శుక్ర వారపు పొద్దు సిరిని విడువద్దు, కల్లలాడని ఇంట, గోమాత వెంట - లక్ష్మి కటాక్షం NTR, KR Vijaya - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,874,951; 104 తత్వాలు (Tatvaalu) and views 225,717.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Sukra varapu poddu sirini viduvaddu - Lakshmi Kataksham - NTR, KR Vijaya

*పాటతో పరమార్ధం - శుక్ర వారపు పొద్దు సిరిని విడువద్దు, కల్లలాడని ఇంట - లక్ష్మి కటాక్షం - NTR, KR Vijaya*

దేవత లు అందరిలో లక్ష్మీ దేవి అంటే, అందరికీ భయమే మరియు అవసర అవకాశ భక్తే, లక్ష్మి కటాక్షం క్షణము లో రావచ్చు అలాగే పోవచ్చు. అందరూ ధనవంతులు ఐశ్వర్యవంతులు కావాలని, ఖచ్చితము గా లక్ష్మీ పూజ చేస్తారు, దీపావళికి కూడా. లక్ష్మి అంటే, ధనము ఒక్కటే గాందండోయ్, ఆరోగ్యం, మనశ్శాంతి, వాక్సుద్ది, చిత్తశుద్ది, సంస్కారం, సజీవ గురువు సేవ కూడా. ధనం ఉండి, ఇవి లేకపోతే, ఉపయోగము లేదు కదా.

తేట తెలుగు పదాలలో ఈ పాటను చూడండి వినండి, లక్ష్మీ దేవి మనతో నిలబడాలి ఎల్లకాలము అంటే, ఎన్ని వివరణలు ఇచ్చారో, ఇవన్నీ మన పెద్దలు చెప్పారు, కానీ మనము పాటించము. ఒక సారి ధనం, పదవి, అధికారం, ఉద్యోగం, వ్యాపారం మంచి గా రాగానే, గతం మరచిపోతాము. కనీసం ముదుసలి తల్లి తండ్రులు అత్త మామలను కూడా ఇంట్లో పెట్టుకుని సమాన సౌకర్యాలు ఇవ్వము కదూ? తర్వాత నష్టాల పాలయి, అన్ని పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు కళ్ళు తెరచినా ఉపయోగములేదు.

శుక్రవారపు రోజు ధనము వదలవద్దు (అవసరానికి లేవు అనడం కూడా తప్పే, ఆసుపత్రిలో కట్టము అంటే ఊరుకుంటారా), ఏ రోజైనా దీపం ఆర్పవద్దు, అన్నాన్ని నెట్టవద్దు, తోబుట్టువులనే కాదు ఎవరి మనసు కష్ట పెట్టవద్దు, ఉదయ సంధ్య సాయంత్ర సంధ్య సమయములో నిద్రపోవద్దు, అప్పుడు లక్షీదేవి మనల్ని విడువదు. అంటే కనీసం అనారోగ్య పాలు, మనశ్శాంతి కొల్పోవడం ఉండదు.

ఇల్లాలు కంటతడి పెట్టని ఇంట, అబద్దాలు ఆడని ఇంట, గోమాత వెంట, ముంగిళ్ళ ముగ్గుల్లొ, పసుపు గడపల్లో, పూలల్లో, పాలల్లో, ధాన్యరాశుల్లో, మహాలక్ష్మి స్థిరముగా ఉంటుంది. త్రికరణ శుద్దిగా దేవుని పూజిస్తే, మనకు అంతా మంచే జరుగుతుంది. మరి అరిషడ్వర్గం అష్టవ్యసనం లో ఓలలాడుతూ, యాత్రలు చేసినా, పూజలు చేసినా, అర్హత లేని మనకు ఇంకా ఎక్కువ నష్టం కలుగుతుంది సుమా, ప్రస్తుత దశ ముగియగానే.

శుక్రవారపు పొద్దు సిరిని విడువొద్దు
దివ్వెనూదగ వద్దు, బువ్వనెట్టొద్దు
తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు
తొలిసంజ మలిసంజ నిదురపోవద్దు
మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు

ఇల్లాలు కంటతడి పెట్టని ఇంట
కల్లలాడని ఇంట, గోమాత వెంట
ముంగిళ్ళ ముగ్గుల్లొ, పసుపు గడపల్లో
పూలల్లో, పాలల్లో 2, ధాన్యరాశుల్లో
మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు 2

లక్ష్మీ కటాక్షం యన్టీ రామారావు, కె.ఆర్.విజయ కాంబినేషన్‌లో పింజల సుబ్బారావు రూపొందించిన చిత్రం. బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 1970 ఫిబ్రవరి 12న విడుదలయ్యింది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,874,951; 104 తత్వాలు (Tatvaalu) and views 225,717
Dt : 05-Feb-2021, Upd Dt : 05-Feb-2021, Category : Songs
Views : 4024 ( + More Social Media views ), Id : 955 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sukravarapu poddu , sirini , viduvaddu , lakshmi kataksham , ntr , kr vijaya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content