శ్రీమతి ఒక బహుమతి - ఆడదే ఆధారం మన కథ, నింగిని విడిచిన చినుకుకు - విసు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2238 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2273 General Articles and views 2,688,520; 104 తత్వాలు (Tatvaalu) and views 284,366.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*Song Spirit - Srimathi Oka Bahumathi - Aadadhe Aadharam (Guname adharam, mana kadha adane arambham Devotional Parody)* - Visu, Chandramohan, Naresh, Jayasudha, Kalpana, Muchcherla Aruna

పాటతో పరమార్ధం - శ్రీమతి ఒక బహుమతి - ఆడదే ఆధారం (గుణమే ఆధారం, మన కథ ఆడనె ఆరంభం భక్తి పేరడీ)* - విసు, చంద్రమోహన్, నరేష్, జయసుధ, కల్పన, ముచ్చెర్ల అరుణ

ప్రతిభావంతుడైన ఒక దర్శకుడు, ఓ మంచి కధతో, సినిమా తీస్తే ఎలా ఉంటుందో, ప్రేక్షకుల మనసులను ఎలా కదిలిస్తుందో, ఎంత సహజముగా అది మన ఇంటి లేదా పక్కింటి కధ అన్నట్లుగా తీసే గొప్పతనము, విసు గారికి ఉంది.

సినిమాలో జరిగే ప్రతి ఒక్క సన్నివేశం, వామ్మో ఇలాగ ఉంటాయా అనుమానాలు అవమానాలు, భార్యా భర్తలు లేదా ఉమ్మడి కుటుంబం లో కష్టాలు కన్నీళ్ళు అన్ని, ఏకరువు పెట్టారు ఈ సినిమాలో. ఒక్కో వ్యక్తి ఆలోచనలు మూర్ఖత్వం, ఎన్ని ఇక్కట్లకు దారితీస్తుందో, ప్రతి ఒక్కరు చూడాలి.

ఈ సినిమాకు కధ నే దర్శకుడే హీరో, హీరోయిన్, నటులు అసలు మనకు కనపడరు కేవలం పాత్రలే, కధ మాత్రమే నడుచుకుంటూ మనల్ని నడిపిస్తూ, కన్నీళ్ళు ఆశ్చర్యముతో, చివరిదాకా లాక్కెళుతుంది.

సినిమా గురించి అది గొప్పతనమైతే, ఇక పాటలు రాసిన సిరివెన్నెల శాస్త్రిగారిని ఇంకా మెచ్చుకోవాలి. ఆడ వారి గొప్పతనాన్ని, అలాగే వారి వలన కలిగే పతనాలను, కట్టగా పేర్చి, ప్రత్యక్ష సాక్ష్యాలతో, ఓ పాటలో రాసేసారు.

అందుకే పిల్లల్ని వీర శివాజీ లాగా తీర్చేది అమ్మనే, అలాగే చేతగాని మొద్దు గా మూర్ఖుడు గా చేసేది అమ్మనే. భర్తను దద్దమ్మగా చేసేది భార్యనే, గొప్పవాడిగా తీర్చిదిద్దేది భార్యనే. చేసుకున్న వారికి, చేసుకున్నంత.

అందుకే మన పెద్దలు గుణమును చూసి పెళ్ళి చేసారు ఆనాడు. ధనమును/ అందము/ ఉద్యోగము/ హోదా/ విసా చూసి పెళ్ళి చేస్తున్నారు ఈనాడు, సంవత్సరానికే లుకలుకలు పక్కింటివాళ్ళ లేదా బంధువుల/ స్నేహితుల చెవులు పగులుతున్నాయి. లేదా, భార్యా భర్తలే ఒకరి గొయ్య ఒకరు తీసుకుని, కుటుంబాన్ని పతనం చేస్తున్నారు.

సేతువు కట్టడానికి కారణం, యముడి తో పోరింది, వేమన వేదానికి నాదం ఆడదే. దశరధుని, భీష్ముని, విశ్వామిత్రుని, పల్నాడు పతనం కు కారణం ఆడది. పాండవులకు కీర్తి, చండ్రుడు ఇంద్రునకు అపకీర్తి, తాజ్మహల్ కట్టడానికి, ఎన్నో రాజ్యాలు కూలడానికి, కారణం ఆడది అని రాసారు. కోడల్ని తగులబెట్టే, అత్త కూడ ఆడదదే అని నొక్కి చెప్పారు.

ఇంకో పాటలో, కొంత మంది, తర్వాత జరగబోయే పర్యవసనాలను అలోచన చేయకుండా, ఏదో తమకు తోచింది చేసేస్తారు, వెనకా ముందు చూడకుండా. దాని వలన ఎన్ని కష్టాలు వస్తాయో, వారికి పట్టదు. ఇందులో అదే తెలిపారు, ఆకాశం లో నుంచి కింద పడ్డ చినుకు ఎక్కడ పడుతుందో తెలుసా? సముద్రము లో వ్రుధాగా కలసి పోతుందో లేక భూమి పై పడి మొక్క కు అండగా వస్తుందో తెలీదు. ఆకాశం అంచు, సముద్రం లోతు కొలవవచ్చు కానీ ఆడవారి మనసులో భావాలు కనిపెట్టడం కష్టం అని చెప్పారు పాటలో.

శ్వాస ప్రక్రియకోసం, మీరూ పాడే ప్రయత్నం చేస్తారు కదూ.

1) ఆడదే ఆధారం, మన కథ ఆడనె ఆరంభం, ఆడదే సంతోషం, మనిషికి ఆడదె సంతాపం 2

కోతిమంద చేత, సెతువే నిర్మింప, చేసింది ఆడదిరా
నాడు తాళికోసం, యముడి కాలపాశంతోనే, పోరింది ఆడదిరా
ఖడ్గతిక్కన్న కత్తి తుప్పు పట్టకుండ, ఆపింది ఆడదిరా
అల్ల బాలచంద్రుడి, చండభాను తేజం వెనుక, వెలిగింది ఆడదిరా
వేమన వేదానికి నాదం, ఒక ఆడదిరా 2
ఇతగాడ్ని నడుపుతున్నది, అటువంటి ఆడదిరా ||ఆడదే ఆధారం 2||

దశరధుడ్ని నాడు దిక్కులేని దశకు , తెచ్చింది ఆడదిరా..
అయ్యో భీష్ముడంతటివాడ్ని అంపశయ్యను పెట్టి , చంపింది ఆడదిరా..
అందాల అగ్గిలో విశ్వామిత్రుడి నిష్ట , చెడిపింది ఆడదిరా
ఆహ పల్నాడు నేలంతా పచ్చి నెత్తుట్లోన , తడిపింది ఆడదిరా
కోడల్ని తగులబెట్టే, అత్త కూడ ఆడదిరా 2
ఈ మగవాడ్ని నేడు, చెరిచింది ఆడదిరా ||ఆడదే ఆధారం 2||

పంచ పాండవులకు, కీర్తి కిరీటాలు, పెట్టింది ఆడదిరా
అయ్యో ఇంద్రుడు చంద్రుడు, అపకీర్తి పాలైన, కారణం ఆడదిరా
పోతపోసిన పున్నమంటి తాజ్ మహల్, పునాది ఆడదిరా
అయ్యొ మేటి సామ్రాజ్యల కోటలెన్నొ, కూలగొట్టింది ఆడదిరా
మంచికయిన చెడుకైనా, మూలం ఒక ఆడదిరా 2
చరిత్రలో ప్రతి పుట, ఆమె కధే పాడునురా ||ఆడదే ఆధారం 2||

2) నింగిని విడిచిన, చినుకుకు తెలియున, తన గత ఏమౌనో
కడలిని కలియును..పుడమిని మొలుచును
ఫలితం ఏమౌనో, ఫలితం ఏమౌనో, ఫలితం ఏమౌనో ||నింగిని విడిచిన||

బండరాళ్ళ బాట కానీ, ఆగిపోదు ఆకురానీ
మురిపించే, సాగర గానం, స్వాగతమిస్తుంటే
కొండ కోన దాటుకుంటూ, గుండె వీణ మీటుకుంటూ
పరుగుల్లో, మలుపుల కలతలు, సంగతులవుతుంటే,
కెరటాలతో, కలిసాకనే, కన్నె నదికి నెమ్మది కాగా ||నింగిని విడిచిన||

గగన సీమ, అంచులు తెలుసు, జలధిలోని, లోతులు తెలుసు
తెలిసేనా, మగువ మనసులో, మెదులుతున్న ఊసు
సోగకళ్ళు సైగ చేస్తే, సాగిరావ సాగరాలే
తడపడుతూ., సుడిపడదా., చిన్నవాడి వయసు
కడ కొంగుతో., నడిపించితే., వెళ్ళేదారి అతడికి తెలుసా ||నింగిని విడిచిన||

3) ఈ పాటలో అనవసరముగా ఆడవారిని ఎత్తిపొడుస్తూ, వారి వలనే అంతా బాగు, అలాగే అంతకన్నా ఎక్కువ నాశనం అయ్యింది అని చూపారు/ రాసారు/ పాడారు. అది అబద్దం. మగ ఆడను బట్టి, మంచి చెడు జరగదు.

In this song, they unnecessarily singled out women and showed/wrote/sung that everything is good because of them, and even more is destroyed. That is a lie. Good and bad do not happen depending on a man or a woman.

కేవలం వారి గుణాన్ని బట్టి మాత్రమే మంచి చెడు జరుగుతుంది. సత్వ గుణమైతే, మంచి జరుగుతుంది. రజో తమో గుణాలు అయితే, పతనం వెన్నుపోటు గుండెపోటు రోగపోటు జరుగుతుంది. ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం, వేదాల నుంచి నేటి వరకు ఇది అక్షర సత్యం.

Good and bad happen only depending on their Guna. If they are of Sattva, good happens. If they are of Raja and Tamo, then they fall, have backstabbing, heart attacks, and Disease outbreak. This is the evidence of history, and this is the literal truth from the Vedas to this day.

మనము ఆ తప్పును సరి చేసి, గుణము వలనే మంచి చెడు అని పేరడీ సొంత పదాలతో రాసి పాడాము. అందరికీ వినిపిస్తారు కదూ.

We have corrected that mistake and have written in our own words and sung, parodying that good and bad are due to Guna. Everyone will hear it.

విశ్వామిత్ర దగ్గరకు రంభ వస్తే డాన్సర్ గా, విశ్వామిత్రుని నిష్ట ఏమైంది? ఆయనిది తప్పు కాదా? అది తమో గుణం కాదా? అది ఆయన మానసిక బలహీనత కాదా? తన తపోనిష్ట పోగొట్టుకోలేదా? రంభ వ్రుత్తి డాన్సర్, మరి మీ బుద్ది ఏమైంది? పాట లోని మిగతా ఉదాహరణలు ఇలాగే ఏక పక్షముగా ఉంటాయి, గుణం/ మానసిక బలహీనత చెప్పకుండా.

When Rambha came to Vishwamitra as a dancer, what happened to Vishwamitra's determination? Isn't that his fault? Isn't it the nature of Tamo? Isn't it his mental weakness? Hasn't he lost his determination to perform penance? Rambha is a dancer by profession, and what happened to your intelligence? The rest of the examples in the song are similarly one-sided, without mentioning the quality/mental weakness.

గుణమే ఆధారం, మన కథ ఆడనె ఆరంభం, సత్వగుణమే సంతోషం, మనిషికి రజొతమోగుణమే సంతాపం 2

The basis is the Guna, the beginning of our story is Guna, the
Satva guna is happiness, the Rajo Tamo guna of man is sorrow.

కోతిదండు చేత, సెతువే నిర్మింప, చేసింది గుణమేరా
నాడు తాళికోసం, యముడి కాలపాశంతోనే, పోరింది గుణమేరా
ఖడ్గతిక్కన్న కత్తి తుప్పు పట్టకుండ, ఆపింది గుణమేరా
అల్ల బాలచంద్రుడి, చండభాను తేజం వెనుక, వెలిగింది గుణమేరా
వేమన వేదానికి నాదం, సత్వ గుణమేరా 2
మనల్ని నడుపుతున్నది, అటువంటి గుణమేరా ||గుణమే ఆధారం 2||

దశరధుడ్ని నాడు దిక్కులేని దశకు , తెచ్చింది గుణమేరా..
అయ్యో భీష్ముడంతటివాడ్ని అంపశయ్యను పెట్టి , చంపింది గుణమేరా..
అందాల అగ్గిలో విశ్వామిత్రుడి నిష్ట , చెడిపింది గుణమేరా
ఆహ పల్నాడు నేలంతా పచ్చి నెత్తుట్లోన , తడిపింది గుణమేరా
జీవుల్ని పతనం చెసేది, రజో తమ గుణమేరా 2
ఈ జీవులను చెడిపింది, మానసిక హీన గుణమేరా ||గుణమే ఆధారం 2||

పంచ పాండవులకు, కీర్తి కిరీటాలు, పెట్టింది గుణమేరా
అయ్యో ఇంద్రుడు చంద్రుడు, అపకీర్తి పాలైన, కారణం గుణమేరా
పోతపోసిన పున్నమంటి తాజ్ మహల్, పునాది గుణమేరా
అయ్యొ మేటి సామ్రాజ్యల కోటలెన్నొ, కూలగొట్టింది గుణమేరా
మంచికయిన చెడుకైనా, మూలం ఒక గుణమేరా 2
చరిత్రలో ప్రతి పుట, గుణ కధే పాడునురా ||గుణమే ఆధారం 2||

సినిమా : శ్రీమతి ఒక బహుమతి (1987), సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం : శంకర్ - గణేష్, గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, దర్శకత్వం విసు
తారాగణం చంద్రమోహన్, నరేష్, జయసుధ, కల్పన, ముచ్చెర్ల అరుణ
Srimathi Oka Bahumathi, Aadadhe Aadharam, Ningini Vidichina Chinukuku, visu  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2273 General Articles and views 2,688,520; 104 తత్వాలు (Tatvaalu) and views 284,366
Dt : 21-Jul-2022, Upd Dt : 21-Jul-2022, Category : Songs
Views : 1264 ( + More Social Media views ), Id : 1469 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : srimathi , bahumathi , aadadhe , aadharam , ningini , vidichina , chinukuku , visu , sirivennela , naresh , chandramohan , jayasudha , aruna , kalpana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content