను వదలను, నువ్వు పంపిన ఫోటో ఉంది. ఇంట్లో ఎదురుగా పెడతాను. ఇతర గురువుల అవసరము లేదు, వారు మన గురువుల ఫోటోలు పెడితే వారి ఇంట్లో అప్పుడు చూద్దాము.

ఏ గురువైనా ఒకటే అని, మన గురువును ఎందుకు వదలాలి? అది ఇతర భాషల వారు ఒప్పుకోరు కదా? మేమే వెర్రి వాళ్ళమా? వారి వ్యాపారానికి, నా కుటుంబం ఎందుకు బలి అవ్వాలి?

ఎవరైనా అమ్మే అని, మన అమ్మను నిర్లక్ష్యం చేస్తూ వదిలేసి, ఇతర అమ్మలను తెచ్చి ఇంట్లో/ ఊళ్ళో పెడతామా? అది పుణ్యమా, మోహమా? ఆ ఇతర తల్లి మాత్రం అంగీకరిస్తుందా? అంగీకరిస్తే మంచి తల్లి అవుతుందా? ఎంత పిచ్చిగా ఇన్నాళు చేసాను, కలి మాయలో కుటుంబం అంతా చిక్కుకున్నాము.

సొంత తల్లి/ తండ్రి కి మంచి చేయని వాడు, పిన్ని/ బాబాయి కి మంచి చేయడు. చేస్తున్నాడు అంటే ఒకటి మూర్ఖత్వం లేదా దురాశ, ఫలితము పతనము. అందుకే అనాధాశ్రమాలు పెరుగుతున్నాయి. ఇక దర్గాల వైపు కూడా పోను. నువ్వు పంపిన ఇంటి ఆయుర్వేద వైద్యం చాలు.

ఇంక, మన హైందవ గురువులు దేవుళ్ళ నే నమ్ముతాను, ఆచరణలో పెడతాను, నా పిల్లలను మానసిక బలవంతులను చేసి, రామాయణ భారత భాగవత భగవద్గీత రుజువులతో, యోగా, ధ్యానం, 30 నిముషాల రోజు పూజ, నీతి నియమాలను నేర్పుతూ, జీవిత కష్టాలు ఆనందముగా ఎదుర్కునే సంస్కారం నేర్పుతాను. ధన్యవాదాలు మిత్రమా.

*Vyasa Guru Poornami Satsang - Babais Innocent Devotees Eyes open - Journey into Strong Mental Light*  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,323; 104 తత్వాలు (Tatvaalu) and views 225,584
Dt : 13-Jul-2022, Upd Dt : 13-Jul-2022, Category : General
Views : 545 ( + More Social Media views ), Id : 1461 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vyasa , vemana , brahmam , raghavendra , guru , pournama , satsang , babai , devotee , eyes , journey , mental , light
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content