అన్నమయ్య కీర్తన తందనానా బ్రహ్మ మొకటే- శృతిలయలు- రాజశేఖర్, సుమలత, బాలు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2140 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2175 General Articles and views 2,220,777; 104 తత్వాలు (Tatvaalu) and views 245,368.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Sruthilayalu Annamayya Keerthana - Thandanana Brahmam Okate - Rajasekhar, Sumalatha, Balu

అన్నమయ్య కీర్తన లో, సినిమాలో 3 చరణాలే ఉంది, ఇక్కడ మొత్తము 5 చూడవచ్చు, పెద్ద పాట ఇది. దేవుడు ఒకడే, అందరూ ఆయనకు సమానమే అన్న వివరణలు తో కూడిన బంగారపు పాట. మరి మీరూ పాడి, మనశ్శాంతి పొందుతారు కదూ? పిల్లలకు వివరించి, పాడిస్తారు కదూ?

ఇతర మతాలకు మనకు ఇదే తేడా. ఎక్కువ తక్కువ, తన మన అనే బేధము, అనేది ఏదీ లేదు, అందరికి శ్రీహరే అంతరాత్మ, మన మందరము ఆత్మస్వరూపులము అని అర్ధం అయితే, ఈ గొడవులు మోసాలు కు తావు లేదు.

అది అర్ధం కాని వారు, అరిషడ్వర్గాలలో అష్టవ్యసనాలలో చిక్కి, చివరకు పతనము అవుతున్నారు.

రాజూ అయినా బంటు అయినా, నిద్ర ఒకటే. బ్రాహ్మణుడు , చండాలుడూ కాలు పెట్టే భూమి ఒకటే. దేవతలకు, మానవులకు, కీటకాలు పక్షులు పశువులకు ఆ సుఖము ఒకటే.

పగలు రేయి, ధనవంతునికి బీదవానికి ఒకటే. పంచ భక్ష పరమాన్నములు తినే వారికి, గుప్పెడు మెతుకులు తినే వారికి ఆకలి ఒక్కటే. సువాసనలకు దుర్వాసనలకు, గాలి ఒకటే.

ఏనుగు మీద, కుక్క మీద పడే ఎండ ఒకటే. పుణ్యాత్ములకు అలాగే పాపాత్ములను రక్షించేది వెంకన్న నామమొక్కటే అంటూ అన్నమయ్య గానం చేసారు.

తందనాన అహి, తందనాన పురె
తందనాన భళా, తందనాన ॥

బ్రహ్మ మొకటే, పరబ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే, పరబ్రహ్మ మొకటే ॥

కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ ।
ఇందులో జంతుకుల మంతా ఒకటే
అందరికీ శ్రీహరే అంతరాత్మ ॥

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర - అదియు నొకటే ।
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే ॥

అనుగు దేవతలకును అల కామ, సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ, సుఖ మొకటే ।
దిన మహోరాత్రములు - తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు ॥

కొరలి శిష్టాన్నములు తును, నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను, నాక లొకటే ।
పరగ దుర్గంధములపై, వాయు వొకటే
వరస పరిమళముపై, వాయు వొకటే ॥

కడగి ఏనుగు మీద, కాయు ఎండొకటే
పుడమి శునకము మీద, బొలయు నెండొకటే ।
కడు పుణ్యులను - పాప కర్ములను, సరి గావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే ॥  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2175 General Articles and views 2,220,777; 104 తత్వాలు (Tatvaalu) and views 245,368
Dt : 13-Mar-2023, Upd Dt : 13-Mar-2023, Category : Songs
Views : 611 ( + More Social Media views ), Id : 1723 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sruthilayalu , annamayya , keerthana , thandanana , brahmam , okate , rajasekhar , sumalatha , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content