పాజిటివ్ నెస్ గురించి తప్పుగా అర్థం చేసుకుని, తమకు తామే ఆత్మ ద్రోహం చేసుకుంటారు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1487 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1522 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఈ రోజుల్లో ప్రతి వారు ఈ మాట వాడుతున్నారు, అంతా పాజిటివ్ గా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అండి, అని మనల్ని పతనము చెయ్యడానికి తప్పుడు విషయాలు లో కూడా.

నీతి ధర్మం ఉన్నవారు, కష్టాలలో ఉన్నప్పుడు, మంచి రోజులు వస్తాయి అని, పాజిటివ్ గా ఉండ వచ్చు, అందులో తప్పు లేదు.

బెండకాయలు వంకాయలు కొనడానికే, పుచ్చులు ముదురులు అని, అటు తిప్పి ఇటు తిప్పి, నానారకాలుగా చూసి కొంటామే? - అన్ని మంచివే వస్తాయి లే అని పాజిటివ్ గా తీసుకుంటామా? లేదు కదా?

మరి జీవిత సమస్యలు దగ్గర జాగ్రత్తలు ఉండదా? కీడెంచి మేలు ఎంచు అని మన పెద్దలు చెప్పలేదా?

బాగుపడతానికి పాజిటివ్ గా ఉండాలా? చెడిపోవడానికి పాజిటివ్ గా ఉండాలా?

గోతిలో దూకుతూ, మనకు ఏమీ కాదు, అయితే ఆసుపత్రి ఖర్చు, కాలికో కర్ర నే కదా, పాజిటివ్ గా దూకుదాము అని, ముందుకు వెళదామా? - ఇది మూర్ఖత్వం అవుతుంది

మందు తాగే వాడు, నా బాధలు మరవడానికి, రాష్ట్ర ఆర్థిక స్ధితికి సహాయం అని పాజిటివ్ గా తాగితే? - ఇది మూర్ఖత్వం అవుతుంది

తల్లి ని వదిలేసే వారు, మా పిల్లలు లాగా అన్ని సౌకర్యాలు తో, బెంగళూరులో విదేశంలో చావకూడదు, ఊళ్ళో నే నాటి అరకొర సౌకర్యాలు తో చావమని కృతజ్ఞతలు జాలితో వదిలేశానని, పెద్ద లను పాజిటివ్ గా చెప్పవచ్చు.-- ఇది మూర్ఖత్వం అవుతుంది

తల్లి ని చూసేవాడు, ఇంకా తిరుగుతూ ఉంది పడకుండా, కోటి ఆస్తి పింఛను 50 వేలు వస్తుంది, పోనీలే అని జాలితో చూస్తున్నాను, నాలుగు మెతుకులు పెడుతూ, అనవచ్చు పాజిటివ్ గా. - ఇది మూర్ఖత్వం అవుతుంది

ప్రజలకు అన్ని సదుపాయాలు ఇస్తే, ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తూ లావెక్కుతారు అని నాయకులు,

అలాగే అన్ని పార్టీలు దగ్గర ఓటు కు నోటుకు తీసుకో పోతే వాళ్ళు లావెక్కి, మమ్మల్ని పతనం చేయరేమో అని ఓటరు పాజిటివ్ గా చెప్పవచ్చు. - ఇది మూర్ఖత్వం అవుతుంది

పెళ్ళి సంబంధము వస్తే, అన్ని విషయాలు లోతు పాతూలు కనుక్కోకుండా, అంతా పాజిటివ్ అని కళ్ళు మూసుకుని, ఆస్తి కోసం పెళ్ళి చేస్తామా? - ఇది మూర్ఖత్వం అవుతుంది

అబ్బే మా పిల్లలు చాలా తెలివి గల వారు మా కన్నా, తొందర గా గోతి లో పడతారు, అందుకే వారికే వదిలేస్తాము అన్ని విషయాలు పాజిటివ్ గా. 50 ఏళ్ళు వచ్చిన వారు కూడా మోహం లో ఉంటే, 25 ఏళ్ళ వాళ్ళు మోహము లో ఉండరా? - ఇది మూర్ఖత్వం అవుతుంది

కానీ పాజిటివ్ లో, నీతి నిబద్ధత త్యాగం ధర్మం బాధ్యత ముందు చూపు, కూడా ఉండాలి కదా అని ఎవరు అనుకోరా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1522 General Articles, 51 Tatvaalu
Dt : 02-Feb-2022, Upd Dt : 02-Feb-2022, Category : General
Views : 201 ( + More Social Media views ), Id : 1299 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : misunderstand , positivity , betray , themselves , soul , cheat , self , positiveness
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content