పుణ్యం, ఆరోగ్యం - తేలిక నియమాలు పద్దతులు - బీపీ, షుగర్, కరోనా అదుపు, మనశ్శాంతి - Health - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2077 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2112 General Articles and views 1,870,841; 104 తత్వాలు (Tatvaalu) and views 225,329.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ, ఈ శుభ గ్రహాల స్వస్థాన లేదా కూటమి సమయంలో, తేలిక తక్కువ ఖర్చు అందుబాటులో ఉన్న, నియమాలు పద్దతులు చెప్పగలరు. పుణ్యం రావాలి, ఆరోగ్యం బాగుండాలి. బీపీ, షుగర్, కరోనా అదుపు, మానసికబలం మరియు మనశ్శాంతి కలగాలి. మేము ఇప్పుడు అయినా మొదలు పెడతాము. కొత్త కరోనా అక్కలు, ఇంకొకరు వచ్చే లోపు, ఇంట్లో మరియు వంట్లో రోగనిరోధక శక్తిని పెంచాలి.

జవాబు, కార్తీక ధనుర్మాస వ్రతాలు లాగా, మనం సొంతం గా, ఖర్చు లేనివి, ఆరోగ్య ఆధ్యాత్మిక మనశ్శాంతి, వ్రతాలు చేయవచ్చు. వ్రతము అంటే నీతి నియమాలతో ఎప్పుడూ ఆచరించేది, ఇతరుల కోసం నటించేది కాదు అవసరానికి. అంటే, మనము చేసేది, మన స్నేహితులు బంధువులు అందరికీ తెలిసి ఉంటుంది కదా, చాటుగా ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో మొఖ ఫోటోలు కూడా పెట్టేస్తున్నారు, మంచి పనుల గురించి పెడితే తప్పులేదు కదా.

ఆకాశంలో ఉన్న మంచి గ్రహాల కన్నా, మన ఇంట్లో మరియు వంట్లో ఉన్న చెడు గ్రహాల వలన, నష్టాలు రోగాల పాలయిన వారు ఎక్కువ.

మనం ఎప్పుడు నుంచో, 7 ఏళ్లుగా మరియు కొన్ని 20 ఏళ్ల కు పైన కొన్ని, 15 పైగా సామాజిక ఇంటి వ్రతాలు అనుకుంటున్నాము. అరిషడ్ వర్గాలు ను దాటడానికి జయించడానికి, ఇవి తేలికగా ఉపయోగపడుతాయి. కల్తీ లేకుండా, ఖర్చు కూడా తక్కువ.

అన్ని మన ఇంట్లో, మన చుట్టుపక్కల నే ఉంటాయి. చదువు ఉద్యోగం వృత్తి సంపాదన హోదా వేరు. కానీ వ్యక్తిగత సంస్కారం గుణం ఆత్మాభిమానం ఆరోగ్యం వేరు, ఇవి బీదవారికైనా కోటీశ్వరుని కైనా ఒకటే, ఉండటం లేకపోవడం. కరోనా వలన, ధనం కాపాడలేని వారిని, ప్రత్యక్షంగా టీవీలలో చూశాము కదా?

60 దాటిన తల్లి దండ్రులు లేదా జబ్బున పడి నిస్సహాయ స్థితి లో ఉన్నవారు, మన దగ్గర మన ఇంట్లో ఉంటే, శని రాహు కేతు ల, మాయ నష్ట బాధల నుంచి తప్పకోగలము. ధనం తో ఆరోగ్యం, మనశ్శాంతి కొనలేము, అని ఎన్నో మార్లు రుజువు అయింది.

ఈ 15 వ్రతాలు, ఏళ్ళు గా సాక్ష్యంతో పాటిస్తూ ఉన్నవారు, మీ ఎరుకలో తెలుగు రాష్ట్రాలలో ఉంటే, దయచేసి చెప్పగలరు, ఈ ఏప్రిల్ మాసములో. అదీ మనకు తెలిసిన మీ ద్వారానే రావాలి సుమా, కొత్త వారిని నమ్మలేము కదా. అంటే, మా ప్రతిబింబాలను కష్టపడి వెతికినట్లే చూసుకున్నట్లే కదా, వారిని పట్టుకోగలిగితే? ఎందుకంటే ఇన్ని నియమాలు వ్రతాలు పాటించేవారు సంవత్సరాలు గా, చాలా తక్కువ మంది ఉంటారు.

వారికి సహాయము దానం అనే దానికన్నా, గౌరవ నగదు బహుమానము ఇద్దాము ఒక్కో వర్ణము లేదా కాటగిరీ లో (అంటే అందరూ ఒకే కులం లేదా ప్రాంతము లేదా కుటుంబం అయినప్పుడు) 20 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు, ఒక్కొక్కరు కు, మొత్తము 10 మందికి, ఒక్కొక్కరికి 10 వేలు దాకా, వారి అవసరాన్ని బట్టి.

మీరూ ఎన్ని పాటిస్తూ ఉన్నారో సరిచూసుకోండి. పిల్లల కు నేర్పడం, పిల్లలు నేర్చుకోవడం చాలా తేలిక.

1) వారానికి ఒకసారి దేవాలయ దైవ 108 ప్రదక్షిణ వ్రతం. ఉదయం 10 లోపు ఆగకుండా, ఖాళీ కడుపు, ఖాళీ పాదం, బండల పై, శివ విష్ణు మంత్రోచ్చారణ తో, కరమాల వేళ్ళ గీతల లెక్క, కనీసం 3 బై 3 గదుల పొడవు వెడల్పు గుడి చాలు. వ్యాయామము, ఆరోగ్యము, ఆధ్యాత్మికం.

2) 60 దాటిన లేదా ముందే అశక్తులైన, తల్లి దండ్రుల తో కలసి 8 వ్రతాలు

1* వార దేవాలయ దీప వ్రతం, శని లేదా ఆదివారం ఉదయం 8 గుడి, అమ్మ నాన్న తో 9 నవగ్రహ మరియు శివ సూర్య ప్రదక్షిణలు, నిమ్మ నేతి దీపాలు.
2* మాతా పిత నామ కోటి - శ్రీ రామ కోటి, శివ కోటి - రోజూ కానీసం అరపేజి రాయడం
3* మాతృ భిక్ష స్వీకార - అమ్మ చేతి వంట తినడం, లేదా చేసి పెట్టడం
4* మాతా పిత మైలు నడక - వారిని మైలు నడకకు తీసుకుని వెళ్ళడం ప్రతి రోజు, సాక్స్ వేసి
5* మాతా పిత ఆరోగ్య రక్షణ - వారి ఆరోగ్య బాధ్యతకు చర్యలు రోజూ, మందులు, అస్సుపత్రి, మంచం మీదవి ఎత్తి పోయడం, కావల్సినవి సంకూర్చడం
6* మాతా పిత పోషక వ్రతం - బాదం, వాల్నట్, ఖర్జూరం, అరటి, ఆపిల్, సెనగ, కివి, అవకాడో, ఎండు ద్రాక్ష, సీజన్ పండ్లు
7* రోగ నిరోధక వ్రతం - అన్ని పచ్చివి - రోజు కో రసం - అల్లం, వెల్లుల్లి, పెద్ద ఉల్లి, వేపాకు పొడి లేదా చిగురు, ఆకు అంటే కరేపాకు కొత్తిమీర పుదిన / కాకర/ ముల్లంగి/ బీట్రూట్/ కారెట్/ కాలె/ సెలరి రసం.
8* నిత్య కషాయ వ్రతం - పరగడుపు ఉదయం 7 లోపు, మిరియ చెక్క పొడి, అల్లం, పసుపు, లవంగ, యాలుక, రాత్రి నాన బెట్టిని మెంతి నీళ్ళు తో వేడి చేసి, నిమ్మ రసం తో

3) ప్రతి దిన గృహ తైల దీప వ్రతం, తులసి/ కార్తీక దీపం హాలులో రోజూ, మామూలు పూజ కాకుండా. అరగంట ధ్యానం. అరగంట పూజ.

మంత్రాలు శ్లోకాలు పాటలు నోటి తో పలుకుతూ, స్వచ్చమైన ఉచ్చారణ. వాక్కు, మనోబలం పెరుగుతుంది.

రామాయణం, మహ భారతం, భాగవతం, భగవద్గీత గురించి అవగాహన, ఇతరులకు చెప్పగలిగి ఉండటం, వ్యక్తిగత సంస్కారం, వ్యక్తిత్వ వికాసం, మనశ్శాంతి.

4) ఆరోగ్య జాగ్రత్త వ్రతం - ఉదయం 5 కి లెగిచి యోగాసనం, శాఖాహారం కావాలంటే గుడ్డు తో, నేల చాప నిద్ర, కారం ఉప్పు తగ్గిన తిండి, ఉన్న సౌకర్యాలను తగ్గించి వాడుకోవడం, ఇతరుల కష్టం బాధ వినే ఓపిక మరియు సలహాలు.

5) నిత్య ఆరోగ్య రక్షణ వ్రతం - మత్తు, పొగ, సోడా, కూల్ డ్రింక్, మందు డ్రింక్, ఫాస్ట్ ఫుడ్, నీసు, చీజ్, బేకరి, కొత్త సినిమా, చాక్లెట్, ఐస్క్రీం, బయట తిండి, ఒంటి మీద బంగారం - ల కు దూరం.

6) జన స్వచ్ఛంద సేవా వ్రతం, ప్రసిద్ధ ప్రదేశ/ పుణ్యక్షేత్ర/ దేవాలయ/ ఈవెంట్ల కోసం ఉచిత ప్రచారం, భారత సంగీతముతో వీడియోలు, ఫొటోలు, సమాచారం.

7) * సామాజిక రాజకీయ జన చైతన్య, * హైందవ సనాతన ధర్మ, * మాతా పిత మరియు * మాతృభూమి * మాతృ భాషా విలువ కృతజ్ఞతల ప్రచార 5 వ్రతాలు సోషల్ మీడియా తో కలిపి. కనీసం సొంత 4 రాత గొంతు మాటలు శ్లోకాలు పద్యాలు లేదా ఫోటోలు తో చైతన్యం.

వీటిలో కొన్ని అయినా మనం పాటిస్తే, మనకు పుణ్యం, పురుషార్ధం కలుగుతాయి. ఇవి చాలా మంది చేస్తున్నారు కూడా.

దైవం మనకు ఇచ్చిన శక్తిని జ్ఞానం ఐశ్వర్యం ను, నిస్వార్థంగా పదిమంది కి పంచితేనే, భగవంతుడు సంతోషిస్తారు. మానవ సేవ యే, మాధవ సేవ కాదా?

మీకు ఇతరులకు సహాయం చేసే అవకాశం వచ్చింది, మరి మీ ఇష్టం, గమ్ముగా ఉంటారో, ఇంకో వ్యక్తి అవసరానికి ఆరోగ్యానికి సహాయపు దోవ చూపిస్తారో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2112 General Articles and views 1,870,841; 104 తత్వాలు (Tatvaalu) and views 225,329
Dt : 14-Sep-2020, Upd Dt : 27-Mar-2021, Category : Health
Views : 989 ( + More Social Media views ), Id : 697 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : virtue , health , easy , rules , methods , bp , sugar , corona , control , peace of mind , pradakshin , niyamam , parents , gift
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content