Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Tanuva Hari Chandaname (Bhakti Parady) - Kathanayakuralu - Sobhan Babu, Vanisri
మన ప్రతి పాటతో పాటుగా ఎన్ని విన్నపాలు జనాలకు చేరుతున్నాయో చూడండి, వారి ముదుసలితనం భవిష్యత్ రాతను బట్టి వారు చదువుతారు/ చదవరు, ఆచరిస్తారు/ చీత్కరిస్తారు, స్పందిస్తారు/ స్పందించరు - 1. మన శని వార సాధనలు 2. గాత్ర వ్రాత నైవేద్యం మీరు పెట్టమని ప్రోత్సాహం 3. ముదుసలి తల్లి దండ్రి అత్త మామలను దగ్గర ఉంచి చూసుకోమని విన్నపం 4. పిల్లలకు సంస్కారం నేర్పితే మనకు ఉండి, మనల్ని ముదుసలి తనములో, దేవతలు గా కొలుస్తారు అని మేల్కొలుపు 5. నాయకులది తప్పు లేదు, వారిని ఎన్నుకున్న మన నక్క, పాము, పులి గుణాల ఓటర్లు దే మొదటి తప్పు, 6. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడండి, లేకపోతే పంచభూతాల శిక్షణ తప్పదు, ఇలా ఎన్నో విన్నపాలు జాగ్రత్తలు కూడా వెళుతున్నాయి, మరువద్దు సుమీ.
మనము చేస్తుంది ఉత్త జపమా, ఉహు, అది హరి చందనమే. పోనీ ఉత్త తపమా, ఉహు, అది దైవాన్ని నిరంతరము తలచే మకరందమే. ఆ దైవ నామాలు పాడగనే, మనసు పులకించి, తన్మయత్వముతో, కలిగేను కాదా ఈ ధ్యానం, ఆ విధముగా ఆచరణలో దైవ గుణాలను చూపిస్తుంటే, నిరంతన సాధనతో కలిగేను కాదా ఆ మోక్షం.
ఈ ప్రపంచ బ్రమలు, మోహనాలు, కనుసైగ చేసే, కోరికల తలపుల అనురాగ లతలు, జీవిత బంధాలు వేసే. మరి వీటినుంచి బయటపడాలి అంటే, హరి విల్లుగా, ఆ హరి నామమే, గురి చూసి, హృదయాన, స్తిరమాయెగా, మన నిత్య సాధనతో. దైవాన్ని చేరమా, ముక్తినొందమా?
శివ కేశవ బేధమే లేదు కదా. మన కోసమే ఈ శివ పంచక్షరి, విరబూసి మా హ్రుదయమందు నిలచిందిలే. దైవాన్ని చేరే మనసును, ఆధ్యాత్మికము, మరులూరించగా, నిత్య నీతి నియమాల సుగుణాల ఆచరణలో, జపాల తపాల ధ్యానించమా, స్మరింయిచమా, తరింయిచమా.
మిత్రులారా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ఇకనైనా వీడుదాం. 30 ఏళ్ళు దాటినాక, మానసిక నియంత్రణ, మనల్ని మనం తెలుసుకోవడం, సరి చేసుకోవడం అందరికీ, మనశ్శాంతి, ఆరోగ్యం.
జపమా..ఉహు. హరిచందనమే..
తపమా..ఉహు.. అది మకరందమే - ||జపమా||
ఆనామా.లు పా.డగనే..
కలిగే.ను కాదా ఈ ధ్యానం, కలిగే.ను కాదా ఆ మోక్షం ||జపమా|| ||జపమా||
ఈ మోహనా.లు, కనుసైగ చేసే
అనురా.గ లతలు. బంధా.లు వేసే ఉహు .. హు .. ఓహో - 2 సార్లు
హరి విల్లుగా ఆ హరి నామమే 2
గురి చూసి, హృదయాన, స్తిరమాయెగా..
మిము చేరమా, ఉ, ముక్తినొందమా..||జపమా||
మాకోసమే ఈ. శివ పంచక్షరి ..
విరబూసి మాయందు నిలచిందిలే...ఆ...ఆ...ఆ...- 2 సార్లు
ఆధ్యాత్మికము, మరులూరించగా 2
జపా.ల, తపా.ల, ధ్యానించమా..
స్మరింయిచమా..ఆ, తరింయిచమా.. ||జపమా||
Original
తనువ..ఉహు. హరిచందనమే..
పలుకా..ఉహు.. అది మకరందమే - ||తనువ||
కుసుమా.లు తా.కగనే..
నలిగేను కాదా ఈ మేను, నలిగేను కాదా నీ మేను ||తనువ|| ||తనువ||
నీ సోయగా.లు కనుసైగ చేసే
అనురా.గ లతలు బంధా.లు వేసే ఉహు .. హు .. ఓహో - 2 సార్లు
హరివిల్లునై, ఈ విరి బాణమే 2
గురి చూసి, హృదయాన, విసిరేయనా..
నిను చేరనా, మురిపించనా..||తనువ||
నీకోసమే ఈ. నవ పారిజాతం ..
విరబూసి నీముందు నిలచిందిలే...ఆ...ఆ...ఆ...- 2 సార్లు
మధుపాయినై, మరులూరించనా 2
ఉయ్యాల, జంపాల, ఊగించనా..
లాలించనా..ఆ పాలించనా ||తనువ||
చిత్రం : కథానాయకురాలు (1971); సంగీతం : ఆకుల అప్పల రాజ్; గీతరచయిత : విజయ రత్నం; నేపధ్య గానం : బాలు, సుశీల
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2269 General Articles and views 2,600,364; 104 తత్వాలు (Tatvaalu) and views 277,571
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments