Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Vela Pala Ledu (Bhakti Parody) - Abhilasha - Chiranjeevi, Radhika
ఏమండీ దేవుని పూజలు, ధ్యానాలు ఎప్పుడు చెయ్యాలి, అని 10 ఏళ్ళ అబ్బాయి అడిగాడు అని అనుకుందాము? అప్పుడు మోహ పెద్దల జవాబు, అబ్బా ఇప్పుడెందుకయ్యా, ఆ సోది, 60 ఏళ్ళు వచ్చాక చెయ్యొచ్చులే, ఇప్పుడు లైఫ్ ఎంజయ్ చెయ్యి హాయిగా, విందు చిందు మందు పొందు తో. రోగమొస్తే ఆరోగ్యశ్రీ ఉంది, సీయెం రిలీఫ్ ఫండ్ ఉంది.
అదీ కుదరకపోతే, అక్రమముగా ధనము సంపాదించినవారు, తమ పాపం పోతుందేమో అని బ్రమలతో నడిపే, అనాధ ఆశ్రమం ఉంది కదా అంటారు. ధర్మ పద్దతిలో వచ్చిన ధనానికి పుణ్యం ఉంటుంది కానీ, ముదుసలి తల్లి తండ్రి అత్త మామ సేవ చెయ్యకుండా, కన్నబిడ్డలకు సంస్కారం నేర్పకుండా, సంపాదించిన మోహ వ్యామోహ ధనం ఆస్తి పదవి అధికారం తో, 1 రూపాయ పుణ్యం కూడా రాదు.
60 దాకా వాడు బతికి ఉంటాడో లేదో తెలీదు. ఈ లోపలే ఏదో ఒక రోగముతో పోవచ్చు, తన కుటుంబానికి ద్రోహం చేస్తూ. ఒకవేళ బతికి ఉన్నా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో, తన శక్తిని అంతా పోగొట్టుకుని, కాళ్ళు చేతులు కదలని పరిస్తితి లో ఉండవచ్చు. కాబట్టి మనము చిన్నప్పటి నుంచే దైవా రాధన చెయ్యాలి. అంటే మన మనసును మనమే నియంత్రించాలి. అది పూజకు అర్ధం మిత్రమా.
కాబట్టి వేళా పాళ లేదు, మన దైవబాట కూ. జీవితములో మానసికముగా ఓడే మాట లేదూ ఎన్ని కష్టాలు వచ్చినా, దైవ బాటలో స్తిరముగా నీతి నియమాలతో సాగేవాళ్లకూ. ఏది గెలుపో, ఏది మలుపో, మనకు తెలియువరకు, ఇదే ఇదే, దైవ బాట మనకు.
వయసులో, ధనములో, అధికారములో ఉన్నాము, మన్మథుడు మనకు మంత్రి అనుకోకు, మోహ వయసు పతన పనులు ఆపేందుకు. స్తిర చిత్తము లేని వయసు ఒక చాకు, అది వాడుకోకు ఎట్టిపరిస్తితుల్లో, మన మనసు కోసేందుకు. ప్రాపంచిక బ్రమలేవద్దు మనకు, తప్పని సరిగా వదిలేయాలి నేడు. అహంకారముతో, మత్తులో, అలా లేదనీ కాదనీ, కలలే నిజమని అనుకొని సాగకు. పతనము అయిపోతావు.
నమ్మరు కదూ ఉదాహరణ లేకుండా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వలన లాభనష్టాలు, మన పెద్దలు ఎప్పుడో ప్రత్యక్షంగా నిరూపించారు. పురాణాలు లో కాదు సుమీ, ఈ 50 ఏళ్ళు లో. మీ పెద్దలు ను అంటే, సంస్కారం ఉన్న వారిని అడగండి.
రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.
పగటి కలలు ఇక మాపు, కనులకొక దైవ రూపు, అదే తొలిమార్పు మన మనసుకు విరిపానుపు. ప్రాపంచిక మోహాలిక ఆపు, తెలుసుకో రేపు, ఏలినాటి శనిలో పడే కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, చీత్కారాలు. మరి అవి తగ్గించుకోవాలి అంటే? దైవ నిత్య ఆచరణ సాధనలే మది పానుపు. అహ ఏమార్పు వద్దు, ఇదిగో దైవ హద్దు వద్దనీ, నీతి నియమాలు రద్దనీ, చిల్లర దోవల చిటికెలు వేయకు, పైన గొప్పవారి కధలు చదువు.
వేళా. పా.ళ లే.దు, దైవబాటకూ.
ఓ.డే మాట లే.దూ, సాగేవాళ్లకూ.
ఏది గెలుపో... హాయ్ హాయ్...
ఏది మలుపో... హాయ్ హాయ్...
తెలియువరకు, ఇదే ఇదే, బాట మనకు ॥వేళా పాళ॥
తకధిమి తథోంత, తకధిమి తథోంత
తకధిమి తథోంత, తరికిట తరికిటత
మన్మథుడు మన.కు, మంత్రి అనుకో.కు
మోహ వయసు ఆ.పేందుకు... ఊ..
వయసు ఒక చా.కు, అది వాడుకో.కు
మన మనసు కోసేందుకు... ఊ...
బ్రమలేవద్దు మనకు, వదిలేయాలి నేడు
లేదనీ.., కాదనీ.., కలలే నిజమని అనుకొని సాగకు...
లాలా లాల లాలా లాలాలాలా॥
కలలఇక మా.పు, కనులకొక రూ.పు
తొలిమార్పు విరిపా.నుపు... ఊ...
మోహాలిక ఆ.పు..., తెలుసుకో రే.పు
సాధనలే మది పా.నుపు... ఊ...
అహ ఏమా.ర్పు వద్దు, ఇదిగో. దైవ హద్దు
వద్దనీ., రద్దనీ., చిల్లర దోవల చిటికెలు వేయకు...॥పాళ॥
Original
వేళా. పా.ళ లే.దు, కుర్రాళ్లాటకూ.
ఓ.డే మాట లే.దూ, ఆడేవాళ్లకూ.
ఏది గెలుపో... హాయ్ హాయ్...
ఏది మలుపో... హాయ్ హాయ్...
తెలియువరకు, ఇదే ఇదే, ఆట మనకు ॥వేళా పాళ॥
తకధిమి తథోంత, తకధిమి తథోంత
తకధిమి తథోంత, తరికిట తరికిటత
మన్మథుడు నీ.కు, మంత్రి అనుకోకు
నీ వయసు కా.చేందుకు... ఊ..
వయసు ఒక చా.కు, అది వాడుకో.కు
నా మనసు కోసేందుకు... ఊ...
మనసే లేదు నీకు, ఇచ్చేశా.వు నాకు
లేదనీ.., నీదనీ.., కలగని నిజమని అనుకొని ఆడకు...
లాలా లాల లాలా లాలాలాలా॥
కలలకొక రూ.పు, కనులకొక కై.పు
తొలిమబ్బు విరిపా.నుపు... ఊ...
కవితలిక ఆ.పు..., కలుసుకో రే.పు
చెబుతాను తుది తీ.రుపు... ఊ...
అహ ఏతీ.ర్పు వద్దు, ఇదిగో. తీపి ముద్దు
వద్దనీ., ముద్దనీ., చిదమని పెదవిని చిటికెలు వేయకు...॥పాళ॥
చిత్రం : (abhilAsha) (1983); రచన : ఆచార్య ఆత్రేయ; సంగీతం : ఇళయరాజా; గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
* * *
మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు లింక్ లోపల సుమా. మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,935; 104 తత్వాలు (Tatvaalu) and views 226,368 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments