పాటతో పరమార్ధం- వే వేల గోపెమ్మల - సాగర సంగమం - కమల్ హాసన్, జయప్రద, శైలజ, గీత - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,527; 104 తత్వాలు (Tatvaalu) and views 225,608.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Ve Vela gopemmala - Saagara Sangamam - Kamal Haasan, Jayaprada, Shailaja, Geetha

ఆ పరమాత్మ క్రిష్ణయ్య లీలలు ఏదో ఒక విధముగా పాడుకుంటే, అదొక ఆత్మ సంత్రుప్తి, మానసిక శాంతి. మువ్వా గోపాలుడే, మా ముద్దు గోవిందుడే అని అందరము, ఆ బాల గోపాలుని చూసి మురిసిపోతాము.

మన్ను తిన్న చిన్నవాడే, మిన్ను కన్న వన్నెకాడే, కష్టాల తోడు ఉన్నవాడే, ఈతి బాధల నుంచి కాపాడే తోడు మనకే అని, ముద్దుగా చిన్ని క్రిష్ణయ్యను తలుస్తాము. దేహ చింతలన్ని వదిలి ఆధ్యాత్మికం వైపు నడవమని స్తుతిస్తు, పోతన్న కైతలన్ని పోత పోసుకున్నాడె, మా ముద్దు గోవిందుడే.

వేయి పేరులున్న వాడే, వేల తీరులున్న వాడే, సహస్ర నామాలు, సహస్ర రూపాలు, ఏ రూపములో తలిస్తే ఆ రూపమే, పంచభూతాలతో సహా, మా ముద్దు గోవిందుడే.

కౌరవుల దగ్గరకు పాండవుల తరపున రాయభార మేగినాడే, యుద్దరంగములో అర్జునుని ధైర్యం చెప్పడానికి కర్తవ్య బోధకు గీతార్ధసారమిచ్చీ, మనలాంటి వారి గీతలెన్నొ మార్చేనే, మా ముద్దు గోవిందుడే.

నీలమై నిఖిలమయ్యి, కాలమై నిలిచాడే, వరదయ్య గానాలా వరదలై పొంగాడే, వేణువు లూదాడే, మది వెన్నలు దోచాడే, మా ముద్దు గోవిందుడే. మరి మీరూ మరియు ఇంట్లో పిల్లలూ పాడి వినిపిస్తారు కదూ? మానసిక బలం శక్తి పెంచుకుంటారు కదూ?

ఈ చిన్న అడుగే, మార్పుకు మొదటి మెట్టు. త్రికరణ శుద్ది గా, మన రాత, మన పాట/ పద్యం/ శ్లోకం, మన ఆచరణ ఉంటే, దేవుడు ఎప్పుడు మన వైపే ఎన్ని కష్టాలు కన్నీళ్ళు వచ్చినా, 5 ఏళ్ళు పైగా మా కధనాలు చదివినా, ఇంకా నమ్మకము సాక్ష్యం కనపడలేదా?

వే వేల గోపెమ్మల (మహిళ)
మువ్వా. గోపాలుడే, మా ముద్దు. గోవిందుడే.. 2
అహ, అన్నుల మిన్నల, కన్నుల వెన్నెల, వేణువులూదాడే..
మది వెన్నలు దోచాడే..
వే వేల గోపెమ్మల, మువ్వా. గోపాలుడే, మా ముద్దు. గోవిందుడే.. (పురుష)

మన్ను తిన్న చిన్నవాడే.. మిన్ను కన్న వన్నెకాడే.. (2) (పురుష)
కన్నతోడు లేనివాడే.. కష్ట తోడు ఉన్నవాడే.. (మహిళ)
మోహనాల వేణువూదే.., మోహనాంగు డితడెనే... (2)
చీరలన్ని దాచి, దేహ చింతలన్ని తీర్చినాడె.., పోతన్న కైతలన్ని పోత పోసుకున్నాడె (పురుష)
మా మువ్వాగోపాలుడే.., మా ముద్దుగోవిందుడే..
వే వేల గోపెమ్మల, మువ్వాగోపాలుడే.., మా ముద్దుగోవిందుడే..(మహిళ)

వేయి పేరులున్న వాడే.. వేల తీరులున్న వాడే.. (2) (మహిళ)
రాసలీల లాడినాడే.. రాయభార మేగినాడే..(పురుష)
గీతార్ధసారమిచ్చీ., గీతలెన్నొ మార్చేనే.. (2)
నీలమై నిఖిలమయ్యి, కాలమై నిలిచాడే.., వరదయ్య గానాలా వరదలై పొంగాడే..(మహిళ)
మా మువ్వాగోపాలుడే.., మా ముద్దుగోవిందుడే..

వే వేల, గోపెమ్మల, మువ్వాగోపాలుడే.., మా ముద్దుగోవిందుడే..(పురుష)
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే.., మది వెన్నలు దోచాడే.. (2)(మహిళ) (పురుష)
వే వేల గోపెమ్మల మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే(మహిళ)

Title : Ve Vela Gopemmala; Movie: Saagara Sangamam; Singers: S.P. Balu, S.P. Sailaja; Lyricist: Veturi; Composer: Illayaraja;
Director: K. Viswanath; Kamal Haasan, Jayaprada, Shailaja, Geetha  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,527; 104 తత్వాలు (Tatvaalu) and views 225,608
Dt : 02-Jun-2023, Upd Dt : 02-Jun-2023, Category : Songs
Views : 274 ( + More Social Media views ), Id : 1771 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Vela , gopemmala , Saagara , Sangamam , Kamal , Haasan , Jayaprada , Shailaja , Geetha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content