కన్యాకుమారి, మధురై , రామేశ్వరం పట్టణంలు, దేవాలయం, సముద్రం ప్రాంతము - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1161 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1190 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

కన్యాకుమారి, అంటే భారతదేశం చివరి కొన స్ధానం దక్షిణం వైపు. అలాగే హిందూ, బంగాళా ఖాతం, అరేబియా సముద్రంలు, మూడు కలిసే చోటు. మధుర మీనాక్షి అమ్మ వారు ప్రసిద్ధి. రామేశ్వరం కూడా రామయ్య శివలింగం ని స్ధాపించిన స్ధలం. వీడియోలో , మంచి పాటలు వినండి.

కొత్తగా వీడియో తీసేవారు ఎలా తీస్తారో, కదులుతూ ఊగుతూ ఉంటుంది కెమెరా, ఈ పాత కన్యాకుమారి వీడియో నే ఉదాహరణ. నూతన ఎడిటింగ్ కూడా చూడవచ్చు, మొత్తం 5 నిమిషాలకు సర్దుబాటు చేయకుండా, చాలా పెద్దది గా ఉంది ఎడిటింగ్, కొత్తగా నేర్చుకోవడం లా.

అమ్మ నాన్న తో కలిసి, చివరి సారి వెళ్లిన ఊర్లు ఈ కన్యాకుమారి, మధురై, రామేశ్వరం లు. మీరు ఆ వీడియో లో చూస్తుంది, 10 ఏళ్ళ ముందువి, ఆనాటి ప్రదేశాలు పరిస్థితులు అనుభూతులు జ్ఞాపకాలు.

రెండో వెబ్సైట్ కోసం చేసిన, మొదటి వీడియో అది. అందుకే అన్నమయ్య సినిమాలో ని, తిరుపతి వెంకన్నను పెట్టింది, అందులో గుర్తు గా. ఇప్పుడు అన్ని ఫోటోలు వీడియో లు 828 అయ్యాయి. ఆ వాలంటరీ వెబ్సైట్, ప్రజా, స్ధల, దైవ, చిన్న వ్యాపార, పండగ కార్యక్రమాల ప్రచారం కోసం పెట్టినది.

నాన్న చివరి రోజుల్లో గుండె పెద్దగా అయింది అని, ఆసుపత్రులకు తిరుగుతూ ఆపరేషన్ కోసం, ఆనాడు మద్రాస్ అపోలో ఆసుపత్రిలో వైద్యం కోసం ఉన్నారు. ఇక్కడ నుండి నేరుగా చెన్నైలో నే దిగి, అక్కడే రెండు వారాలు లోపు ఉండి, అక్కడ నుంచే వెనక్కి వచ్చా, సొంత ఇంటికి కూడా వెళ్ళకుండా.

ఒక్కోసారి రాత్రి లేదా ఉదయం, అమ్మ ను అక్కడ అద్దె రూం లో నే ఉంచి, నేను వెళ్ళి నాన్న కు తోడుగా, కొన్ని సార్లు పడుకున్నాను లేదా తోడుగా ఉన్నాను. ముందు హైదరాబాద్ నిమ్స్, తర్వాత ఎన్నారై ఆసుపత్రిలో ఇంక తేవద్దు ఇక్కడ కు, నెలకన్నా ఎక్కువ ఉండరు, అని తేల్చి చెప్పారు.

కానీ ఎంత ఖర్చు అయినా పర్లేదు అని , మద్రాసు అపోలో లో కూడా చూపించాము వెనకాడ కుండా. 4 ఏళ్లు ఎక్కువ కాలం జీవించారు అనుకుంటా. డాక్టర్ల అనుమతి తీసుకుని, మరలా పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదని, తీర్ధ యాత్ర కు బయలు దేరాము. చిన్న ముత్యం, పిల్ల, మేన మామ కూడా ఉన్నారు.

నాన్న ఆయాసం గా ఉంది, గుండె జబ్బు వలన అన్నా కూడా, ఇదే చివర ప్రయాణం కావచ్చు అని నచ్చ చెప్పి, నేను ఉన్నా కదా తోడుగా పక్కన, ఏమీ కాదు అని ధైర్యం చెప్పి, తీసుకుని యాత్ర కు వెళ్ళాం.

మద్రాస్ నుంచి, రైలు లో మధురై వెళ్లి, అక్కడ రాత్రి ఉండి, కామాక్షి తల్లి ని చూపించి, తర్వాత కారు లో కన్యాకుమారి వెళ్లి అక్కడ అన్ని చూపించి, తర్వాత రామేశ్వరం లో అన్ని దగ్గర ఉండి, చేయిపట్టుకుని నడిపించి చూపించాము.

మరలా మద్రాసు వచ్చి, వారిని ఇంటికి రైలు ఎక్కించి పంపి, నేను వెనక్కి వచ్చాను. డాక్టర్ ల తో మాట్లాడినప్పుడే, మరలా మావాళ్లు వచ్చినప్పుడు, ఖర్చు కు వెనకాడ కుండా, వైద్యం చేయమని కోరాము. ఆ తర్వాత సంవత్సరం అనుకుంటా, శివైక్యం చెందారు.

రూపాయి అప్పు లేకుండా, ఎవరికీ బాకీ లేకుండా, ఎవరితో మాట పడకుండా, ఎవరూ వేలెత్తి చూపకుండా, ఎవరి మీద ఆధారపడ కుండా, ఆ దేవుడు చల్లగా చూసారు. అని రాము గోపీ తొ చెప్పారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1190 General Articles, 47 Tatvaalu
Dt : 24-Apr-2020, Upd Dt : 24-Apr-2020, Category : General
Views : 293 ( + More Social Media views ), Id : 514 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Kanyakumari , Madurai , Rameshwaram trip , TN , India
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content