శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము - కౌసల్య తనయ శ్రీరామ కౌస్తుభాంగా - ఘంటసాల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,557; 104 తత్వాలు (Tatvaalu) and views 224,972.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 3 min read time.

అమర గాన గంధర్వుడు ఘంటసాల గారి గానామ్రుతములో ఈ పాట వినండి, ఎంత తన్మయత్వము గా పాడారో. నా కైతే, ఆ గొంతు పట్టుకుని ముద్దాడాలి అనిపిస్తుంది.

ఇక మన ఆపదమొక్కుల వాడు, అలివేలుమంగమ్మ ఇలవేల్పు తిరుపతి వెంకన్న సంగతి చెప్పక్కరలేదు. ఆ రూపము చూసి మరలా చూపు తిప్పుకోవటము సాధ్యము కాదు.

మీరూ ఈ మాటలు పలుకుతూ, మీ పిల్లల చేతిలో పలికిస్తూ, వాక్సుద్ది పొందుతారు కదూ?

కౌసల్య తనయ! శ్రీరామ! కౌస్తుభాంగా
తూర్పున భానుడుదయించె తోయజాక్షా
దేవ సంబంధ కార్యాలను తీర్చుకోగ
వేడుకొందుము మేలుకో... శ్రీ వేంకటేశా

లేవయ్య శ్రీహరి గోవింద లెమ్ము నిదురా
కళ్యాణ మొనరించ వేగ కమలనయనా
ప్రొదెక్క నున్న దటు చూడ భుజగ శయనా
వేగలేవయ్య మము బ్రోవ వేంకటేశా

మధుకైట భారి, శ్రీ హరి ప్రక్కనుండి,
ఎల్ల లోకములు గన్న మా తల్లీ, లక్ష్మీ,
ఆశ్రిత మానవుల సదా... ఆదరించ
అలివేలు మంగమ్మ ఇక మేలుకొమ్మా ఆ ఆ

బ్రహ్మాది దేవతలందరు భక్తి మీర
సురగురూత్తముని వెంట తరలి నేడు
నీ దివ్య రూపంబు గానగ నిలచినారు
శీఘ్రముగ లేవయ్య శ్రీ శ్రీనివాసా

కమలాలు వికసించు కాలమాయే
నానా సుగంధ కుసుమాలు నవ్వె నవిగో
పక్షుల గుంపుల తీయని పాట వినగ
వేగ లేవయ్య నిదుర శ్రీ వేంకటేశా ఆ ఆ

గ్రహములన్నియు నీ యనుగ్రహము పొందా
అష్టదిక్పాలు రందరు నిష్టతోడా
నీదు పుష్కర స్నానమాడి నిలచినారు
చూడ లేలెమ్ము... అయ్యెనిక సుప్రభాతం ఆ ఆ ఆ

పద్మనాభ... పురుషోత్తమ... పాపనాశా
వేంకటా చలపతి.. విభో.. వేంకటేశా
శీఘ్రముగ లేవయ్య ప్రభు శ్రీనివాస
జూడ మా తండ్రి అయ్యెనిక సుప్రభాతం సుప్రభాతం ఊ ఊ

ఆకాశ గంగోదకంబును లోకనాధ
తెచ్చి పూజాదులకై ముందె వచ్చిరయ్యా
వేదోప నిషన్ మూర్తులౌ వైదికులును
వేచియున్నారు లేవయ్యా శ్రీవేంకటేశా ఆ ఆ ఆ

లేచి నిను జూడ యీ వేళ నోచినామూ
ప్రభూ... లేచి నిను జూడ యీ వేళ నోచినామూ
ఏ పూర్వ పుణ్య ఫలముగా యెరుగ లేము
చేసిన పాపాలు నేటితో మాసిపోగ
వేడుకొందుము కఋనించ వేంకటేశా ఆ ఆ ఆ ఆ

మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనీ
చక్రవర్తి తనూజాయ సార్వ భూమాయ మంగళం

Sri Venkateswara Suprabhatham by Ghantasaala kousalya tanaya  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,557; 104 తత్వాలు (Tatvaalu) and views 224,972
Dt : 01-Apr-2022, Upd Dt : 01-Apr-2022, Category : Songs
Views : 1436 ( + More Social Media views ), Id : 1323 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : venkateswara , suprabhatham , ghantasaala , kousalya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content